Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సంక్షేమ సారథి… అభివృద్ధి వారధి..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆది నుంచీ సకలజనుల సంక్షేమమే లక్ష్యంగా సాగుతున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే అన్ని వర్గాలకూ పెద్దపీట వేశారు. నాలుగున్నరేళ్లలోనే 400లకు పైగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఆదర్శంగా నిలిచారు. ఆసరా, ఆహారభద్రత, సర్కారు విద్యా సంస్థల్లో సన్నబియ్యం అన్నం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబస్తీ, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, కేజీటూపీజీ, కేసీఆర్‌కిట్ ఇలా ఎన్నో పథకాలను అమల్లోకి తెచ్చారు.

సర్కారు దవాఖానల ఆధునికీకరణ, రోడ్లు, భవనాల నిర్మాణం లాంటి వాటితో ప్రగతిని పరుగులు పెట్టించారు. ప్రధానంగా రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి, రుణమాఫీ చేశారు. ఆ తర్వాత 2018 జనవరి ఒకటి నుంచి వ్యవసాయరంగానికి నిరంత ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. మన జిల్లా నుంచే ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇంకా రైతుబంధు, రైతుబీమా పథకాలకు ఇక్కడే అంకురార్పణ చేశారు. ఇలా ఎన్నో పథకాలతో ప్రజలకు చేరువైన అధినేత కేసీఆర్, రెండో సారి ముఖ్యమంతిగా బాధ్యతలు స్వీకరించారు. బంగారు తెలంగాణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆయన, కరీంనగర్ అంటే మొదటి నుంచీ ప్రత్యేక ప్రేమ చూపుతున్నారు. ఇక్కడి నుంచే ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ, ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారు.

రూ. 500 కోట్ల అంచనాతో చేపట్టిన మానేరు రివర్‌ఫ్రంట్ నిర్మాణానికి సంబంధించి, ఇప్పటికే రూ.196కోట్లను ఇప్పటికే కేటాయించారు. టాటా కన్సల్టెన్సీ ద్వారా పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇటు కరీంనగర్- సదాశివపల్లె రోడ్డుకు సంబంధించి మానేరుపై 183 కోట్లతో సస్పెన్షన్ వంతెన నిర్మిస్తున్నారు. స్థానికంగానే ఐటీరంగంలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఉజ్వల పార్కు సమీపంలో 25 కోట్లతో ఐటీ భవనం నిర్మిస్తున్నారు.

ఆసరా అండ..
నాటి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి జిల్లా మొత్తంగా 3.98 లక్షల మంది పింఛన్లు పొందారు. వీరికి నెలకు 11.18 కోట్లు పంపిణీ చేశారు. అదే స్వరాష్ట్రంలో 5,42,049 మందికి నెలకు 57.74 కోట్లు అందజేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పింఛన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 57కి ముఖ్యమంత్రి కేసీఆర్ తగ్గించడంతో, ప్రాథమిక అంచనా ప్రకారం కొత్తగా 47,248 మందికి పింఛన్ వచ్చే అవకాశమున్నది. పాత, కొత్త కలుపుకొని చూస్తే 5.89 లక్షల మందికి అందనున్నది. వచ్చే ఏప్రిల్ నుంచి లబ్ధిదారుల సంఖ్య పెరగనుండగా, వాటిని పరిగణలోకి తీసుకుంటే పింఛన్ మొత్తం 115.50 కోట్లు దాటే అవకాశమున్నది.

రుణమాఫీతో ఊరట..
టీఆర్‌ఎస్ సర్కారు అధికారంలోకి రాగానే రైతులను రుణవిముక్తులను చేసింది. 2014లో మొదటిసారి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,95,958 మందికి 1693.52 కోట్ల రుణమాఫీ చేసింది. నాలుగు విడతల్లో ఇది వర్తింప జేసింది. ఈ సారి కడా ప్రభుత్వం రుణమాఫీకి చేయనున్నది. మొత్తం 3,22,889 మంది రైతులకు 1,366 కోట్లు మాఫీ అయ్యే అవకాశమున్నది.

