Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

తెలంగాణకు ఆశీర్వాద్‌

-రూ.500 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో పైపుల తయారీ ప్లాంట్‌
-అలియాక్సిస్‌ గ్రూప్‌తో ఒప్పందం.. దావోస్‌లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ
-నోవార్టీస్‌ నంబర్‌ 2గా హైదరాబాద్‌ క్యాంపస్‌
-కేటీఆర్‌తో భేటీలో సీఈవో వసంత్‌ హర్షం
-హెచ్‌సీఎల్‌, భారత్‌ ఫోర్జ్‌, డెలాయిట్‌,
-సిక్వాసా క్యాపిటల్‌, ఎన్‌ఈసీ, ఎయిర్‌టెల్‌
-ప్రతినిధులతో కేటీఆర్‌ వరుస సమావేశాలు
-తెలంగాణలో విస్తరణ అవకాశాలపై చర్చలు
-ఏఐ టెక్నాలజీతో జాగ్రత్త
-ప్రజలు నమ్మితేనే దాని వినియోగం సాధ్యం
-‘ఏఐ ఆన్‌ ది స్ట్రీట్‌’ సదస్సులో మంత్రి కేటీఆర్‌

దావోస్‌లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పెట్టుబడి అనుకూల విధానాలకు పారిశ్రామికవేత్తలు ఫిదా అవుతున్నారు. తొలిరోజు లూలు కంపెనీ 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా.. కీమో ఫార్మా మరో వంద కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకొన్నది.

రెండోరోజు ఆశీర్వాద్‌ పైప్స్‌ కంపెనీ.. తన తయారీ ప్లాంట్‌ను 500 కోట్లతో హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించింది. జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులు తెలంగాణలోనే తయారుచేసి.. ఇక్కడి నుంచే ఎగుమతులు చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఫార్మా దిగ్గజం నోవార్టీస్‌ కంపెనీ సీఈవో నరసింహన్‌తో మంత్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. సంస్థ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన కొద్దిరోజుల్లోనే.. ప్రపంచంలోనే తమ కంపెనీకి రెండో అతి పెద్ద కార్యాలయంగా ఎదగడం పట్ల నరసింహన్‌ సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణలోని నైపుణ్యం కలిగిన మానవవనరుల వల్లనే తమ సంస్థ పెరుగుతున్నదని కొనియాడారు.

డెలాయిట్‌, హెచ్‌సీఎల్‌, ఎన్‌ఈపీ, ఎయిర్‌టెల్‌, భారత్‌ఫోర్జ్‌.. ఇలా ఒకదాని తరువాత ఒకటిగా పలు కంపెనీల ప్రతినిధులు మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరుపుతూనే.. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం చర్చా గోష్ఠుల్లో మంత్రి కేటీఆర్‌ పాల్గొంటున్నారు.

మంగళవారం ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆన్‌ ది స్ట్రీట్‌-మేనేజింగ్‌ ట్రస్ట్‌ ఇన్‌ ది పబ్లిక్‌ స్కేర్‌ అన్న అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. సాయంత్రం సద్గురు జగ్గీవాసుదేవ్‌తో కలిసి సేవ్‌ ద సాయిల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. పైపులు, ఫిట్టింగ్స్‌ వంటి ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఆశీర్వాద్‌ పైప్స్‌ (అలియాక్సిస్‌ గ్రూపు) సంస్థ రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మంగళవారం దావోస్‌లో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు సమక్షంలో సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకొన్నారు. తెలంగాణ నుంచే తమ ఉత్పత్తులను ఇతరదేశాలకు ఎగుమతి చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాలు రెండోరోజున తెలంగాణ పెవిలియన్‌లో అలియాక్సిస్‌ కంపెనీ సీఎఫ్‌వో కోయెన్‌ స్టికర్‌.. మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు.

అనంతరం స్టికర్‌ మాట్లాడుతూ.. తాము ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ ద్వారా స్టోరేజీ, డిస్ట్రిబ్యూషన్‌ పైప్స్‌, ఫిట్టింగ్స్‌ వంటి ప్లాస్టిక్‌ ఉత్పత్తులను తయారుచేస్తామని, దేశీయ మార్కెట్ల కోసం మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయి ఉత్పత్తులను కూడా ఇతర దేశాల కోసం తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నామని పేర్కొన్నారు. ఆశీర్వాద్‌ పైప్స్‌ సంస్థకు కేటీఆర్‌ ఆహ్వానం పలికారు. ఈ సంస్థ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్లాస్టిక్‌ ఉత్పత్తి రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తుందని, ఆశీర్వాద్‌ పైప్స్‌ వల్ల ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వస్తాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ సంస్థకు అన్ని విధాల సహాయ సహకారాన్ని అందిస్తామని చెప్పారు.

