Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

వెల్లువలా సభ్యత్వ నమోదు

-టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణ

టీఆర్‌ఎస్‌కు రోజురోజుకు ప్రజాదరణ పెరుగుతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో చేపట్టిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం పార్టీ సభ్యత్వాల నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా వాడవాడలా కొనసాగింది. గ్రేటర్ హైదరాబాద్‌లో మేయర్ బొంతు రాంమోహన్, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, ఎమ్మెల్యేలు చింతల కనకారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, టీఎస్ డీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పురాణం సతీశ్‌కుమార్ సభ్యత్వాలు అందజేశారు. కరీంనగర్‌లో ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, సూర్యాపేట జిల్లా నడిగూడెంలో డీసీసీబీ చైర్మన్ ముత్తావరపు పాండురంగారావు, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, కోదాడ టీఆర్‌ఎస్ నియోజక వర్గ ఇన్‌చార్జి, మార్కెట్‌కమిటీ చైర్మన్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేటలో ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత విఠల్‌రావు, వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పార్టీ సభ్యత్వాలు అందజేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతాప్రభాకర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, కంగ్టి మండలం బోర్గిలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, చౌటుప్పల్ మండలంలో ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సభ్యత్వాలు అందజేశారు.

చాకిర్యాలలో ఊరంతా సభ్యత్వం సీఎం కే చంద్రశేఖర్‌రావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై సోమవారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని చాకిర్యాల్ గ్రామవాసులంతా టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. గ్రామంలో ఉన్న 1,253 మంది ఓటర్లందరూ సభ్యత్వం తీసుకున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారు సైతం ఫోన్‌ద్వారా తమ సభ్యత్వాన్ని నమోదు చేయించుకున్నారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పల్లెల అభివృద్ధికి చేస్తున్న కృషితో ఊరందరం వీడీసీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకుని సభ్యత్వం పొందామని గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ముస్కు భూమేశ్వర్, సర్పంచ్ పుట్ట హేమలత దేవేందర్, నర్సారెడ్డి, సాయేందర్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.