Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సేవ్‌ హైదరాబాద్‌

-భాగ్యనగర వాసులకు కేసీఆర్‌ పిలుపు
-యువత, టెకీలు, మేధావులు ముందుకు రావాలని విజ్ఞప్తి
-బీ పాసా.. కర్ఫ్యూ పాసా?.. మీకు ఎలాంటి హైదరాబాద్‌ కావాలి?
-విచక్షణతో ఆలోచించండి .. మీరు ఆగమైతే హైదరాబాద్‌ ఆగమైతది
-ఇది శ్రేయస్కరం కాదు.. నగరాన్ని ఉజ్వలంగా ముందుకు తీసుకుపోదం
-తెలంగాణ రాష్ట్ర ప్రజలే మా బాసులు.. మేం ఢిల్లీకి గులాములం కాదు
-మంచి అభ్యర్థులను నిలబెట్టినం.. గతంకన్నా ఐదారు ఎక్కువ ఇవ్వండి
-హైదరాబాద్‌ అభివృద్ధి నా బాధ్యత.. టీఆర్‌ఎస్‌ సభలో సీఎం కేసీఆర్‌

ఎవరో కొందరు చేసే రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, ప్రేలాపనలకు ఆగం కావొద్దని హైదరాబాద్‌ ప్రజలకు సీఎం కే చంద్రశేఖర్‌రావు సూచించారు. ఒకవేళ వారి మాటలకు ఆగమైతే హైదరాబాద్‌ మొత్తం ఆగమైతదని, అది హైదరాబాద్‌కు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని చెప్పారు. శనివారం ఎల్బీస్టేడియంలో టీఆర్‌ఎస్‌ నిర్వహించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. గత ఆరేండ్లలో హైదరాబాద్‌లో చాలా మార్పు వచ్చిందని, అలాంటి నగరాన్ని కాపాడుకొనేందుకు మేధావులు, యువత నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఓటు వేసేముందు టీఎస్‌ బీపాస్‌ కావాలో.. కర్ఫ్యూ పాస్‌ కావాలో ఆలోచించాలన్నారు. తెలంగాణ ప్రజలే తమకు బాసులన్న సీఎం.. అభ్యర్థులందర్నీ మంచివాళ్లను పెట్టామని, పోయినసారి ఇచ్చినదానికంటే ఏకపక్షంగా ఇంకో ఐదారు సీట్లు ఎక్కువ ఇచ్చి టీఆర్‌ఎస్‌ను దీవించాలని కోరారు. గుండెలనిండా దేదీప్యంగా వెలుగొందే తెలంగాణ తమ కల అని చెప్పారు.

ఆరేండ్లలో హైదరాబాద్‌లో చాలా మార్పు వచ్చిందని, అలాంటి నగరాన్ని కాపాడుకొనేందుకు మేధావులు, యువత నడుంబిగించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసేముందు పార్టీ, నాయకుడు, వారి వైఖరి, అభివృద్ధి గురించి చర్చించి, విచక్షణతో ఆలోచించాలని సూచించారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఇతర వర్గాలన్నీ కలిసి నగరాన్ని కాపాడుకోవాలని కోరారు. ఓటు వేసేముందు టీఎస్‌ బీపాస్‌ కావాలో.. కర్ఫ్యూ పాస్‌ కావాలో.. ఆలోచించాలన్నారు. శనివారం ఎల్బీ స్టేడియం సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

ఎక్కడివారు అక్కడ కథానాయకులు కండి..
ఈ రోజు మన గౌరవాన్ని కాపాడే విధంగా.. నగరంలో ఉండే మేధావులు, యువత, ప్రజానీకం నగర భవిష్యత్‌ కోసం నడుం బిగించాలి. ఎకిలి మాటలు.. పిచ్చి మాటలు.. సమాజాన్ని విభజించే మాటలకు మనం ఏ మాత్రం లొంగిపోయినా దెబ్బతింటాం. ముఖ్యంగా యువకులు.. భవిష్యత్‌ మీది.. హైదరాబాద్‌ మీది.. కాబట్టి దయచేసి ఈ నగరాన్ని ముందుండి కాపాడుకోవాలి. మేధావులంతా ఎక్కడి వారు అక్కడ కథానాయకులు కావాలె… కదలాలె. మీమీ బస్తీల్లో చెప్పాలి.. చాలా మార్పు వచ్చింది హైదరాబాద్‌లో అని నాకు ఫోన్లు వస్తున్నాయి. కేసీఆర్‌ బుక్కులు పంపించండి.. మొన్న విడుదల చేసిన ప్రణాళిక పంపించండి.. మరెవర్ని హైదరాబాద్‌లోకి రానివ్వం.. మీరు నిశ్చింతగా ఉండండి అంటున్నారు. నేను ప్రజలకు ఒక్కటే చెప్తున్నా.. ఎన్నికలు చాలా జరుగుతుంటాయి. సందర్భాలు చాలా వస్తుంటాయి.. పోతుంటాయి. ఎన్నికల్లో తమ విచక్షణ అధికారం ఉపయోగించి పార్టీలకు ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. ఒక పార్టీ, ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా పని చేస్తున్నారు? వాళ్ల వైఖరి ఎలా ఉంది? వాళ్లు ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారా? అన్న అంశంపైన చర్చ జరగాలి.. భవిష్యత్తు గురించి వాళ్లు ప్రతిపాదిస్తున్న ఎజెండా మీద చర్చ జరగాలి.. వీటన్నింటి మీద ప్రజా తీర్పు రావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. మంచి పార్టీ ఎన్నుకోబడుతుంది. మంచి నిర్ణయాలు జరుగుతాయి. ప్రజలకు సేవ చేయటంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా సమాజానికి, ప్రజలకు మంచి జరుగుతుంది.

