Author Archives: BRSpartyonline

అభివృద్ధా..అరాచకమా?
హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?.. అందరి హైదరాబాద్ కావాలా? కొందరి హైదరాబాద్ కావాలా?.. ఎవరికి ఓటువేస్తే ఏం జరుగుతుందో హైదరాబాద్ ప్రజలు విజ్ఞత, వివేకంతో ఆలోచించాలని.. పనిచేసే పార్టీకి పట్టం కట్టాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు.

బీజేపీకి ఓటేస్తే..బతుకు భయమే
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే బతుకు భయంగా మారుతుందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అగ్గిమండే హైదరాబాద్ కావాలా? అభివృద్ధి, ప్రశాంతమైన హైదరాబాద్ కావాలా అని ప్రజలను అడుగాలని పార్టీనేతలకు సూచించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 డివిజన్లకు అభ్యర్థులు ఖరారు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 105 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేసి తొలి జాబితా విడుదల చేసిన టీఆర్ఎస్ పార్టీ.

అందుబాటులోకి టీఎస్ బీపాస్..
జాప్యానికి చోటు ఉండదు.. అవినీతి, ఆలస్యం అనే మాటే వినపడదు. భవన నిర్మాణ, లే అవుట్ అనుమతుల్లో సరళీకృత, ఏకీకృత విధానమైన టీఎస్ బీ పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం.
ఆస్తిపన్నులో 50% రాయితీ
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు, రాష్ట్రంలోని 140 మున్సిపాలిటీల్లో గృహ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రాయితీ ప్రకటించింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను చెల్లింపులో 50 శాతం రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. జీహెచ్‌ఎంసీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకూ దీపావళి కానుక ప్రకటించింది.

బస్తీ దవాఖానలతో మెరుగైన వైద్యం
పట్టణ ప్రాంత నిరుపేదలకు బస్తీ దవాఖానలతో మెరుగైన వైద్య సేవలందుతున్నాయని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలోని నాంపల్లి నియోజకవర్గం అహ్మద్‌నగర్ డివిజన్ సయ్యద్‌నగర్ -2 లో బస్తీ దవాఖానను మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు.

పారిశుద్ధ్యానికి పెద్దపీట
ఆధునిక పద్ధతిలో చెత్త తరలింపు, నిర్వహణతో హైదరాబాద్‌లో దుర్గంధం దూరం కానున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం చెత్త తరలింపునకు ఉపయోగిస్తున్న పాత వాహనాలకు కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వస్తి చెప్పనున్నామని.. వీటి స్థానంలో అత్యాధునిక కాంప్యాక్టర్లు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు.
కారణాలు సమీక్షిస్తాం
టీఆర్‌ఎస్ పార్టీ విజయాలకు పొంగిపోదని, అపజయాలకు కుంగిపోదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.



