Author Archives: BRSpartyonline

ఎందుకీ అపశకునం మాటలు
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొన్ని పెద్దపిట్ట కూతలు, నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. అప్పట్లో పెద్దపిట్ట లాంటి కూతల వలె, ఇప్పుటి ప్రతిపక్ష నేతలు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్ మాటలు కీడునే కోరుతున్నాయి. తెలంగాణ గడ్డ ఉన్నపళంగా పీనుగల దిబ్బగా మారితే శవ రాజకీయం చేయాలని కాటి కాడి నక్కల్లా కాచుకుని కూర్చున్నట్లు వారి మాటలు చెబుతున్నాయి.

యూరియాపై ఆందోళనవద్దు
రాష్ట్రంలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన మేర ముందస్తుగానే అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతాంగంలో ఆందోళన కలిగించేలా కొన్ని దుష్టశక్తులు దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

చందన్‌వెల్లి టు సిలికాన్ వ్యాలీ
రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లికి అనతికాలంలోనే అనేక పరిశ్రమలు రానున్నాయని, తద్వారా ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం చందన్‌వెల్లి పారిశ్రామికవాడలో ప్రపంచప్రసిద్ధి చెందిన వెల్‌స్పన్ ఫ్లోరింగ్ పరిశ్రమ టైల్స్ విభాగాన్ని మంత్రి కేటీఆర్.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

ఒక్క పిలుపుతో 100 అంబులెన్స్‌లు
ఒక్క పిలుపు.. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచింది. ఒక్క సందర్భం.. ఓ గొప్ప నిర్ణయానికి శ్రీకారం చుట్టేలా చేసింది. ఆ నిర్ణయమే.. లక్షలమంది ప్రాణాలకు అండ అయ్యింది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు జన్మదినం ఓ ఆదర్శవంతమైన కార్యక్రమానికి నాంది పలికింది.

ఎన్నారైలూ కదలిరండి
కరోనా తర్వాత ఐటీ విస్తరణకు అనేక అవకాశాలు ఉన్నాయి. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ ఎన్నారైలకు మాతృభూమికి సేవచేసే అవకాశం కల్పిస్తున్నాం. రాష్ట్రంలో ఐటీ సంస్థల స్థాపనకు ముందుకొస్తే సహకరిస్తాం. కరీంనగర్‌లో టీ హబ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుచేస్తాం.

సాగు నీటి రంగానికి అత్యంత ప్రాధాన్యం
రాష్ట్రంలో నీటిపారుదలశాఖను ఇకపై జలవనరులశాఖ (వాటర్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్) గా మారుస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ గొప్ప వ్యవసాయరాష్ట్రంగా మారుతున్న పరిస్థితుల్లో సాగునీటి రంగానికి ప్రాధాన్యం, బాధ్యత పెరుగుతున్నదన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రంలో నీటిపారుదలశాఖ వికేంద్రీకరణ, పునర్వ్యవస్థీకరణ జరుగాలని సీఎం చెప్పారు.

భయం వద్దు.. నిర్లక్ష్యం వద్దు
కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, అదే సందర్భంలో నిర్లక్ష్యంగా కూడా ఉండవద్దని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ అన్నారు. కరోనా వైరస్ సోకినవారు అధికవ్యయం చేస్తూ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎంతమందికైనా సేవలు అందించడానికి ప్రభుత్వ వైద్యశాలలు, వైద్యసిబ్బంది సంసిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఇక.. విద్యావ్యవస్థ ప్రక్షాళన
రాష్ట్రంలో విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి అవసరమైన దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని వెల్లడించారు. ఇందుకోసం విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.
డాక్టర్లు భేష్
రాష్ట్రంలో కొవిడ్-19ను నియంత్రించడానికి వైద్య సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ కొనియాడారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గారితో పాటు కిందిస్థాయి వరకు ప్రాణాలకు తెగించి గొప్పసేవ చేస్తున్నారన్నారు.

