-కొనసాగుతున్న టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ -ఉత్సాహంగా పాల్గొంటున్న శ్రేణులు -ప్రజల నుంచి విశేష స్పందన

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా కొనసాగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు తదితరులు సభ్యత్వ నమోదులో పాల్గొంటుండగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్ అభిమానులు, ప్ర జలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలను స్వీకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని పాత మలక్‌పేట డివిజన్‌లో ఆదివా రం నిర్వహించిన టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ పాల్గొని పలువురికి సభ్యత్వాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు పాత బస్తీలో విశేష స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా ముస్లింలు ఉత్సాహంగా ముందుకువస్తున్నారని తెలిపారు.

కార్యక్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, టీఆర్‌ఎస్ గ్రేటర్ అడ్‌హక్ కమిటీ సభ్యుడు బుగుడాల సుదర్శన్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ, బుధవార్‌పేట్, ఈద్‌గాం కాలనీల్లో టీఆర్‌ఎస్ సభ్య త్వ నమోదులో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరం గా చేపట్టాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండ లం దేవరయాంజాల్, అలియాబాద్, బొమ్మరాశిపేట, తూంకుంట, జవహర్‌నగర్, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు ను ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు.

సిద్దిపేటలో.. సిద్దిపేట పట్టణంలో ఆదివారం నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పాల్గొని మాట్లాడుతూ.. సిద్దిపేట నియోజకవర్గంలో 70 వేల సభ్యత్వాలను చేయనున్నట్టు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేట మున్సిపాలిటీ పరిధిలోని మురళీకృష్ణ కాలనీలో నిర్వహించిన సభ్యత్వ నమోదులో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, నియోజకవర్గ మాజీ ఇంచార్జి కొత్త మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

వరంగల్‌లో.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, కుడా చైర్మన మర్రి యాదవరెడ్డి తదితరులు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాల్లో ఆదివారం నిర్వహించిన సభ్యత్వ నమోదులో ఇంచార్జి గట్టు రాంచందర్‌రావు, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, తాండూరు, వికారాబాద్ ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యే సురేందర్, ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న, ఖమ్మంజిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జమ్మికుంట, హుజూరాబాద్, వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో టీఆర్‌ఎస్ జిల్లా ఇంచార్జి బస్వరాజు సారయ్య, జెడ్పీ చైర్‌పర్సన్ విజయ, రామగుడు మండలం గోపాలరావుపేటలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

నల్లగొండలో.. నల్లగొండ పట్టణంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, సభ్యత్వ నమోదు ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నార్కట్‌పల్లిలో నకిరేకల్ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య, యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం మండలాల్లో సభ్యత్వ నమోదు ఇంచార్జి కర్నె ప్రభాకర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, వనపర్తి జిలా గోపాల్‌పేట మండలం పొల్కెపహాడ్‌లో జెడ్పీ చైర్మన్ రాకాసి లోకనాథ్‌రెడ్డి, ములుగు జిల్లా కేంద్రం లో జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ తదితరులు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.
