
గత ఆరేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్వితీయ విజయాలను సాధిస్తూ దేశానికే తలమానికంగా నిలిచిందని పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు.

విద్యుత్ చట్టానికి సవరణలను ప్రతిపాదిస్తూ కేంద్రం రూపొందించిన బిల్లు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ప్రతిపాదిత బిల్లు రైతులకు, పేదలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని, విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టంచేశారు.

ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ కాన్ బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాల్లో ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు చిన్న పిల్ల నుంచి పండు ముసలి వరకు జాతి మొత్తం సంతోష పడిన రోజు. సబ్బండ వర్ణాలు సంబరపడిన రోజు జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సంబంరం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలందరీలో నూతన ఉత్సాహాన్ని నింపిన రోజు.

కేసీఆర్ అంటే అందరికీ తెలిసింది కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కానీ మంత్రి కే తారకరామారావు సరికొత్త నిర్వచనం చెప్పారు.

ప్రపంచమే ఆశ్చర్యపోయేలా రాష్ట్ర రైతాంగానికి వారం రోజుల్లో తీపి కబురు చెప్పనున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా పరిగణనలోకి తీసుకుని ఈ విషయం ప్రకటించబోతున్నానని తెలిపారు.

సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ దశ తిరిగిందని, ఇక్కడ ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవని, దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ వస్తుందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.

దేశానికి తిండిపెట్టే స్థాయికి రాష్ట్రం ఎదుగటం గర్వంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు.

తెలంగాణలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలోని కొండపోచమ్మతల్లి సిగలో పూవై మెరిసిపోవడానికి ఆత్రంగా వస్తున్నది శుక్రవారం రోజున సీఎం కేసీఆర్ చేతులమీదుగా కాళేశ్వరం ప్రాజెక్టులో శిఖరాయమానమైన ఘట్టం ఆవిష్కృతం కానున్నది

రాష్ట్రంలో రైతు వేదికలు వ్యవసాయ విప్లవానికి నాంది కావాలని మున్సిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. రైతువేదికల నిర్మాణానికి సహకారం అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు.
Please contribute generously to the BRS Party.