Author Archives: BRSpartyonline

హక్కుగా అడిగితే అప్పు తెచ్చుకోమంటారా!

జీఎస్టీ పరిహారం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరు రాష్ట్రాలకు దానిపై విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం న్యాయపరంగా, నైతికంగా, ఇచ్చిన మాట మీద నిలబడి రాష్ట్రాలకు పూర్తి పరిహారం ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.


దేశం మెచ్చిన పథకం

ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్‌ మస్తిష్కంలోనుంచి పుట్టిన ఒకే ఒక్క రైతుబంధు పథకంతో తెలంగాణలో రైతు జీవితాన్ని.. వ్యవసాయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసింది. యావత్‌ దేశానికి దిక్సూచిగా మారింది. దేశంలోని రైతులందరికీ ఆలంబనగా నిలిచింది .


సామాన్యుడి జీవితాన్ని మార్చాలి

ప్రపంచవ్యాప్తంగా నూతన టెక్నాలజీ దూసుకువస్తున్నదని, దీనిద్వారా సామాన్యుల జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరమున్నదని ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు.


కేంద్రం పరిహారం ఇవ్వాల్సిందే

రాష్ర్టాలకు జీఎస్టీ పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చెల్లించాల్సిందేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ర్టాలకు ఇవ్వాలని సూచించారు. పరిహారం తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు.


కేంద్రం ఆప్షన్లతో నష్టం

జీఎస్టీ పరిహారం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు రూ.3 లక్షల కోట్లు చెల్లించాల్సిందేనని ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఈ మొత్తాన్ని కేంద్రమే రుణం తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పరిహారాన్ని రూ.1.65 లక్షల కోట్లకు పరిమితం చేయడాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు.


ప్రణబ్‌ మరణం తీరని లోటు

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్‌ముఖర్జీ ప్రాణాలు కాపాడటానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమని సీఎం పేర్కొన్నారు.


పచ్చటి పోటీ

పట్టణాల్లో ఓ పద్ధతి ప్రకారం పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల జీవనప్రమాణాలను పెంచేందుకు పురపాలికలను వందశాతం గ్రీనరీగా మార్చేలా ప్రణాళిక రూపొందించింది. మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచడమే లక్ష్యంగా పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు ఆదివారం ‘గ్రీన్‌స్పేస్‌ ఇండెక్స్‌’ పేరుతో కార్యక్రమాన్ని ప్రకటించారు.


ఐదునెలలు.. 4,550 కోట్లు

కరోనా సంక్షోభంలోనూ బడాకంపెనీలు తెలంగాణకు క్యూ కడుతున్నాయి.రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల విధానాలతో పారిశ్రామికవేత్తలు భారీపెట్టుబడులకు ముందుకొస్తున్నారు. 5 నెలల్లోనే రూ.4,550 కోట్ల పెట్టుబడులను ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి.


జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం ఇవ్వాల్సిందే

జీఎస్టీ విధానం ప్రగతిశీల రాష్ర్టాలకు నిరుత్సాహకరంగా.. ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేని రాష్ర్టాలకు లాభదాయకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. జీఎస్టీలో చేరడం ద్వారా తెలంగాణ వంటి రాష్ర్టాలు 60-70% వరకు ఆదాయాన్ని కోల్పోయాయన్నారు.


కాలుష్యంలేని ఫార్మాసిటీ

ఫార్మాసిటీ కాలుష్యరహితంగా ఉండాలని, అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో ఏర్పాట్లుచేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఫార్మాసిటీపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశం మేరకు ముందుకువెళ్లాలని అధికారులకు సూచించారు.