Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఉద్యమకారులే జిల్లా సారథులు

-33 జిల్లాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుల ఎంపిక
-ప్రకటించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌
-20 మంది ఎమ్మెల్యేలకు అధ్యక్షులుగా అవకాశం
-జిల్లాల అధ్యక్ష బాధ్యతల్లో ముగ్గురు మహిళలు,
-ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎంపీలు కూడా

తెలంగాణ అస్తిత్వ పతాకను ఆకాశమంత ఎత్తుకు నిలిపిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొదటినుంచి తన వెంట నడిచిన ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అన్ని జిల్లాలకు నూతన అధ్యక్షులను నియమించారు. 33 జిల్లాల్లో సగానికిపైగా ఉద్యమకారులకు
పెద్దపీట వేశారు.

తెలంగాణ అస్తిత్వ పతాకను ఆకాశమంత ఎత్తుకు నిలిపిన టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు మొదటినుంచి తన వెంట నడిచిన ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంలో భాగం లో అన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. 33 జిల్లాల్లో సగానికిపైగా ఉద్యమకారులకు పెద్దపీట వేశారు. విద్యార్థి నేతలుగా టీఆర్‌ఎస్‌తో రాజకీయ ఓనమాలు దిద్దిన వారెందరినో కేసీఆర్‌ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, పలు రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లుగా అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన జిల్లా అధ్యక్షుల్లోనూ అదే పంథాను అనుసరించారు. మరోవైపు 33 జిల్లాల అధ్యక్షుల్లో 20 మంది ప్రస్తుతం ఎమ్మెల్యేలు. ఇద్దరు ఎమ్మెల్సీలు, ముగ్గురు ఎంపీలు, ముగ్గురు జడ్పీ చైర్మన్లు, ఒక మున్సిపల్‌ చైర్మన్‌ సహా ఆయిల్‌ఫెడ్‌ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చారు. ముగ్గురు మహిళలకు అవకాశమిచ్చారు.

33 జిల్లాల టీఆర్‌ఎస్‌ అధ్యక్షులు వీరే..

అణువణువునా ఉద్యమస్ఫూర్తి
బాల్క సుమన్‌, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, పద్మాదేవేందర్‌రెడ్డి, దాస్యం వినయభాస్కర్‌, పాగాల సంపత్‌రెడ్డి, కుసుమ జగదీశ్‌, శంభీపూర్‌ రాజు, సీ లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, అరూరి రమేశ్‌, తోట ఆగయ్య, కే విద్యాసాగర్‌, జీవీ రామకృష్ణారావు, జోగు రామన్న.. ఇలా ఎంతోమందికి ఉద్యమ నేపథ్యమున్నది. పార్టీ నిర్మాణ కూర్పులో సామాజిక సమీకరణలను పాటిస్తూనే ఉద్యమ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవటంలో కేసీఆర్‌ది ప్రత్యేక ముద్ర అని మరోసారి స్పష్టమైంది.

గ్రేటర్‌ స్థాయి నుంచి..
టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణంలో గ్రేటర్‌ హైదరాబాద్‌, గ్రేటర్‌ వరంగల్‌కు ఒక్కో అధ్యక్షుడు ఉండేవారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షుడిగా వ్యవహరించగా, వరంగల్‌ గ్రేటర్‌కు దాస్యం వినయభాస్కర్‌ రెండు టర్మ్‌లు వ్యవహరించారు. ఇప్పుడు గ్రేటర్‌ పదవులకు బదులుగా జిల్లాలవారీగా అధ్యక్షులను నియమించారు. రంగారెడ్డి, మేడ్చల్‌, హైదరాబాద్‌ (గతంలో గ్రేటర్‌ హైదరాబాద్‌), అలాగే వరంగల్‌, హన్మకొండ (గ్రేటర్‌ వరంగల్‌) జిల్లా అధ్యక్ష పదవులు ఏర్పాటుకావడం విశేషం.

పటిష్ట వ్యూహం
బలమైన క్యాడర్‌ ఉన్న టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతంచేసే దిశగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ద్విముఖ వ్యూహంతో ముం దుకు కదులుతున్నారని నూతన జిల్లా అధ్యక్షుల నియామక కూర్పు స్పష్టం చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వర్గాల మధ్య సమతుల్యతను పాటిస్తూ జిల్లా అధ్యక్షుల నియామకం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గ్రామ, మండల, పట్టణ స్థాయిల్లో జరిపే నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 51% కంటే తక్కువ కాకుండా ఉండాలని టీఆర్‌ఎస్‌ తన విధివిధానాల్లోనే రాసుకొన్నది. ఇటీవల ఆయా స్థాయిల్లో జరిగిన నియామకాల్లోనూ ఈ విధానాన్ని అనుసరించారు. తాజాగా జిల్లా అధ్యక్షుల నియామకాల్లోనూ సామాజిక సమతూకాన్ని పాటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నేతలకు 51 శాతం పైగా పదవులు లభించాయి. 9 మంది బీసీలు, 4 ఎస్సీ, 3 ఎస్టీ, 1 మైనార్టీ నేతకు జిల్లా అధ్యక్ష పదవులు లభించాయి. ముగ్గురు మహిళలకు జిల్లా అధ్యక్షురాళ్లుగా అవకాశం ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవం, ఆ తరువాత అన్ని స్థాయిల పార్టీకి శిక్షణ తరగతుల నిర్వహణకు త్వరలో ముహూర్తం ఖరారయ్యే అయ్యే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కేసీఆర్‌కు జిల్లాల అధ్యక్షుల కృతజ్ఞతలు
టీఆర్‌ఎస్‌కు జిల్లాల అధ్యక్షులుగా ఎంపికైన నేతలు.. సీఎం కేసీఆర్‌ను బుధవారం ప్రగతిభవన్‌లో కలిసి ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్‌ను కలిసినవారిలో బడుగుల లింగయ్యయాదవ్‌, కంచర్ల రామకృష్ణారెడ్డి, రమావత్‌ రవీంద్రకుమార్‌, దాస్యం వినయ్‌భాసర్‌, ఆరూరి రమేశ్‌, మాలోత్‌ కవిత, గువ్వల బాలరాజు, తాతా మధుసూదన్‌, రేగా కాంతారావు ఉన్నారు. వీరితోపాటు మంత్రులు ఎస్‌ నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, టీఆర్‌ఎస్‌ రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గాదరి కిశోర్‌, భూపాల్‌రెడ్డి, భాసర్‌రావు సీఎంను కలిశారు. గిరిజన నేతలకు అధ్యక్ష పదవుల్లో ప్రాధాన్యమిచ్చినందుకు ఆత్రం సకు, కోరం కనకయ్య, కోవా లక్ష్మి సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.