-హైదరాబాద్‌తో విడదీయరాని అనుబంధం -విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ -క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్‌తో భేటీ -రాష్ట్ర పారిశ్రామిక విధానాలను వివరించిన ముఖ్యమంత్రి -ప్రభుత్వం, విప్రో కలిసి పనిచేసే అంశంపై చర్చిద్దామని వెల్లడి

ఐటీ, పారిశ్రామిక రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు తెలంగాణ రాష్ర్టాన్ని వేదికగా మార్చుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ఐటీ, పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా రూపుదిద్దుతామన్నారు. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావును ఆదివారం ఉదయం సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. హైదరాబాద్‌లో విప్రో సంస్థల గురించి, నగరంతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని అజీమ్ ప్రేమ్ జీ సీఎం కు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో విప్రో సంస్థలను విస్తరించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ, పారిశ్రామిక రంగంలో తీసుకువస్తున్న మార్పులను విప్రో చైర్మన్‌కు వివరించారు. పరిశ్రమలకు అనుతులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే సింగిల్ విండో సిస్టంను ప్రారంభిస్తున్నదని తెలిపారు. పరిశ్రమల అనుమతికి పారదర్శకమైన, అవినీతిరహితమైన విధానాన్ని ఏర్పాటు చేసి స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుదని వివరించారు.
ఐటీ రంగంలో భారతదేశానికే హైదారబాద్ తలమానికమయ్యేలా కృషి చేస్తున్నామని, హైదరాబాద్ నగరాన్ని 4జీ, వై ఫై నగరంగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతిష్టాత్మకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. తెలంగాణలో మరిన్ని ఐటీ పార్కులు రావడానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఐటీ, పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని విప్రో చైర్మన్‌కు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, విప్రో కలిసి పనిచేసే అంశాలపై మరోసారి సమావేశమై చర్చిద్దామని సీఎం అజీమ్ ప్రేమ్ జీతో అన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ రావు పాల్గొన్నారు.