-కేంద్రం చర్యలు నిరాశ పర్చాయి -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్

నిర్మలా సీతారామన్ రెండో రోజు ప్రకటించిన ఉపశమన చర్యలు నిరాశపర్చాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ గురువారం పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన అంశాలు ఎక్కువగా బ్యాంకు ల అప్పులకు గురించే ఉన్నాయని, కోవిడ్ 19 తర్వాత బ్యాంకర్లు సమస్యల్లో ఉన్నారని, వారు ఆర్థిక సంవత్సరం ముగింపు లెక్కల్లో మునిగిపోయారని, బ్యాంకర్లు రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. రైతులు, వలస కూలీల కోసం ఎక్కువగా చర్యలు ప్రకటించారని, రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఇవన్నీ తీవ్రంగా నిరాశపర్చాయన్నారు. అవన్నీ ఉత్తర, తూర్పు రాష్ర్టాలను దృష్టిలో పెట్టుకునే చేశారని విమర్శించారు.
-నాబార్డు ద్వారా 30 వేల కోట్ల అత్యవసర వర్కింగ్ క్యాపిటల్ : ఈ చర్య ప్రాంతీయ, సహకార బ్యాంకుల రీఫైనాన్స్‌కు సంబంధించినది. రాష్ట్రంలో యాసంగి పంటలు ముగిశాయి. వానాకాలం పంటలకు ఇంకా సమయం ఉంది. వచ్చే రెండు నెలల్లో రైతులకు ఉపయోగం లేదు. -కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా 2 లక్షల కోట్ల రుణాలు: ఈ చర్యకూ ప్రస్తుత సంక్షోభానికి సంబంధం లేదు. రైతుల సంఖ్య, 2 లక్షల కోట్ల రుణం అనేది అంచనా మాత్రమే. క్షేత్రస్థాయి వాస్తవాలను పట్టించుకోలేదు. -సీఎల్‌ఎస్‌ఎస్ పొడిగింపు: వలస కార్మికులు తిరిగి వెళ్లిపోయిన దశలో మార్చి 2021 లోపు ఎవరైనా ఎలా లక్షాలు సాధిస్తారు. -కంపా ద్వారా 6వేల కోట్లు: ఇవి రాష్ర్టాలు చేపట్టిన పనులకు విడుదల చేయాల్సిన నిధులు. ఇవి ఇప్పటికే ఉన్న పథకం. -వీధి వ్యాపారులకు 5 వేల కోట్లు: ఇది కూడా రుణాలపై ఆధారపడిన పథకం. బ్యాంకర్లు సహకరించి, అమలు చేస్తారనే నమ్మకం లేదు. -ముద్రా రాయితీ రుణలు.. చౌక అద్దె గృహాలు: ముద్ర పథకం కింద రుణాలు తీసుకున్న వారు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. వారికి 1500 కోట్ల రాయితీ సరిపోదు -చౌక అద్దె గృహాల పథకం ముడు, నాలుగు సంవత్సరాల వరకు ప్రారంభమయ్యే పరిస్థితి లేదు.