Author Archives: BRSpartyonline

పారిశుద్ధ్యానికి పెద్దపీట

ఆధునిక పద్ధతిలో చెత్త తరలింపు, నిర్వహణతో హైదరాబాద్‌లో దుర్గంధం దూరం కానున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం చెత్త తరలింపునకు ఉపయోగిస్తున్న పాత వాహనాలకు కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వస్తి చెప్పనున్నామని.. వీటి స్థానంలో అత్యాధునిక కాంప్యాక్టర్లు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు.


కారణాలు సమీక్షిస్తాం

టీఆర్‌ఎస్‌ పార్టీ విజయాలకు పొంగిపోదని, అపజయాలకు కుంగిపోదని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. మంగళవారం దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌కు ఓటేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.


తెలంగాణపై ఇంత వివక్షా!

భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం వరద సాయం అందిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు బురద రాజకీయాలు చేస్తున్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వానలో తడుస్తూ, నీళ్లలో నడుస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు బాధితులకు అండగా నిలిస్తే.. నాడు దుబ్బాకలో ఓట్ల వేటలో ఉన్న ప్రతిపక్ష నేతలు ఇప్పుడొచ్చి చిల్లర వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు


అమెజాన్‌ రాకలో కేటీఆర్‌ మార్క్‌

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌ కంపెనీ విస్తరిస్తున్న తీరును పసిగట్టడం, వారిలో భరోసా నింపి వారి తదుపరి పెట్టుబడుల గమ్యస్థానంగా హైదరాబాద్‌ను మార్చడంలో మంత్రి కేటీఆర్‌ తనదైన ముద్ర వేశారు. అమెజాన్‌ చేసిన తాజా పెట్టుబడి ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మంది పెట్టుబడిదారులు తెలంగాణ వైపు చూడటం ఖాయంగా కనిపిస్తున్నది.


నిన్నటి స్వప్నం.. నేటి రైతు రాజ్యం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్‌ గత ఆరేండ్లలో రైతులలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. రుణమాఫీ నుంచి మొదలై, నిరంతర ఉచిత విద్యుత్తు, ప్రతి ఎకరానికీ కృష్ణా, గోదావరి జలాల సాగునీరు అందిస్తున్నారు.


విద్వేషానికి చోటులేదు

తెలంగాణలో మత విద్వేషపు విత్తనాలకు చోటు లేదని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు అన్నారు. ఇక్కడి మట్టిలోనే పరమత సహనం ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ర్టానికి సీఎం కే చంద్రశేఖర్‌రావు నాయకత్వమే శ్రీరామరక్ష అని పునరుద్ఘాటించారు. నోట్ల రద్దు.. రైతు లు వద్దు.. కార్పొరేట్లు ముద్దు అన్నది బీజేపీ నినాదంగా మారిపోయిందని ఎద్దేవాచేశారు.


హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర

దుబ్బాక ఎన్నికల్లో సానుభూతి పొందే యోచనతో హైదరాబాద్‌లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేస్తున్నదని, ప్రగతిభవన్‌, డీజీపీ ఆఫీసు, తెలంగాణ భవన్‌ను ముట్టడించాలనే దుష్ట పన్నాగానికి తెరలేపిందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ఆరోపించారు.


బీజేపీది అహంకారం.. అసహనం

బీజేపీ రాష్ట్ర నేతలు అహంకారంతో, అసహనంతో వ్యవహరిస్తున్నారని ఆర్థికమంత్రి టీ హరీశ్‌రావు మండిపడ్డారు. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ఎన్ని నాటకాలు వేసినా టీఆర్‌ఎస్‌కు ప్రజల్లోనుంచి కొంచెంకూడా ఆదరణ తగ్గకపోవడాన్ని కాషాయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.


ఆందోళన వద్దు.. అందరికీ సాయం

హైదరాబాద్‌లో అర్హులైన వరద బాధితులందరికీ తక్షణ ఆర్థికసాయం రూ.పదివేలు అందజేస్తామని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హామీ ఇచ్చారు. సాయం అందలేదని బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని భరోసా ఇచ్చారు.