
రాష్ట్రంలో 66.48 లక్షల ఎకరాల అటవీభూమి ఉన్నప్పటికీ ఆ నిష్పత్తితో అడవులు లేవని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఈ స్థాయిలో అడవులను పునరుద్ధరించాలని చెప్పారు.

ప్రజాసేవకు అంకితమవ్వాలని, ప్రజలతో మమేకమవ్వాలని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సూచించారు. కొత్త పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలను సమర్థంగా అమలుచేయడం ద్వారా పట్టణాలు, పల్లెప్రాంతాల అభివృద్ధికి దోహదపడాలని కోరారు.
తెలంగాణ అడ్డాలో బీజేపీ నడ్డా నాటకాలు నడువబోవని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎలాంటి యాతన లేకుండా సేవలందించడమే లక్ష్యంగా కొత్త రెవెన్యూ చట్టం రూపుదిద్దుకొంటున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు.

ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం (హెల్త్ ప్రొఫైల్) రూపొందించాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు తెలిపారు.

ఉమ్మడిపాలనలో ఆత్మహత్యలతో ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను సిరిసిల్లగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు.

ఒకప్పుడు ఎండిపోయినట్టు కనిపించే గోదావరి.. నేడు మేడిగడ్డ నుంచి ధర్మపురి నరసింహస్వామి పాదాల చెంత వరకు.. సుమారు 150 కిలోమీటర్ల మేర అద్భుతమైన జీవనదిని సాక్షాత్కరిస్తున్నదని, తన కష్టానికి ప్రతిఫలం దక్కిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తంచేశారు.
దేశంలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు.. ఉత్తమ నిర్మాణం కలిగిన సంస్థగా టీఆర్‌ఎస్‌ను తీర్చిదిద్దాలన్నది పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగానే తాము పనిచేస్తున్నామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.

నీటి అవసరాలు తీర్చేందుకు జాతీయ జలవిధానం తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని లోక్‌సభలో టీఆర్‌ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్‌రావు చెప్పారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేషస్పందన లభించిందని, నెల వ్యవధిలో దాదాపు 40 లక్షల మంది సభ్యులుగా చేరారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు.
Please contribute generously to the BRS Party.