రైతుబంధువు..
ఏటా సీజన్లలో పంట పెట్టుబడుల కోసం ఆగమవుతున్న రైతులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. ఒక్కో సీజన్‌లో ఎకరాకు 4వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు కలుపుకొని 8వేలు ఇవ్వాలని నిర్ణయించారు. 2018 మే 10న హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ వేదికగా రైతుబంధుకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడిజిల్లాలో ఈ పథకం కింద రెండు విడతలుగా 5,64,693 మంది రైతులకు 800.28 కోట్ల లబ్ధి కల్పించారు. వచ్చే సీజన్ నుంచి ఎకరాకు 5వేల చొప్పున ఏడాది 10వేలు ఇవ్వబోతున్నారు.

రైతుబీమా.. ధీమా..
నాడు ఆత్మహత్యలు, అనారోగ్య సమస్యలు, అనుకోని ప్రమాదాల్లో రైతులు చనిపోయినా, ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి కుటుంబాలు రోడ్డునపడ్డా కనీసం ఆదుకోలేదు. ఈ పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్, బాధిత కుటుంబాలకు కొండంత అండగా ఉండాలని భావించారు. ఎంతో ఉదారంగా వ్యవహరించారు. 2018న ఫిబ్రవరి 26న అంబేద్కర్ స్టేడియం వేదికగా రైతు బీమా ప్రకటించారు. ఒక్కొక్కరికి పాలసీ చేయించి, ఏడాదికి 2,271 చొప్పన ప్రీమియం కట్టారు. ఆగస్టు 15 నుంచి పథకాన్ని అమల్లోకి తెచ్చారు. నేటి వరకు వివిధ కారణాలతో 588 మంది మరణించగా, ఇందులో 578 కుటుంబాలకు 28.90 కోట్ల బీమా అందించింది.

కేసీఆర్ కిట్.. సూపర్ హిట్..
మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా సీఎం కేసీఆర్, 2017 జూన్2న కేసీఆర్ కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. సర్కారు దవాఖానల్లో సుఖప్రసవాలను ప్రోత్సహించారు. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు జన్మనిచ్చే వరకు మూడు విడతల్లో 12వేలతోపాటు ఇచ్చారు. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి అందజేశారు. నవజాత శిశువు రక్షణకు కేసీఆర్ కిట్ పేరిట 2వేల విలువైన 16రకాల వస్తువులు ఇచ్చారు. ఇప్పటి వరకు 39,961 మందికి కిట్లు పంపిణీ చేశారు.

ఆడపిల్ల పెళ్లికి కానుక..
పేదంటి ఆడపిల్ల పెళ్లికి సాయం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను తెచ్చారు. ఈ పథకాల కింద ఒక్కో ఆడపిల్ల పెళ్లికి, లక్ష నూటపదహార్లు అందిస్తున్నారు. ఇప్పటివరకు కల్యాణలక్ష్మి కింద ఉమ్మడి జిల్లాలో 14,752 మందికి, షాదీ ముబారక్ కింద 2,689 మందికి సాయం చేశారు.

మెరుగైన సర్కారు వైద్యం..
స్వరాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానల బలోపేతానికి పెద్దపీట వేశారు. భారీగా నిధులు కేటాయించారు. ఆధునికీకరణ చేపట్టారు. దీంతో ఉమ్మడి జిల్లాలో సర్కారు వైద్యం మరింత మెరుగుపడింది. కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో 150 పడకలతో 2017 జూలై 21న మతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) ప్రారంభమైంది. సకల వసతులతో కార్పొరేట్ స్థాయిలో సేవలందిస్తుండగా, రోజురోజుకూ గర్భిణుల తాకిడి పెరిగింది. ఇప్పటి వరకు 14,434 మందికి ప్రసవాలు చేసినట్లు దవాఖాన సిబ్బంది తెలిపింది. 2016 నుంచి ఎనిమిది పడకల ఐసీయూ, ఏడు పడకల పాలిట్రామా ఐసీయూలో అత్యసవర సేవలు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. డయాలసిస్ కేంద్రంతోపాటు, ఎంసీహెచ్‌లో మిడ్‌వైఫరీ శిక్షణ కేంద్రం, వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటయ్యాయి. హుజూరాబాద్‌లో 100, జమ్మికుంటలో 50 పడకల దావాఖానాలు ప్రారంభమయ్యాయి.

