Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సారు చూపిన మార్గం.. సాలు పట్టిన సేద్యం

అన్నదాత ఇంట ధనలక్ష్మి సవ్వడులు 50,000 కోట్లు

-రైతుబంధు రికార్డు.. నేడే చరిత్రాత్మక ఘట్టం
-నేడు ఆవిష్కృతం కానున్న చరిత్రాత్మక ఘట్టం
-8 సీజన్‌లలో నిరాటంకంగా కొనసాగిన పంపిణీ
-కరోనా సంక్షోభంలోనూ ఆగని పెట్టుబడి సాయం
-నాలుగేండ్లలో భారీసాయం అందజేసిన ఏకైక రాష్ట్రం
-రైతులకు దన్నుగా నిలుస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం
-సంబురాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న రైతాంగం
-కేంద్రానికీ, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన పథకం

తన నేలను పచ్చితనంతో.. తన పంటను పచ్చదనంతో..తన రైతును నవ్వు ముఖంతో చూడాలన్న భూమి పుత్రుడి సంకల్పం నెరవేరిన శుభదినమిది.

భగీరథుడి మనోరథం ఈడేరి.. తన జన్మభూమి సుజలాం.. సుఫలాం అంటూ కర్మభూమిగా సుభిక్షమవుతున్న సందర్భమిది. అదివరకెప్పుడూ లేని ఆలోచనే బీజమై.. సరైన అదనులో.. తెలంగాణ కార్యక్షేత్రంలో పడి చిగురించి..కారు కారుకు శాఖోపశాఖలై విస్తరిల్లి.. నాలుగేండ్లలోనే ఏబది వేల కోట్ల మహావృక్షమై విరాజిల్లిన మహత్తరమైన సమయమిది. ఎండిన బతుకుల్ని.. బంగరు వరి కంకిలా.. దూది పువ్వులా చిగురింపజేసిన ఎరువు రైతుబంధు.

ఇది మన పల్లెల ముంగిళ్లలో ముందే వచ్చిన సంక్రాంతి. ప్రపంచానికి ఇదే అసలైన రైతు దినోత్సవం.

రైతుబంధు.. రైతుకు భరోసా కల్పించిన బంధువు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల పీడ నుంచి విముక్తి కల్పించిన ఆత్మబంధువు. భూమి భారం కాదు.. కాసుల హారం అని నమ్మకం కలిగించిన హితుడు.. పొలాన్ని అడ్డికి పావుసేరుకు తెగనమ్ముకొనే అగత్యాన్ని తప్పించి.. నేలతల్లే.. రైతు నెచ్చెలి అనిపించిన స్నేహితుడు. ఇది తెలంగాణలో రైతుబంధు సాధించిన విజయం. దేశ వ్యవసాయరంగానికి అందించిన స్ఫూర్తి. ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసిన అద్భుతం. ఎకరానికి పదివేల చొప్పున సుమారు 63 లక్షల మందికి మొత్తం 8 విడతల్లో సగటున 80 వేల రూపాయలను అందించి ఎవుసాన్ని పండుగ చేసిన రైతుబంధు.. ప్రపంచానికి సీఎం కేసీఆర్‌ అందించిన సాగు బంధువు.

రాష్ట్ర వ్యవసాయ రంగంలో సోమవారం చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. రైతుబంధు పథకం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు రైతులకు పెట్టుబడి సాయంగా అందజేసిన మొత్తం రూ.50 వేల కోట్ల మార్క్‌ను దాటనున్నది. కేవలం నాలుగేండ్లలో రైతులకు ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సాయం అందజేసిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నది. 2018 వానకాలం సీజన్‌ నుంచి రైతుబంధును ప్రారంభించగా ప్రస్తుతం 8వ విడత పంపిణీ కొనసాగుతున్నది.