కేటీఆర్‌తో ఏపీ సీఎం జగన్‌, ఆదిత్య ఠాక్రే భేటీ
మహారాష్ట్ర టూరిజంశాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే మంగళవారం దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై వారు చర్చించారు. తెలంగాణలో ఐటీ, లైఫ్‌ సైన్సెస్‌, ఫార్మా రంగాల్లో సాధిస్తున్న పురోగతి.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ఆదిత్య ఠాక్రే ఆసక్తి కనబరిచారు. తెలంగాణలో హరితహారం, మున్సిపల్‌, పంచాయతీ చట్టాల్లో 10 శాతం నిధులను గ్రీన్‌ బడ్జెట్‌ కింద కేటాయించడం వంటి కీలకమైన సంసరణల గురించి మంత్రి కేటీఆర్‌.. ఆదిత్య ఠాక్రేకు వివరించారు. మరింత అధ్యయనం చేసేందుకు హైదరాబాద్‌ వస్తానని ఆదిత్య ఠాక్రే తెలిపారు.

ఈ సందర్భంగా మహారాష్ట్రలో పట్టణాభివృద్ధికి చేపట్టిన పలు అంశాలపై ఆదిత్య ఠాక్రే.. మంత్రి కేటీఆర్‌కి వివరాలు అందించారు. పరస్పరం కలిసి పని చేసినప్పుడు రాష్ట్రాలు బలోపేతం అవుతాయని, తద్వారా బలమైన దేశం రూపొందుతుందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ‘యూత్‌ఫుల్‌ అండ్‌ డైనమిక్‌ ఆదిత్య ఠాక్రేజీతో భేటీ అవ్వడం సంతోషకరంగా ఉన్నది. తెలంగాణ, మహారాష్ట్ర కలిసి ఎలా పనిచేయాలనే అంశంపై విస్తృతంగా చర్చించాము. స్ట్రాంగర్‌ స్టేట్స్‌.. స్ట్రాంగర్‌ ది కంట్రీ’ అని సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌చేశారు.

దావోస్‌లో కేటీఆర్‌తో భేటీ అయిన ప్రముఖులు

భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ అమిత్‌ కల్యాణి నేతృత్వంలోని బృందం మంత్రి కేటీఆర్‌ను కలిసింది. తెలంగాణలో భారత్‌ ఫోర్జ్‌ పెట్టుబడులపై ఈ సందర్భంగా వారు చర్చించారు.
హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఎండీ విజయ్‌ గుంటూర్‌ మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాష్ట్రంలో హెచ్‌సీఎల్‌ విస్తరణ గురించి, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడంపై చర్చించారు.
ఎయిర్‌టెల్‌ ఇండియా చైర్మన్‌ భారతీ మిట్టల్‌, వైస్‌ చైర్మన్‌ రాజన్‌ భారతి మిట్టల్‌ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో డేటా సెంటర్‌ ఏర్పాటు నెలకొల్పాల్సిందిగా మంత్రి వారిని ఆహ్వానించారు.
ఎన్‌ఈసీ కార్పొరేషన్‌ సీనియర్‌ ఈవీపీ నోరింకో ఇషిగురో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. తెలంగాణలోని ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ కోసం ఎన్‌ఈసీ ఎక్సలెన్స్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. టెలికాం పరికరాల తయారీ యూనిట్లను నెలకొల్పాల్సిందిగా కోరారు.
దావోస్‌లో తెలంగాణ ప్రతినిధిగా మంత్రి కేటీఆర్‌ నాయకత్వం వహించడం పట్ల ప్రముఖ షూటర్‌, ఒలింపియన్‌ గగన్‌ నారంగ్‌ శుభాకాంక్షలు తెలుపగా.. మంత్రి కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు.
మంత్రి కేటీఆర్‌తో సిక్వోసా క్యాపిటల్‌ ఎండీ మోహిత్‌ భట్నాగర్‌, రాజన్‌ ఆనందన్‌, సీపీవో శ్వేత రాజ్‌పాల్‌ కోహ్లి సమావేశం అయ్యారు. తెలంగాణలోని స్టార్టప్‌లపై సిక్వోసా ఆసక్తి కనబరిచింది. అగ్రిటెక్‌, ఫిన్‌టెక్‌, వెబ్‌3, సాస్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వం, సిక్వోసా నిర్ణయించాయి.
డెలాయిట్‌ గ్లోబల్‌ సీఈవో పునిత్‌ రాజన్‌తో మం త్రి కేటీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిజిటల్‌ హెల్త్‌, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌, ైక్లెమేట్‌ చేంజ్‌ వంటి అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం, డెలాయి ట్‌ కలిసి పనిచేయడంపై చర్చించారు. డెలాయిట్‌ లో 40వేల మందికిపైగా ఉద్యోగులు ఉన్నారు. హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఉపాధి కల్పిస్తున్న ది. దేశంలో తమ కార్యకలాపాలను విస్తరించాల ని డెలాయిట్‌ భావిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.