Author Archives: BRSpartyonline

కవితకు భారీ మెజార్టీయే లక్ష్యం
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్‌కు అండగా ఉంటూ వస్తున్నదని గుర్తుచేశారు.

కట్టడి లేకుంటే..కట్టుడే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలోలాగా తన పద్ధతిని మార్చుకోకుండా, కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుండా ఉంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్-పెద్ద మరూర్ దగ్గర బరాజ్ నిర్మించి తీరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఈ బరాజ్‌తో రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని తేల్చిచెప్పారు.

స్వచ్ఛతకు ప్రాధాన్యం
-మున్సిపాలిటీలు దేశంలోనే ఆదర్శంగా నిలవాలి -142 పురపాలికలు ‘ఓడీఎఫ్ ప్లస్ ప్లస్’కి చేరాలి -యేటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి …

రైతు రక్షణకు హామీ ఏది?
దేశ రైతాంగ జీవితాలపై, ప్రజలపై తీవ్ర ప్రభావం చూపే కీలకమైన వ్యవసాయ బిల్లుల విషయంలో కేంద్రం ప్రభుత్వం అన్ని నియమాలనూ కాదని నియంతృత్వ ధోరణిని అనుసరించింది. భారత పార్లమెంటు ఎగువసభలో సభ్యుల గౌరవాన్ని,హక్కులను ఏమాత్రం పట్టించుకోలేదు.

మన నీళ్ల కోసం
గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఎట్టకేలకు మంగళవారం జరుగనున్నది. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ర్టాల సీఎంల అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశానికి సర్వం సిద్ధమయింది. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన జరుగనున్న ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.

కబోది కమలం
నీళ్ల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పడమంటే నవ్వాల్నా, ఏడ్వాల్నా తెలియడంలేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌కు రాసిన లేఖ తొలిసారి అని చెప్పడం వారి అవగాహనలేమిని బయటపెడుతున్నదని అన్నారు

స్వచ్ఛతకు ప్రాధాన్యం
మున్సిపాలిటీలు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ సంకల్పసిద్ధి, ప్రజాప్రతినిధులు, అధికారుల కృషి ఫలితంగా స్వచ్ఛతలో వరుసగా మూడుసార్లు పంచాయతీరాజ్‌శాఖ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు.

టీఆర్‌ఎస్ వెన్నంటే బీసీలు
బీసీలు జీవితాంతం టీఆర్‌ఎస్ వెన్నంటే ఉంటారని బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీసీలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా గుర్తింపుఇచ్చారని.. ఉన్నతవర్గాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. కేంద్రప్రభుత్వం బీసీలకు ఏంచేసిందో చెప్పాలని బీజేపీ నేతలను ప్రశ్నించారు.

కేంద్రాన్ని, ఆంధ్రాను కడిగేద్దాం
రాష్ట్ర నీటిహక్కులను హరించేందుకు కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటించాలని.. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వేదికగా నిజాలను తేటతెల్లం చేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ జలవనరులశాఖకు చెందిన సమగ్ర వివరాలు, కేంద్రానికి చెప్పాల్సిన అన్ని విషయాలకు సంబంధించిన వివరాలు తీసుకొని సమావేశానికి రావాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.


