గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వంతోపాటు స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు చేయూతనందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (నిథమ్)లో సేవా భారతి, యూత్ ఫర్ సేవ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల టెక్ ఫర్ సేవ సదస్సును ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజంలో అన్ని సమస్యలకు విద్య లేకపోవడమే కారణమన్నారు.
-టెక్ ఫర్ సేవ సదస్సు ప్రారంభంలో మంత్రి ఈటల -ప్రతి ఒక్కరూ సేవాకాంక్ష కలిగి ఉండాలి: స్వామి బోధమయానంద
టెక్నాలజీ, సైన్స్‌రంగాల్లో ఎంతో పురోగతి సాధిస్తున్నప్పటికీ విద్య, వైద్య రంగాల సేవలు పేదలకు చేరడం లేదని చెప్పారు.రామకృష్ణ మఠం డైరెక్టర్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ కార్పొరేట్, ఐటీ సంస్థల ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు సమాజహితానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. పెన్నార్ గ్రూప్‌చైర్మన్ నృపేందర్‌రావు, గణేశ్ నటరాజన్, డాక్టర్ సతీశ్‌రెడ్డి, నిథమ్ అధ్యాపకులు, అధికారులు, విద్యార్థులతోపాటు దేశంలోని 220 స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, 100 ఐటీ, కార్పొరేట్ సంస్థలకు చెందిన ఉద్యోగులు ఈ సదస్సులో పాల్గొన్నారు.