Author Archives: BRSpartyonline

జీవ చైతన్య నగరం హైదరాబాద్‌

హైదరాబాద్‌ నగరం అన్నిరంగాల్లో మేటిగా నిలిచేందుకు అద్భుత కౌశలాన్ని ప్రదర్శించారు. ఒక దేశం రాజధానికి కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు హైదరాబాద్‌లో మెండుగా ఉన్నాయి. అటు అభివృద్ధికి, ఇటు ప్రజల జీవనానికి అవసరమైన సౌకర్యాలను కల్పించడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తనదైన తరహాలో ముందుకు పోతున్నది.


కేంద్ర విద్యుత్‌ బిల్లు డేంజర్‌

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త విద్యుత్‌ చట్టం అత్యంత ప్రమాదకరమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆ చట్టం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, అనేక రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఈ చట్టంతో విద్యుత్‌పై రాష్ర్టాలకున్న అధికారం పోతుందని, విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరిస్తారని హెచ్చరించారు.


ఏకగ్రీవంగా టీఎస్‌ బీ‘పాస్‌’

ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేసే టీఎస్‌బీపాస్‌ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రవేశపెడుతూ దాని విశేషాలను, ప్రభుత్వ బాధ్యతలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, అక్రమార్కులపై చర్యలు.. ఇలా బిల్లులో పొందుపరిచిన అన్ని విషయాల గురించి కూలంకషంగా వివరించారు.


విభజన చట్టం హామీలు నెరవేర్చాలి

దేశ సమస్యలతోపాటు తెలంగాణ రాష్ట్ర సమస్యలను కూడా పార్లమెంట్‌ సమావేశాల్లో లేవనెత్తుతామని లోక్‌సభ టీఆర్‌ఎస్‌ పక్ష నేత నామా నాగేశ్వర్‌రావు చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టే బిల్లులే కాకుండా దేశంలో ప్రస్తుత సమస్యలు కూడా పరిగణనలోకి తీసుకొని వాటన్నింటిపై చర్చించాలని డిమాండ్‌ చేశారు.