Author Archives: BRSpartyonline
అసమర్ధత, అన్యాయాలు, అసత్యాలు – భారతీయ జనతా పార్టీకి 50 ప్రశ్నలు
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా ప్రశంసించి.. ఎన్నికల వేళ ఛార్జీషీట్ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్ అనడం హాస్యాస్పదంగా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. భారతీయ జనతా పార్టీని 50 సూటి ప్రశ్నలతో నిలదీశారు.

మన నగరం మన పార్టీ మన పాలన
రాజకీయాల జోలికి పోకుండా ప్రజల అభివృద్థే మనోరథంగా స్వీకరించిన రాజనీతిజ్ఞులకే చరిత్ర బ్రహ్మరథం పడుతుందని టీఆర్‌ఎస్ పార్టీ అభిప్రాయపడింది. హైదరాబాద్‌నగరాన్ని ప్రజలందరి జీవగడ్డగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం నిరంతరంగా పనిచేస్తుందని తెలిపింది.

విద్వేషం బీజేపీ వాదం
విశ్వనగరం టీఆర్‌ఎస్ నినాదమని, విద్వేషం బీజేపీ వాదమని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పచ్చని హైదరాబాద్‌లో ఓట్ల కోసం బీజేపీ నేతలు చిచ్చు పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఆరేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. తెలంగాణ రాష్ర్టానికి చేసిందేమీ లేద మండిపడ్డారు.

దేశానికి కొత్త పంథా కావాలి
దేశాన్ని పాలించడంలో బీజేపీ, కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శించారు. మాటలు చెప్పమంటే పెద్దపెద్ద మాటలు చెప్తారని, చేతల్లోకి వస్తే అంతా శూన్యంగానే ఉన్నదని మండిపడ్డారు. సోమవారం తెలంగాణభవన్‌లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడారు.

పవర్‌లో తెలంగాణ నంబర్‌వన్
స్వరాష్ట్రం వచ్చాక విద్యుత్, తాగు నీటి సమస్యలు తీరాయని, ముఖ్యంగా విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం భారతీనగర్ డివిజన్‌లోని సాయిబాబానగర్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.






