Author Archives: BRSpartyonline

రైతన్న నోట్లో కేంద్రం మట్టి

ఒక్క తెలంగాణలోనే 12 లక్షల ఎకరాల్లో 24 లక్షల టన్నుల మక్కలు పండుతాయి. ఇక దేశవ్యాప్తంగా ఉత్పత్తిని ఊహించుకోండి. మన దగ్గర పండిన మక్కలకే దిక్కులేదంటే.. ఉల్టా దిగుమతి చేసుకుంటే మన రైతు పరిస్థితి ఏమిటి? అతడు పండించే మక్కల్ని ఏం చేయాలి? అసలే కరోనా కాలం. ఖజానాకు ఆదాయం లేదు.


రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన టీఆర్ఎస్‌

అగ్రిక‌ల్చ‌ర్ బిల్లులను వ్య‌తిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ రాజ్య‌స‌భ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించింది. స‌భా కార్య‌క్ర‌మాల‌పై ప్ర‌తిష్టంభ‌న నెల‌కొన్న నేప‌థ్యంలో.. ఇవాళ రాజ్య‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీ కేశ‌వ‌రావు మాట్లాడారు. వ్య‌వ‌సాయ బిల్లుపై ఓటింగ్‌కు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డాన్ని వ్య‌తిరేస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.


సకల మతాల సర్కారు మాది

రాష్ట్రంలో సృజనాత్మకత, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి విధానాలను అమలుచేస్తూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నివర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారని ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.


మా సొమ్ము.. మా హక్కు

తెలంగాణలో తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న టీఆర్‌ఎస్‌.. జాతీయస్థాయిలో తీవ్ర ఆందోళనకరంగా ఉన్న జీఎస్టీ బకాయిలపై గళమెత్తింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశంపై చొరవతీసుకుని ఆందోళనకు దిగింది.


పారదర్శకంగా ‘డబుల్‌’ లబ్ధిదారుల ఎంపిక

డబుల్‌ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగాలని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తోపాటు జిల్లా కలెక్టర్లు లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు.


‘తెలంగాణ పోరాటాల స్ఫూర్తితోనే రాష్ట్రంలో ప్రగతిశీల పాలన’

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విలీన దినాన్ని పురస్కరించుకొని నాటి పోరాటాలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ స్మరించుకున్నారు. నిజాం రాచరిక, జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ విముక్తి కోసం వీరోచిత పోరాటాలు చేసిన పుణ్యభూమి తెలంగాణ ప్రాంతం అని వినోద్‌ కుమార్‌ పేర్కొన్నారు.


ప్రగతి నగరం

ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా జీహెచ్‌ఎంసీ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. దేశవ్యాప్తంగా సగటు పట్టణ జనాభా 31.2 శాతంగా ఉంటే తెలంగాణలో 42.6 శాతానికి చేరుకున్నదని తెలిపారు.


తెలంగాణభవన్‌లో జాతీయ జెండాఎగురవేసిన కేటీఆర్‌

తెలంగాణ భవన్‌లో సెప్టెంబర్‌ 17ను పురస్కరించుకొని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ తల్లి ప్రతిమకు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.


జీవ చైతన్య నగరం హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరం అన్నిరంగాల్లో మేటిగా నిలిచేందుకు అద్భుత కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక దేశం రాజధానికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు హైదరాబాద్‌లో మెండుగా ఉన్నాయి. అటు అభివృద్ధికి, ఇటు ప్రజల జీవనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనదైన తరహాలో ముందుకు పోతున్నది.


కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ర్టాలకున్న అధికారం పోతుందని, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారు.