Author Archives: BRSpartyonline

స్థానికులకే ఉద్యోగాలు

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది.


సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు

సీఎం కేసీఆర్ గారి అధ్యక్షతన బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో సమావేశం ప్రారంభమయ్యింది. సుమారు 9 గంటలపాటు సాగిన ఈ సమావేశం.. రాత్రి 11 గంటలకు ముగిసింది. ప్రధానంగా 14 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు.


ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు.


సర్కారు దవాఖానల్లో విలువైన వైద్యం ఉచితంగా

ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్‌ చికిత్స కోసం ఖరీదైన మందులను వినియోగిస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. ఈ మందులు కార్పొరేట్‌ హాస్పిటళ్లలో సైతం అందుబాటులో లేవని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వినియోగించే ఇంజెక్షన్లు లేవని ప్రైవేటు దవాఖానలు చేతులెత్తేస్తున్నాయని, అయితే తాము ఆ మందులను సమకూర్చుకొని అవసరమైన ప్రతి రోగికి విలువైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు.


కార్యకర్తల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటం

ఉద్యమనేత కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ను స్థాపించిన ముహూర్తం చాలా మంచిదని, ముహూర్త బలం, కార్యకర్తల అండతో వందేండ్లయినా చెక్కు చెదరకుండా ఉంటుందని పార్టీవర్కింగ్‌ ప్రెసిడెంట్‌,మంత్రి కేటీఆర్ అన్నారు. కార్యకర్తల త్యాగం, కష్టంతోనే ఈ స్థాయికి చేరుకున్నామని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. కార్యకర్తల కోసం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తామని పేర్కొన్నారు.


దశదిశలా పీవీ ఔన్నత్యం

ఆధ్యాత్మికత, జ్ఞాన సమున్నత, విధాన నిర్ణయాలు, ప్రజాసంక్షేమ పాలన, రాజనీతి, సాహితీ సాంస్కృతిక విషయాల్లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఆయనకు ఆయనే సాటిఅని ఐటీ, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు అన్నారు. ఆ మహనీయుడి ఔన్నత్యాన్ని దశదిశాలా చాటుదామని పిలుపునిచ్చారు.


ఒక్కచుక్కనూ వదులుకోం

జల వివాదాల పరిష్కారంలో కేంద్రం నిష్క్రియాపరత్వం దుర్మార్గం. ఈ వైఖరిని ఇకనైనా విడనాడాలి. కేంద్రం బాధ్యతారాహిత్యం వల్ల ఇరు రాష్ర్టాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇరు రాష్ర్టాల మధ్య ఉన్న కేసులు, ట్రిబ్యునల్‌ వివాదాలు న్యాయబద్ధంగా పరిష్కారం కావాలి. నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదు.


సచివాలయంలో సర్వ హంగులు

నూతన సచివాలయంలో అందరికీ అనుకూలంగా అన్ని రకాల సౌకర్యాలుండేలా చూడాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. నూతన సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు మార్పులను సూచించారు. కొత్త సచివాలయ భవనం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ బుధవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.