
మేకిన్ తెలంగాణ అంటే.. మేకిన్ ఇండియా కాదా? తెలంగాణ భారతదేశంలో లేదా? అని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్ర అవతరణ జరగక ముందు దాదాపు ఆరు దశాబ్దాల పాటు పరాయి పాలనలో తెలంగాణ అల్లకల్లోలంగా ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో శూన్యం నుంచి ప్రారంభించవలసిన పరిస్థితి.

కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అవసరం లేదని కేంద్రం చెప్పడంపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్క చెప్పాలి. బీజేపీ అధికారంలో ఉన్న బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లో ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు కల్పించారో తెలియజేయాలి.

భక్తులకు వైకుంఠంలో సంచరిస్తున్న అనుభూతి కలిగేలా యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి తుది మెరుగులు దిద్దాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

రాష్ట్రంలోని న్యాయవాదులకు తెలంగాణ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తుందని, వారి రక్షణకోసం ప్రత్యేక చట్టాన్నితెస్తామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.

మీరందరూ ఆశీర్వదించి ఓట్లేసి నన్ను శాసనమండలికి పంపిస్తే.. సభలో మీ గొంతుకను అవుతానని హమీ ఇచ్చారు.ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు.

12 కోట్ల ఉద్యోగాలిచ్చామన్నారు.. వాటి వివరాలేవి? అవి వెతికే పనిలో చాలా బిజీగా ఉన్నా.. వివరాలేమైనా ఉంటే చెప్పండి?’ అంటూ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతలకు ట్విట్టర్‌లో పంచ్ ఇచ్చారు.

స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆరేండ్లలో 1.32 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసింది.. మేం చెప్పేది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటా’ అని నల్లగొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల స్థానం టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిత్యం అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకొన్నాయని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు.
Please contribute generously to the BRS Party.