కేజీ టూ పీజీ..
పెద్దపల్లి: కేజీ టూ పీజీ విద్యలో భాగంగా ఉమ్మడి జిల్లాలోవేలాది మందికి లబ్ధి కలుగుతోంది. కరీంనగర్ జిల్లాలో కొత్తగా తొమ్మిది మైనార్టీ రెసిడెన్సియల్, 5 బీసీ, 4 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేశారు. ఇందులో 5,760 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో కొత్తగా ఆరు గురుకుల పాఠశాలలు, పెద్దపల్లిలో మినీ గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. ప్రతి గురుకుల పాఠశాలలో 640 మంది చొప్పున విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో మైనార్టీ, ఎస్సీలకు సంబంధించి ఐదు చొప్పున, బీసీలకు 3 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. మొత్తం 13 గురుకుల పాఠశాలల్లో 4960 సీట్లు ఉండగా, ప్రస్తుతం 13 బళ్లలో కలిపి, 4,750 మంది విద్యార్థులు చదువుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు బీసీ, రెండు ఎస్సీ, ఒకటి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్వహిస్తున్నారు.

ఇంటింటికీ భగీరథ నీళ్లు..
జలగోసకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. మిషన్ భగరీథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాకు అత్యధిక నిధులు ఇచ్చి ప్రతి హాబిటేషన్‌కు మిషన్ భగీరథ కింద స్వచ్ఛమైన నీరు అందించేందుకు 6,170 కోట్లతో పనులు చేపట్టగా, 98 శాతం పనులు పూర్తి చేశారు. ఏప్రిల్ చివరి నాటికి ప్రతి ఇంటికీ మంచినీరు ఇచ్చ అవకాశమున్నది. మెజార్టీ చోట్ల పనులు పూర్తి కాగా, ట్రయల్న్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పటికే పలు గ్రామాలకు శుద్ధజలం అందిస్తున్నారు.

శరవేగంగా కాళేశ్వరం..
తెలంగాణ కోటి ఎకరాల మాగాణిగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు శ్రీకారం చుట్టారు. 2016 మార్చి 31న శాసనసభా వేదికగా పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మే2న మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు. ఆ రోజే తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే మా ప్రజల సాగు, తాగునీటి గోస తీర్చడానికి. ఆరునూరైనా సరే.. ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. ఎవ్వరూ దీనిని ఆపలేరు. అనవసరమైన పిచ్చి ఆలోచనలకు పోవద్దు అని హెచ్చరించారు. నిజంగానే ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా సీఎం ముందుకుసాగుతున్నారు. చెప్పింది చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి అకుంఠిత దీక్షతో అవాంతరాలను అధిగమించి శరవేగంగా పనులు చేయిస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి కాళేశ్వరం జలాలను మధ్యమానేరు వరకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మధ్యమానేరు ఓ నిదర్శనం..
తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులను ఎంత స్పీడ్‌గా పూర్తి చేస్తున్నామో చెప్పడానికి 25.873 టీఎంసీల సామర్థ్యం గల మధ్యమానేరు ప్రాజెక్టే నిదర్శనం. ఈ ప్రాజెక్టుకు 2006లో కాంగ్రెస్ ప్రాజెక్టు పునాది వేసింది. 2009 మార్చి నాటికి పూర్తి కావాలి. కానీ, నాటి ప్రభుత్వ చిన్నచూపుతో జాప్యం జరిగింది. స్వరాష్ట్రంలో టీఆర్‌ఎస్ సర్కారు ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2006 నుంచి 2014 వరకు కాంగ్రెస్ హయాంలో జరగని పనులను కేవలం మూడున్నరేళ్లలో చేసి చూపింది. చివరి 18 నెలల్లో మెజార్టీ పనులు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. రాష్ట్రం ఏర్పాటుకు ముందు సుమారు పదేళ్లలో చేసిన వ్యయం 107 కోట్లు మాత్రమే కాగా, కేసీఆర్ ప్రభుత్వం 491 కోట్లను వెచ్చించి యుద్ధప్రాతిపదికన పనులను పూర్తి చేసింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో మధ్యమానేరు కుడికాలువ ద్వారా హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాల్లోని పది మండలాల్లోని 73,690 ఎకరాలకు సాగునీరు అందనున్నది. హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతానికి ఇప్పటికే గోదారమ్మ పరవళ్లు తొక్కింది.

