ఉద్యమంతో సమానంగా ఉద్యోగాన్ని ప్రేమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి ఉద్బోధించారు. అధికారులు, ప్రజలతో మమేకమైనప్పుడే ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని ఆదివారం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో జరిగిన రాష్ట్ర గ్రూప్ -1 అధికారుల కేంద్ర సంఘం తొలి ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మీరు ఎంతో అంకితభావంతో, చిత్తశుద్ధితో ఉద్యమాన్ని చేశారు. ఉద్యోగం, జీవితం కంటే ఉద్యమమే గొప్పదనుకున్నరు.
-పథకాల అమలులో గ్రూప్-1 అధికారులే కీలకం -రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి -అధికారులు ప్రజలతో మమేకం కావాలి: జస్టిస్ చంద్రయ్య

ఉద్యమాన్ని ప్రేమించిండ్రు. ఇప్పుడు రాష్ట్రం వచ్చింది. మీరు ఉద్యమాన్ని ప్రేమించినట్లే, ఉద్యోగాన్నీ ప్రేమించండి. అప్పుడే బంగారు తెలంగాణ సాకారమవుతుంది అని పేర్కొరు. సన్మాన సభల్లో నిర్వాహకులు కప్పే శాలువాకంటే ప్రజలు సమర్పించే వినతిపత్రాల బరువే ఎక్కువగా ఉంటుందన్నారు. సమస్యలు వారసత్వంగా సంక్రమించాయని మంత్రి చెప్పారు. ఎన్నో కలలతో సాధించుకున్న రాష్ర్టాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు రేయింబవళ్లు శ్రమిస్తున్నారని తెలిపారు.
సీఎం మొదలు పంచాయతీ వార్డు సభ్యుడి వరకు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అటెండర్ వరకు అదేస్ఫూర్తితో పని చేస్తేనే ఐదేండ్లలో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.గ్రూప్ వన్ అధికారులపైనే ప్రభుత్వ పథకాలు, విధానాల అమలు బాధ్యత ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ శాఖ డైరెక్టర్ జనార్దన్‌రెడ్డిని సన్మానించారు.
గ్రూప్ వన్ అధికారుల్లో ఎంతోమంది ఉన్నత హోదాలోకి వెళ్లారని, కానీ గ్రూప్ వన్ అధికారులు జనార్దన రెడ్డికి మాత్రమే సన్మానం చేశారంటే ఆయన ప్రజలతో ఎంతగా మమేకం అయ్యారో అర్థమవుతుందన్నారు.హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జీ చంద్రయ్య మాట్లాడుతూ రాజ్యాంగంలోని కార్యనిర్వాహక వ్యవస్థ ఎంతో కీలకమైందన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కార్యనిర్వాహక వ్యవస్థ యథాతథంగా ఉంటుందని, ప్రజలతో మమేకమైన అధికారి సూచనలను ప్రభుత్వం వింటుందని చెప్పారు. దీనికి గ్రూప్ వన్ అధికారి స్థాయి నుంచి ఐఏఎస్ అధికారి స్థాయి వరకు ఎదిగిన జనార్దనరెడ్డి చక్కటి ఉదాహరణ అన్నారు.
సన్మాన గ్రహీత జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ తాను వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పని చేసినప్పుడు కలెక్టరేట్‌లో ప్రతి కుర్చీ, టేబుల్‌పై ఐ లవ్ మై జాబ్ అని రాశమన్నారు. అనంతపురం జిల్లాకు వెళ్లిన తర్వాత రాష్ట్రంలో పర్యటించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ వరంగల్‌లో ఈ నినాదాలు చూసి తనకు ఫోన్ చేశారన్నారు.
కనీసం ఈ అక్షరాలు చూసినప్పుడైనా ఉద్యోగాన్ని ప్రేమిస్తారని వారికి చెప్పానని జనార్దన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మహాదాయి వాటర్ ట్రిబ్యునల్ బోర్డు సభ్యుడు జస్టిస్ పీఎస్ నారాయణ, డాక్టర్ యతిరాజు, టీజీఓసీఏ అధ్యక్షుడు యాదగిరిరావు, ప్రధాన కార్యదర్శి బీ వెంకటేశ్‌నేత తదితరులు పాల్గొన్నారు.
గ్రూప్-1 అధికారుల సంఘం కార్యవర్గం ఇదే రాష్ట్ర గ్రూప్-1 అధికారుల కేంద్ర సంఘం కార్యవర్గాన్ని అధ్యక్షుడు డాక్టర్ యాదగిరిరావు ప్రకటించారు. అసోసియేట్ ప్రెసిడెంట్ ఎం హనుమంతరావు, ఉపాధ్యక్షులు సీహెచ్ శివలింగయ్య, పూర్ణచందర్ రెడ్డి, రాజేశ్వర్‌రాథోడ్, ప్రధాన కార్యదర్శిగా బీ వెంకటేశ్‌నేత, మహిళా కార్యదర్శులు ఎం శోభాస్వరూపరాణి, ఎం హరిత, సంయుక్త కార్యదర్శులు శివ లింగయ్య, నారాయణరెడ్డి, హరినందనరావు, వాసం వెంకటేశ్వర్లు, నిర్వాహక కార్యదర్శి ఏ అనిల్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి ఎన్ వెంకన్నగౌడ్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు.