ఆంధ్రా పార్టీల్లాగా డబ్బు సంచులు, వ్యాపారవేత్తల నుంచి పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్ కాదు..తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్‌ఎస్ అని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నల్లగొండ జిల్లా నకిరేకల్, కట్టంగూరు,కేతేపల్లి మండలాల్లో కాంగ్రెస్, సీపీఎంలకు చెం దిన పలువురు టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వేముల వీరేశం ఆధ్వర్యంలో జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఇంటి పార్టీగా స్వీకరిస్తున్నారన్నారు. టీడీపీ, కాంగ్రెస్ తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీ టీఆర్‌ఎస్ అని, టీఆర్‌ఎస్‌ను లేకుండా మింగేయాలని కొందరు ప్రయత్నం చేశారని ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని భావించి ప్రజలు టీఆర్‌ఎస్‌ను నిలబెట్టుకున్నారన్నారు. జిల్లాలో 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ నేతలు ఆధిపత్యం చెలాయిస్తూ జిల్లాకు ఒరగబెట్టిందేమీలేదన్నారు. వారికి మళ్లీ అవకాశం ఇస్తే తెలంగాణను ఆంధ్రోళ్లకు అమ్ముతారని ఆరోపించారు.