ఎకరాకు ఒక్కొక్క సీజన్‌లో రూ.5 వేలు, ఏడాదికి రూ.10వేల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తున్నది. ఇందుకోసం ఏటా దాదాపు రూ.15 వేల కోట్లు వెచ్చిస్తున్నది. కేసీఆర్‌ ప్రభుత్వం తొలి ఏడు విడతల్లో రూ.43,036.64 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. 8వ విడతగా దాదాపు రూ.7,500 కోట్లు పంపిణీ చేయాలని సంకల్పించి, ఇప్పటికే రూ.6,008.27 కోట్లను జమ చేసింది. ఏడు రోజుల్లో 60.16 లక్షల మంది ఖాతాల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం సోమవారం మిగిలినవారికి బదిలీ చేయనున్నది. దీంతో 8 విడతల్లో జమ చేసిన మొత్తం రూ.50 వేల కోట్ల మార్క్‌ను దాటనున్నది.

గత రెండేండ్లుగా కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతోపాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నప్పటికీ.. రైతుబంధును ఆపకపోవడం రైతుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి, వ్యవసాయరంగం అభివృద్ధి పట్ల ఉన్న మమకారానికి నిదర్శనం. అందుకే రాష్ట్రవ్యాప్తంగా రైతులు రూ.50 వేలు మార్క్‌ దాటుతున్న సందర్భాన్ని మహోత్సహంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తూ, ఊరూరా ర్యాలీలు నిర్వహిస్తూ తమ కృతజ్ఞతను చాటుకొంటున్నారు.

రైతుబంధు తమ జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించిందని, వ్యవసాయరంగంలో కొత్త ఉత్సాహం నింపిందని రైతులు సగర్వంగా చెప్పుకొంటున్నారు. రైతు బాంధవుడు కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తాము ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సిన దురవస్థ చాలావరకు తప్పిందని లక్షలమంది రైతులు హృదయపూర్వకంగా మెచ్చుకొంటున్నారు. రైతుబంధు నిధులు అందుకొన్న ప్రతి రైతు ముఖంలోనూ సంతోషం తొణికిసలాడుతున్నది.

కేసీఆర్‌ సార్‌ ఉన్నంత కాలం తమ పంటల పెట్టుబడికి ఢోకా ఉండదని, సీజన్‌ ఆరంభంలోనే ఠంచన్‌గా తమకు ప్రభుత్వ సాయం అందుతుందన్న విశ్వాసం రైతుల్లో వ్యక్తమవుతున్నది. రైతుబంధు పథకం ఒక్క రైతుల జీవితాల్లోనే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకే నూతన జనసత్వాలు తీసుకొచ్చిందనే భావన సర్వత్రా నెలకొన్నది. పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పేరుతో కేంద్ర ప్రభుత్వం, వివిధ పేర్లతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, ఆంధ్రప్రదేశ్‌ లాంటి రాష్ర్టాలు కూడా ఎంతోకొంత మొత్తంలో పెట్టుబడి సాయం అందజేయడం రైతుబంధు ప్రాధాన్యాన్ని, ప్రభావాన్ని చాటి చెప్తున్నది. రైతులకు పెట్టుబడి సాయం అందించడంలోనూ, వారిపట్ల ప్రేమానురాగాలు ప్రదర్శించడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ప్రపంచానికే రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నది.

ఖర్సులన్నీ ఎల్లుతున్నై
తెలంగాణ రాక ముందు మా బతుకులు ఘోరంగా ఉండె. పంటలు సరిగ్గా పండక లాగోడికి కష్టమయ్యేది. అప్పులు జేయనిదే నడువకపోయేది. ఇప్పుడు ఆ బాధలన్నీ పోయినయి. ఉచిత కరెంట్‌ వస్తున్నది. సాగు నీటికి రందిలేదు. రైతుబంధు డబ్బుల తో విత్తనాలు, ఎరువులకు ఢోకాలేదు. నాకున్న 3.30 ఎకరాలకు 18 వేలు వస్తున్నాయ్‌. ఖర్సులన్నీ ఎల్లుతున్నై. కేసీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటం.

-దయ్యాల కుమార్‌, బాయమ్మపల్లి, ఓదెల, పెద్దపల్లి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.