Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే మనగడ్డకు మేలు

-కాంగ్రెస్ గెలిస్తే రాహుల్‌కు.. బీజేపీ గెలిస్తే మోదీకి లాభం -గులాబీ సైనికులు గెలిస్తే తెలంగాణకు ప్రయోజనం -16 మంది ఎంపీలను గెలిపించుకుంటే..ప్రధానిని నిర్ణయించే అధికారం మనదే -ముస్తాబాద్ బహిరంగసభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -బీజేపీ, కాంగ్రెస్‌కు పాలించే అర్హత లేదు:ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్

లోక్‌సభ ఎన్నికల్లో 16మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రయోజనాలను కేంద్రం మెడలు వంచి సాధించుకోవచ్చని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. దేశానికి దిశానిర్దేశంచేసే సత్తా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతిలో 16 ఎంపీ స్థానాలను గెలిపించి పెడితే ఏమి సాధిస్తారో భవిష్యత్తులో మీకే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రాహుల్‌కు లాభం జరుగుతుంది. బీజేపీని గెలిపిస్తే మోదీకి లాభం చేకూరుతుంది. అదే టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే తెలంగాణ గడ్డకు, మన బిడ్డలకు ప్రయోజనం చేకూరుతుంది అని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే వారు కేంద్రంలో అధికార పార్టీ సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్‌గా నిలబడుతారని, ఢిల్లీలో వారి ఆటలు సాగవని ఎద్దేవాచేశారు. గులాబీ సైనికులను గెలిపిస్తే కొట్లాడి ఎక్కువ నిధులు తెస్తారని, పేగులు తెగేదాకా పోరాడే దమ్ము టీఆర్‌ఎస్ పార్టీ నాయకులకే ఉందని చెప్పారు. అందుకే సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు అన్న నినాదంతో ముందుకుపోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణకు జాతీయ రహదారులు, రైలుమార్గాలు, కాళేశ్వరానికి జాతీయహోదా రావాలంటే పార్లమెంటులో గులాబీ సైనికులుండాలని చెప్పారు. బుధవారం రాజ న్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో టీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌కు మద్దతుగా నిర్వహించిన బహిరంగసభలో కేటీఆర్ ప్రసంగిస్తూ.. కౌరవులు వందమంది ఉన్నా ఐదుగురున్న పాండవులకే విజయం సిద్ధించింది. కేంద్రాన్ని నిలదీసే దమ్మూ, ధైర్యంకావాలి.. ఆ రెండు కేసీఆర్‌లో పుష్కలంగా ఉన్నాయి అని చెప్పారు.

ప్రధాని ఎవరో నిర్ణయించే సత్తా మనదే
16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏమి సాధిస్తారని కాంగ్రెస్, బీజేపీ నేతలంటున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ వాసన పడనోళ్లు చాలామంది ఉన్నారు. మమతాబెనర్జీ, మాయావతి, అఖిలేశ్‌యాదవ్, నవీన్‌పట్నాయక్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వాల్లోని పార్టీలను కలుపుకొంటే ఎంపీల సంఖ్య 170కు చేరుకుంటుంది. ప్రధాని ఎవరో మనమే నిర్ణయించే అధికారం ఉంటుంది అని వివరించారు. రైతులు, బీడీ కార్మికుల గురించి

ఎవరన్నా ఆలోచించారా?
డ్బ్భై ఏండ్ల చరిత్రలో ఏ సీఎం అయినా రైతు లు, బీడీ కార్మికుల గురించి ఆలోచించారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతుబిడ్డ కావడంవల్లే రైతుల సంక్షేమం గురించి పట్టించుకున్నారని చెప్పారు. ఎకరాకు రూ.5 వేలు చొప్పున రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీడీ కార్మికులందరికీ నెలకు రూ.వెయ్యి పింఛను ఇస్తున్నామని, పీఎఫ్ లేని కార్మికులకు కటాఫ్ డేట్ 2018 పెట్టి రాష్ట్రవ్యాప్తంగా మరో ఎనిమిది లక్షలమందికి ఏప్రిల్ నుంచి రూ.2,000 చొప్పున పింఛన్లు ఇవ్వనున్నామని తెలిపారు. నాలుగునెలల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతులకు కాళేశ్వరం, రంగనాయకసాగర్ ద్వారా గోదావరి జలాలిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.