నగరాన్ని కాపాడుకోవాలి
బిల్డర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ఇతర వర్గాల వారందరం కలిసి నగరాన్ని కాపాడుకోవాలి. దయచేసి నగర ప్రశాంతతను కాపాడేందుకు ముందుకు రావాలి. మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎక్కడ కట్టుకుంటాం. ప్రశాంతమైన కాలనీ చూసి కడుతాం. జాగ కొనుగోలు చేస్తం. అంతే కానీ గడబిడ, లొల్లులు ఉన్న కాడికి ఎవరన్న పోతరా? ఇప్పుడు హైదరాబాద్‌కు వెల్లువలా పరిశ్రమలు వస్తున్నాయి. లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఇవన్నీ మీ కండ్ల ముందు జరుగుతున్నాయి. వీటన్నింటిని కాపాడాలే. ఇవన్నీ జరగాలంటే కచ్చితంగా వందకు వంద శాతం హైదరాబాద్‌ శాంతి సామరస్యతను పరిరక్షించుకోవాలి. అన్ని మతాలు, కులాలు, వర్గాలు కలిసి ఉండాలి. పూల బొకే లాంటి హైదరాబాద్‌ను అందరం కలిసి కాపాడుకోవాలి.

శాంతియుత వాతావరణం ఉంటేనే వ్యాపారాలు నడుస్తాయి. ఇందుకోసమే టీఎస్‌ బీపాస్‌ తెచ్చినం. అన్ని వర్గాల వారిని నేను కోరుతున్నా. మీ వ్యాపారాలు నడువాలంటే మీకు బీపాస్‌ కావాల్నా? హైదరాబాద్‌లో కల్లోలం చెలరేగే కర్ఫ్యూ పాస్‌ కావాల్నా? బీపాసా.. కర్ఫ్యూ పాసా? ఆలోచించాలి.

నన్ను తూలనాడినా టెంప్ట్‌ కాను
ఎవలు ఏ విధంగా మాట్లాడుతున్నరో గమనిస్తున్నరు. నన్ను కూడా రారా పోరా అని సంబోధిస్తున్నరు. తూలనాడుతున్నరు.. నేను టెంప్ట్‌ కావడం లేదు. నాకు చేతకాక కాదు. కేసీఆర్‌ ఎత్తుకుంటే.. బ్రహ్మాండంగా నేను కూడా తిట్టగలుగుతాను. మాకు కార్యకర్తలు లేకకాదు.. పౌరుషం లేకకాదు. మేం తలుచుకున్ననాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడుతం బిడ్డా!

హైదరాబాద్‌ను ఆగం చేయబోం ఒక శ్రేష్టమైనటు వంటి హైదరాబాద్‌ తయారుకావాలె. అత్యంత నివాసయోగ్య నగరం కావాలె. అందుకోసం బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాలి. అదే విధంగా మేం పనిచేస్తం. అది మా ధర్మంగా భావిస్తా ఉన్నం. కొందరికోసం పనిచేసి అందరి హైదరాబాద్‌ను ఆగం చేసే పరిస్థితి మాది కాదు. ఆ ఎజెండా కూడా మాది కాదు.

గీ బక్క కేసీఆర్‌ను కొట్టేందుకు గింతమందా?
వరద వచ్చింది.. పది రూపాయలు ఇచ్చి ఆదుకోమంటే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వరదలాగా వస్తున్నరు. ఇది మున్సిపల్‌ ఎలక్షనా లేక నేషనల్‌ ఎలక్షనా.. గీ బక్క కేసీఆర్‌ను కొట్టేందుకు గింతమందా? అబ్బా అబ్బా ఏం మందయ్యా.. జోగడు, బాగడు, జోకెటోడు.. ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వస్తరా ఈ మున్సిపల్‌ ఎన్నికలకు? ఏం జరుగుతున్నది కథా! కేసీఆర్‌ తెలంగాణ గడ్డ బిడ్డ. తెలంగాణ రక్తం ఉన్న బిడ్డ. పౌరుషం ఉన్న బిడ్డ.

– ముఖ్యమంత్రి కేసీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.