Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తస్మాత్ జాగ్రత్త..

-ఆంధ్రా బాబు తీరుపై అప్రమత్తతతో ఉండాలి -సీమాంధ్ర పాలకుల తప్పులను సరిదిద్దాలె.. – మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం -ప్రజలకు సుపరిపాలన అందిద్దాం.. మన పాలన చూసి దేశం గర్వించాలె -పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి జరుగొద్దు -క్యాంపు కార్యాలయంలో మంత్రులతో భేటీ -ఏపీతో వివాదాంశాలు, స్థానిక ఎన్నికలపై రెండు గంటలపాటు చర్చ -జెడ్పీ చైర్మన్ ఎన్నికల కోసం మంత్రులకు జిల్లాల బాధ్యతలు

K Chandrashekar Rao_0_0

ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా, వేగంగా అమలు జరిగేలా నిరంతరం అప్రమత్తతతో పనిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. తెలంగాణ ప్రజలకు దేశం గర్వించదగ్గ సుపరిపాలన అందిద్దామని పిలుపునిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం వివిధ శాఖల మంత్రులతో రెండుగంటలపాటు సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.కృష్ణా జలాల పంపిణీ, విద్యుత్ ఒప్పందాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న వివాదాస్పద వైఖరి, త్వరలో జరుగనున్న జెడ్పీ చైర్మన్ ఎన్నికలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, మహమూద్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగురామన్న, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చేసిన తప్పిదాలను పునః పరిశీలించి తెలంగాణకు జరిగిన అన్యాయాలను సవరించేందుకు మంత్రులు కృషి చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా తరుచూ వివాదాలు సష్టిస్తున్న అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ధోరణిని ఎప్పటికప్పుడు అంచనావేస్తూ తెలంగాణకు ఏమాత్రం నష్టం రాకుండా అప్రమత్తతతో మెలగాలని మంత్రులకు సూచించారు. నదీ జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ తప్పుడు వాదనలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు.

అవసరమైతే ఎక్కడైనా తెలంగాణ వాదనను బలంగా వినిపించేందుకు న్యాయవాదులను సిద్ధం చేసుకోవాలని సూచించినట్లు తెలిసింది. సొంత రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూనే పక్క రాష్ట్రం వ్యవహారాలపై కన్నేసి ఉంచాలని సూచించినట్లు సమాచారం. మంత్రుల పేషీల్లో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేసేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనన్నారు. ప్రజా సంక్షేమ పథకాల అమలులో పూచికపుల్లంత అవినీతి కూడా జరుగటానికి వీల్లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం.

అత్యధిక జెడ్పీ స్థానాలను దక్కించుకోవాలె జిల్లా పరిషత్, మండల పరిషత్ చైర్మన్లు, నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కించుకొనేందుకు కృషి చేయాలని మంత్రులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. హంగ్ ఏర్పడిన జిల్లాల్లో చైర్మన్ పోస్టులను దక్కించుకొనేందుకు వ్యూహాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైనప్పటికీ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలను సమన్వయం చేసి విజయం సాధించేందుకు పలువురు మంత్రులకు ఆయా జిల్లాల బాధ్యతలు అప్పగించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.