ఎస్సారెస్పీ ఆయకట్టుకు జీవం..
1963 జూలై 26 ఆనాటి ప్రధాని నెహ్రూ పోచంపాడు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. 1970 జూలై 24న అప్పటి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీరాంసాగర్ స్టేజీ-1 కింద పూర్వ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పరిధిలో 9,68,640 ఎకరాలకు, ఎస్సారెస్పీ స్టేజీ- 2 కింద 3,97,949 ఎకరాలకు నీళ్లు అందించాలని నిర్ణయించారు. మొత్తంగా 13,66,589 ఎకరాలకు నీళ్లు అందించాలి. కానీ, ఏనాడు నాలుగైదు లక్షల ఎకరాలకు మించి సాగునీరివ్వలేదు. ప్రస్తుతం వేయి కోట్లతో తెలంగాణ ప్రభుత్వం కాల్వల ఆధునికీకరణ పనులు చేపట్టింది. కాకతీయ కాలువ గరిష్ఠ సామర్థ్యం 8,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని భావిస్తున్నది. వచ్చే ఖరీఫ్ నుంచే పూర్తిస్థాయిలో నీరు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, ఇందుకోసం పనులు చరుకుగా సాగుతున్నాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ప్రాజెక్టు ప్రారంభమైన 49 ఏళ్ల చరిత్రలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడమేకాదు, ఏకంగా ఎస్సారెస్పీ ఆయకట్టు ఒక చరిత్ర సృష్టించే అవకాశమున్నది.

శరవేగంగా పునర్జీవ పనులు..
కాళేశ్వరం నీటిని వరదకాలువ ద్వారా ఎస్సారెస్పీకి ఎత్తిపోసే ఎస్పారెస్పీ ప్రాజెక్టు పునర్జీవ పథకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 1067 కోట్లతో చేపట్టిన ఈ పనులకు 2017 ఆగస్టులో ముఖ్యమంత్రి బాల్కొండ వద్ద శంకుస్థాపన చేశారు. తక్కువ కాలంలోనే పనులను పరుగులు పెడుతున్నాయి. నిజామాబాద్ జిల్లా ముక్తల్, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వరరావుపేట, మల్యాల మండలం రాంపూర్ వద్ద పంప్‌హౌస్ నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ పూర్తయితే ఉమ్మడి జిల్లానే అత్యధికంగా లబ్ధి పొందుతుంది. ప్రతి ఎకరాకూ సాగునీరు అందుతుంది.

