– రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: హరీశ్ – సుభోజన పథకం ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్‌ను వెజిటబుల్ హాబ్‌గా తీర్చిదిద్దుతామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో రైతులు, హమాలీలకు రూ. 5లకే నాణ్యమైన ఆహారం, రూ.3లకే అల్పాహారాన్ని అందించే సుభోజన పథకాన్ని మంత్రి హరీశ్‌రావు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావు గురువారం ప్రారంభించారు. రైతులకు విశ్రాంతి గదిని ప్రారంభించారు.
హమాలీల విశ్రాంతి గది నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వారికి దుస్తులను పంపిణీ చేశారు. మార్కెట్‌లో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ సుభోజన పథకాన్ని తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్లలో విస్తరించనున్నట్లు మంత్రి చెప్పారు. సుభోజన పథకంతో హరీశ్‌రావు విప్లవాన్ని సృష్టించారని హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి ప్రశంసించారు. హమాలీలకు ఇంటి స్థలాలను కేటాయించాలని మంత్రి హరీశ్‌ను ఎక్సైజ్ శాఖ మంత్రి టీ పద్మారావు కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్మే సాయన్న, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరి పూనం మాలకోండయ్య మార్కెటింగ్ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అదనపు సంచాలకులు లక్ష్మిబాయి, ఉన్నత శ్రేణి కార్యదర్శి పద్మహర్ష, టీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఇన్‌చార్జీ గజ్జెల నాగేష్,మార్కెటింగ్ శాఖ అధికారులు రాజశేఖర్, మల్లేశం, బాలమల్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిల్లర వర్తక వ్యాపారుల సంఘం తరుపున ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.51వేల చెక్కును, డీసీఎం, ఆటో యూనియన్ తరుఫున రూ.25 వేల చెక్కులను మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు.