తెలంగాణ సాధన కోసం తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు చేసిందేమీలేదని టీఆర్‌ఎస్ జాతీయ కార్యదర్శి కే కేశవరావు విమర్శించారు. తామేదో చేస్తే తెలంగాణ వచ్చిందన్న భావన వాళ్లలో ఉందని పేర్కొన్నారు. ఇప్పటికైనా టీ కాంగ్ నేతలు పిచ్చిమాటలు మానుకోవాలని హితవు పలికారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే అది కేసీఆర్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమనే విషయం టీఆర్‌ఎస్‌లోకి నేతల చేరికలే రుజువని వివరించారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే జాతీయ పార్టీలతో సాధ్యంకాదని, టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని వెల్లడించారు. ఇవాళ జలగం వెంకట్రావు, పుట్ట మధు పార్టీలోకి చేరడం టీఆర్‌ఎస్‌కు కొత్త ఉత్సాహాన్నిస్తుందని వెల్లడించారు.