వరదకాలువకు తూములు..
ఎస్సారెస్పీ పునర్జీవ పథకం వస్తున్న నేపథ్యంలో వరదకాలువ ఎప్పుడు సజీవంగా ఉంటుంది. కాబట్టి వరదకాలువ పొడవున 53 ప్రాంతాల్లో తూములు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. దీంతో కోరుట్ల, వేములవాడ, రాజన్న సిరిసిల్ల, చొప్పదండి, దర్మపురి, జగిత్యాల, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతి చెరువునూ నింపే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇటు చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలంలో మోతె రిజర్వాయర్‌ను నిర్మిస్తే గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని తెలుసుకొని.. ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏ ఒక్క గ్రామం ముంపు లేకుండా కాకతీయ కెనాల్, వరదకాలువ ద్వారా లింకులు ఏర్పాటుచేసి 26,482 ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. చొప్పదండి, పెగడపల్లి, రామడుగు, గంగాధర, కరీంనగర్ మండలాలకు లబ్ధి చేకూరనున్నది.

మిషన్‌కాకతీయ..
ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,526 చెరువులుండగా, వాటి కింద 2,29,993 ఎకరాల ఆయకట్టు ఉంది. మిషన్ కాకతీయ కింద ఇప్పటికే 927.69 కోట్లు వెచ్చించి 2,636 చెరవులను పునరుద్ధరిస్తున్నారు. పూర్తయిన చెరువులతో గత ఖరీఫ్, రబీ సీజన్లో 1,05,204 ఎకరాలకు సాగునీరు అందించారు. మిగిలిన చెరువులను పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరందించనున్నారు.

భారీ వంతెనలు..
కరీంనగర్-సిరిసిల్ల మధ్య మూలవాగుపై ఇప్పటికే 90 కోట్లతో డబుల్‌రోడ్డు బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మేడిపల్లి-బోర్నపల్లి బ్రిడ్జితోపాటు గోదావరిపై నుంచి పాత కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలుపుతూ ఆరు చోట్ల బ్రిడ్జిలు నిర్మాణమవుతున్నాయి, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 52కు పైగా వంతెనలు నిర్మిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

* రాజన్న సిరిసిల్ల జిల్లా : 159 కోట్లతో 300 పడకల సూపర్‌స్పెషాలిటీ దవాఖాన మంజూరైంది. 36 కోట్లతో డయాలసిస్, వెంటిలేటర్ సౌకర్యం, 30 లక్షలతో బ్లడ్ బ్యాంకు, 42 కోట్లతో నర్సింగ్ కళాశాల మంజూరయ్యాయి.

* పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని ఏరియా దవాఖానలో ఐదు పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయగా, సుల్తానాబాద్‌లో 30 పడకల వైద్యశాల నిర్మాణం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల మాతా శిశు సంరక్షణ భవన నిర్మాణం, పెద్దపల్లి, మంథని, గోదావరిఖని ప్రధాన దవాఖానల్లో రక్త నిల్వకేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన పనులు సాగుతున్నాయి.

* జగిత్యాల జిల్లా : ఒకప్పుడు జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు 20 శాతం సైతం జరిగేవి కావు. ఇప్పుడు పరిస్థితి మారింది. జిల్లాలో 75 శాతానికి పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. అలాగే జగిత్యాల ఏరియా వైద్యశాలలో డయాలసిస్ యూనిట్, ప్లేట్‌లెట్ సెపరేట్ మిషన్ ఏర్పాటయ్యాయి. 22 కోట్ల వ్యయంతో మాతాశిశు సంరక్షణ కేంద్ర నిర్మాణం సాగుతున్నది. ఏరియా దవాఖాన స్థాయిని వంద పడకల స్థాయి నుంచి 250 పడకల స్థాయికి పెంచారు. పిడియాట్రిక్, న్యూరో, ఫిజీషియన్, స్కిన్, గ్యాస్ట్రో, కార్డియాలజీ విభాగాలకు సంబంధించి 55 వైద్యుల పోస్టులు మంజూరు చేశారు. అధునాతన సౌకర్యాలతో టీబీ కేంద్రం నిర్వహిస్తున్నారు. కోరుట్ల కమ్యూనిటీ దవాఖాన స్థాయిని వందపడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ధర్మపురి వైద్యశాల స్థాయిని పెంచడానికి ప్రతిపాదనలు చేశారు. ఒడ్డెలింగాపూర్‌లో కొత్తగా ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.