Author Archives: BRSpartyonline

వరదతో పదిలం

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఎక్కడికక్కడ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటుచేసి 24 గంటల పాటు నిరంతరాయంగా పరిస్థితిని పర్యవేక్షించాలని ఆదేశించారు.


సోలిపేట ఒక పోరుబాట

ఆప్తమిత్రుడు, నిగర్వి, నిరాడంబరుడు, నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూసాడనే వార్త వినటంతోనే నిలువెల్లా ఒక అంతులేని ఆవేదన ఆవరించింది. దుఃఖంతో కండ్లు చెమ్మగిల్లుతుంటే నిగ్రహించుకోవటం కోసం నిల్చున్న వాడినల్లా కొద్దిసేపు అట్లా కూర్చుండిపోయాను.


పారిశ్రామిక పరుగు

తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎవరూ ఊహించనిరీతిలో అతికొద్ది కాలంలోనే పారిశ్రామిక రంగంలో ఎంతో అభివృద్ధి సాధించామని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని, హైదరాబాద్‌లో ఉన్న పెట్టుబడిదారులు ఇతర ప్రాంతాలకు తరలిపోతారంటూ అపోహలు వ్యాప్తిచేసినవారందరి నోళ్లు మూతపడేలా పరిశ్రమలు, పెట్టుబడులు రాష్ర్టానికి తరలివస్తున్నాయని చెప్పారు.


వ్యయం కాదు, వ్యవసాయం

నియంత్రిత వ్వవసాయ విధానంలో ఏ పంట రకాలు ఎక్కడ సాగుచేయాలో ప్రభుత్వమే చెబుతుంది. దాని ప్రకారమే రైతులు పంటలు వేసేలా చర్యలు తీసుకుంటున్నది. ఎక్కడ ఏ పంటలు వేయాలన్నది ప్రభుత్వమే మ్యాపింగ్‌ చేసి, సమగ్ర వ్యవసాయ విధానాన్ని రాష్ట్రమంతా అమలయ్యే విధంగా ప్రణాళికలు రూపొందించింది. ఈ నియంత్రిత వ్యవసాయ విధానాన్ని రైతులు గుండెలకద్దుకొని స్వీకరిస్తున్నారు.


కయ్యాలమారి ఏపీ..

‘నా అంతట నేనే ఏపీ ప్రభుత్వ పెద్దలను పిలిచి పీటేసి అన్నం పెట్టి మరీ మాట్లాడాను. రెండు రాష్ర్టాల రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించుకుందామని స్నేహ హస్తం అందించాం. బేసిన్లు లేవు.. భేషజాలు లేవు.. అని మన వైఖరిని చాలా స్పష్టంగా చెప్పాం. సహజ సరిహద్దు రాష్ర్టాలు అయినందున స్నేహంగా మెదిలి, అంతిమంగా రైతులకు సాగునీరు అందించే లక్ష్యం సాధించాలని ప్రతిపాదించాం.


నాటి నినాదం.. నేడు వాస్తవం

ఆరేండ్ల నా తెలంగాణ ఓ పసి మొగ్గ. దేశ పటంలో ఒక కొత్త రాష్ట్రం. నాటి ఉద్యమ నాయకుడే నేటి తెలంగాణ ప్రభుత్వ అధినేత. బంగారు తెలంగాణ ప్రదాత, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వంలో తెలంగాణ నేడు దేశానికే దిక్సూచి. ఏ రంగంలో ఐనా తెలంగాణ ఓ రోల్‌ మోడల్‌. మెట్ట పంటలతో నెట్టుకొచ్చిన భూములు నేడు హరిత సింగారాల మాగాణాలై మెరిసిపోతున్నాయి.


ఉద్యమనేతకు అశ్రునివాళి అర్పించిన సీఎం కేసీఆర్

విద్యార్థి దశలోనే అభ్యుదయాన్ని కాంక్షించిన విప్లవకారుడు ఇక లేడు. సమాజ మార్పుకోసం అక్షరాలను ఆయుధాలు చేసిన పాత్రికేయుడు.. సెలవన్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చి.. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీలో అడుగుపెట్టి.. అవిశ్రాంతంగా నినదించిన నిఖార్సయిన ఉద్యమకారుడు.. విశ్రమించాడు.


ఉత్తమ జర్నలిస్టు, అత్యుత్తమ నాయకుడు

నేను విద్యార్థిగా ఉన్న రోజులనుంచి, జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించే కాలానికి ఆయన మాలాంటి యువతరం జర్నలిస్టులందరికీ ఓ రోల్‌మోడల్‌. నిజాయితీతో కూడిన సాదాసీదా జీవన విధానం, ప్రజలతో కలిసిమెలిసి ఉండటం, ప్రజల సమస్యలను వెలుగులోకి తేవటంలో కొత్త తరం జర్నలిస్టులందరికీ ఆయన ఆదర్శం.


స్థానికులకే ఉద్యోగాలు

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించే నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం టీఎస్‌ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానం తెచ్చింది.