Author Archives: BRSpartyonline

స్వల్ప తేడాతో 13 చోట్ల ఓటమి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అతి స్వల్ప తేడాతో 13 స్థానాలను కోల్పోయిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను అతిపెద్ద పార్టీగా ఆశీర్వదించారని చెప్పారు.

జుమ్లా.. లేదంటే హమ్లా!
అయితే అబద్ధపు వాగ్దానాలియ్యాలి లేకుండా దాడులకు దిగాలి (జుమ్లా నైతో హమ్లా) అనేదే బీజేపీ విధానమని కేటీఆర్ విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో చిచ్చుపెట్టి ఓట్లు దండుకొనేందుకు యత్నిస్తున్న మత పిచ్చోళ్లను ఓటుతో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

సేవ్ హైదరాబాద్
ఎవరో కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్ ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్ మొత్తం ఆగమైతదని, అది హైదరాబాద్‌కు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు.

మీరు ఆగమైతే..హైదరాబాద్ ఆగమైతది
ఎవరో కొందరి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్ నగర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్ మొత్తం ఆగమైతదని, అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు.

అందరికీ సంక్షేమం
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరినీ ఆదుకొన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. శాంతిభద్రతల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదన్నారు. టార్చిలైట్ పెట్టి వెతికినా వివక్షకు చోటులేకుండా చేశామని ఉద్ఘాటించారు.

మోదీ.. గిదేంది?
రాష్ర్టానికి దేశ ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజల పక్షాన ముఖ్యమంత్రి స్వాగతం పలుకడం సంప్రదాయం. ఇందుకు భిన్నంగా తనకు స్వాగతం పలుకడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రానవసరంలేదని ప్రధాన మంత్రి కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించింది.
అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలె
“నేనేమో ఐటీ కంపెనీలు తెచ్చి కొలువులు ఇప్పిస్తం అంటున్న. వాళ్లేమో హిందూ, ముస్లిం పంచాయతీలు పెట్టి కర్ఫ్యూలు తెస్తం అంటున్నరు. ఎవరు కావాల్నో ఆలోచించండి. మన బతుకులు బాగుచేసే వాళ్లను, మనల్ని ప్రశాంతంగా ఉండనిచ్చే వాళ్లను గెలిపించండి” అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

బీజేపీ నేతలు గోబెల్స్‌కు కజిన్స్
పెట్టుబడుల ఉపసంహరణనే విధానంగా పెట్టుకున్న బీజేపీ.. అవకాశం వస్తే హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ కోటను కూడా అమ్మేస్తుందని, జీహెచ్‌ఎంసీనీ ప్రైవేట్ పరం చేస్తుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. బీజేపీ అసమర్థ, అవివేక విధానాలతోనే దేశఆర్థిక వ్యవస్థ దివాలా తీసిందని ఆరోపించారు.



