Author Archives: BRSpartyonline

ఉపాధినిచ్చేలా ఎదగాలి
అణగారిన వర్గాలు అభివృద్ధిలోకి రావాలంటే వారికి విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలన్నది తన నమ్మకమని పురపాలన, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. కుల వ్యవస్థ నిర్మూలనకు ఆయా కులాలవారీగా స్థితిగతులను మార్చడమే మార్గమని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ మిలింద్‌కాంబ్లే ఇటీవల చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు.

సోలిపేట సేవలను మరువొద్దు: మంత్రి హరీశ్‌రావు పిలుపు
ప్రజా ఉద్యమాలతోపాటు తెలంగాణ ఏర్పాటులో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సేవలు ఎనలేనివని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కొనియాడారు. ఆయన సేవలను టీఆర్‌ఎస్ మరువదని, దుబ్బాక ఉప ఎన్నికల్లో రామలింగారెడ్డి సతీమణి సుజాతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

కవితకు భారీ మెజార్టీయే లక్ష్యం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటూ వస్తున్నదని గుర్తుచేశారు.

కట్టడి లేకుంటే..కట్టుడే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా, కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుండా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్-పెద్ద మరూర్ దగ్గర బరాజ్ నిర్మించి తీరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఈ బరాజ్‌తో రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని తేల్చిచెప్పారు.

స్వచ్ఛతకు ప్రాధాన్యం
-మున్సిపాలిటీలు దేశంలోనే ఆదర్శంగా నిలవాలి -142 పురపాలికలు ‘ఓడీఎఫ్ ప్లస్ ప్లస్’కి చేరాలి -యేటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి …

రైతు రక్షణకు హామీ ఏది?
దేశ రైతాంగ జీవితాలపై, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ప్రభుత్వం అన్ని నియమాలనూ కాదని నియంతృత్వ ధోరణిని అనుసరించింది. భారత పార్లమెంటు ఎగువసభలో సభ్యుల గౌరవాన్ని,హక్కులను ఏమాత్రం పట్టించుకోలేదు.

మన నీళ్ల కోసం
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎట్టకేలకు మంగళవారం జరుగనున్నది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల సీఎంల అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశానికి సర్వం సిద్ధమయింది. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.

కబోది కమలం
నీళ్ల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడమంటే నవ్వాల్నా, ఏడ్వాల్నా తెలియడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు రాసిన లేఖ తొలిసారి అని చెప్పడం వారి అవగాహనలేమిని బయటపెడుతున్నదని అన్నారు

స్వచ్ఛతకు ప్రాధాన్యం
మున్సిపాలిటీలు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధి, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితంగా స్వచ్ఛతలో వరుసగా మూడుసార్లు పంచాయతీరాజ్‌శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.