నీతి ఆయోగ్ చెప్పినా నిధులివ్వని కేంద్రం
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులను చూసి నీతి ఆయోగ్ ప్రశంసించి, ఈ రెండు పథకాలకు రూ.24వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేస్తే, కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. కోటి ఎకరాలకు నీరందించే కాళేశ్వరానికి రూ.80 వేల కోట్లు ఖర్చుపెడుతున్నామని,వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపిస్తే అం దులో 90 శాతమన్నా పట్టుకొస్తారని అన్నారు.

లక్ష మెజార్టీతో వినోద్‌ను గెలిపించాలి
అసెంబ్లీ ఎన్నికల్లో తనను సిరిసిల్ల ఎమ్మెల్యేగా 89 వేల మెజారిటీతో గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్.. వినోద్‌కుమార్‌కు సిరిసిల్లలో లక్ష మెజారిటీ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. కేంద్రం లో పెద్దన్న పాత్ర పోషించే వినోద్‌కుమార్ గెలిస్తే కేవలం కరీంనగర్ ప్రాంతమే కాకుండా రాష్ట్రమంతటికీ నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పారు.

జోరుగా చేరికలు
ముస్తాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్, వినోద్‌కుమార్ గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

రెండేండ్లలో సిరిసిల్లకు రైలు కూత
బడితే ఉన్నోడిదే బర్రె అన్న చందాన.. కేంద్రంలో అధికారం ఉన్న నరేంద్రమోదీ.. నిధులన్నింటినీ బీజేపీ పాలిత రాష్ర్టాలకే తరలిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. రైల్వే మంత్రి ఎవరున్నా వారి ఊళ్లకే రైలుమార్గాలు వేసుకున్నారే తప్ప ఇతర రాష్ర్టాల గురించి, దేశంలోని వెనుకబడిన ప్రాంతాల గురించి పట్టించుకోలేదని చెప్పారు. ఈరోజు కొత్తపల్లి- మనోహరాబాద్ రైలుమార్గం పనులు శరవేగంగా సాగుతున్నాయని, గజ్వేల్ వరకు రైలు వస్తున్నదంటే అది సీఎం కేసీఆర్ చొరవేనన్నారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే కొత్తపల్లి- మనోహరాబాద్ రైలుమార్గం మంజూరుచేయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రైలుమార్గానికి అయ్యే వ్యయంలో సగం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నదని చెప్పారు. గజ్వేల్ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కరీంనగర్ వరకు రైలు రావాలంటే పార్లమెంటులో వినోద్‌కుమార్ ఉండి కేంద్రం మెడలు వంచాలన్నారు. వ్యవసాయానికి కేంద్రబిందువైన ముస్తాబాద్ మండలంలో వినోద్‌కుమార్ గెలిచిన తర్వాత కృషి విజ్ఞానభవన్ ఏర్పాటుచేస్తామని చెప్పారు.

దేశాన్ని పాలించే అర్హత బీజేపీ, కాంగ్రెస్‌కు లేదు: బీ వినోద్‌కుమార్
ప్రజామోదయోగ్యమైన పాలన అందించని కాంగ్రెస్, బీజేపీలకు దేశాన్ని పాలించే అర్హత లేదని టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ అన్నారు. వ్యవసాయం, రైతులు, పేదల గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు దేశంలో కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు. దేశంలో ఇప్పటికీ కరంటు ఎరుగని గ్రామాలున్నాయన్న వినోద్.. మోదీ కండ్లు తెరిచి ఈ వాస్తవాన్ని చూడాలని అన్నారు. దేశాన్ని అబ్బురపరిచేలా రైతులకు పంట పెట్టుబడి, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టిన కేసీఆర్.. దేశానికి దిక్సూచిలా నిలిచారని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.50వేల కోట్లు ఇచ్చిన కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు పైసా ఇవ్వలేదని విమర్శించారు. కొత్తపల్లి- మనోహరాబాద్ రైలుమార్గం మంజూరుకు బీజేపీ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టిందని, సగం నిధులను, ఐదేండ్లపాటు వచ్చే నష్టా న్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పెట్టిన షరతులను కేసీఆర్ అంగీకరించడంవల్లే రైలుమార్గం మంజూరు చేసిందన్నారు. కేం ద్రంలో మన ఎంపీల సంఖ్య 16 ఉంటే ఎన్ని నిధులైనా కొట్లాడి తెచ్చుకోవచ్చని, రైలుమార్గాలు, జాతీయ రహదారులు పూర్తి చేసుకోవచ్చని వివరించారు. భారీ మెజారిటీతో తనను గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ భానుప్రసాదరావు, పార్టీ ఉమ్మడి జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము బాలయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, తదితర నాయకులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.