Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

సాగర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్

-‌పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన
-తెలంగాణ భవన్‌లో బీ ఫాం అందజేత
-ఎన్నికల ప్రచారానికి రూ.28 లక్షల చెక్కు కూడా

నాగార్జునసాగర్‌ శాసనసభ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కుమార్‌ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. సోమవారం తెలంగాణభవన్‌లో భగత్‌కు సీఎం కేసీఆర్‌ పార్టీ బీ-ఫాం అందజేశారు. ఎన్నికల ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్‌ను కూడా భగత్‌కు అందించారు. కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులు రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నాగార్జునసాగర్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, నోముల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. భగత్‌ మంగళవారం నల్లగొం డ జిల్లా నిడమనూరు తాసిల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. అనంతరం మాడ్గులపల్లి మండలం అభంగాపురం నుంచి సాయంత్రం ఐదుగంటలకు ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు.

విద్యార్థి దశ నుంచే చురుకైన పాత్ర
నోముల నర్సింహయ్య నల్లగొండ జిల్లా నకిరేకల్‌ కేంద్రంగా ప్రజా ఉద్యమాలు చేసిన సమయంలో భగత్‌ విద్యార్థి ఉద్యమాల్లో కీలకంగా వ్యవహరించారు. చిన్ననాటి నుంచే తండ్రి ఆలోచనలు, ఆశయాలను అందిపుచ్చుకున్నారు. నర్సింహయ్య 2004లో నకిరేకల్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీచేసిన సమయంలో భగత్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన భగత్‌.. కొద్దికాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగంచేశారు. న్యాయవాద విద్యను అభ్యసించి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

2018లో నోముల గెలుపులో కీలక పాత్ర
2018 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సింహయ్య తరఫున సాగర్‌ నియోజకవర్గంలో భగత్‌కుమార్‌ కీలకంగా పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో తండ్రికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందించారు. సొం తంగా ఎన్నికల ప్రచారం చేపట్టి పార్టీ శ్రేణులతో మమేకమై పనిచేశారు. నర్సింహయ్య ఎమ్మెల్యేగా గెలుపొందాక కూడా ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నారు. నర్సింహయ్య ఎమ్మెల్యేగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటే, భగత్‌ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నియోజకవర్గవ్యాప్తంగా ప్రతి గ్రామంతోనూ, కార్యకర్తలతోనూ పరిచయాలు ఏర్పరుచుకున్నారు. భగత్‌కుమార్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించటంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంతోషం వ్యక్తంచేస్తున్నాయి. సోమవారం పలుచోట్ల పటాకులు కాల్చి, స్వీట్లు పంచారు. నర్సింహ య్య వారుసుడిగా భగత్‌ను గెలిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.

నోముల భగత్‌కుమార్‌ ప్రొఫైల్
‌ పేరు : నోముల భగత్‌కుమార్
‌ జననం : 1984 అక్టోబర్‌ 10, నల్లగొండ
విద్యార్హతలు : బీఈ, ఎంబీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం
తల్లిదండ్రులు : నోముల నర్సింహయ్య, నోముల లక్ష్మి
వివాహం : 2010
సతీమణి : నోముల భవాని
సంతానం : కుమారుడు రానాజయ్‌, కూతురు : రేయాశ్రీ
విద్యాభ్యాసం : 1 నుంచి 5వ తరగతి వరకు సెంట్‌యాన్స్‌ హైస్కూల్‌, నకిరేకల్‌. 5నుంచి 8వరకు ఆక్స్‌ఫర్డ్‌ గ్రామర్‌ స్కూల్‌, హైదరాబాద్‌. 9, 10 తరగతులు సిద్ధార్థ హైస్కూల్‌ గుంటూరు.
కళాశాల విద్య : గౌతమ్‌ జూనియర్‌ కశాశాల, విజయవాడ
ఇంజినీరింగ్‌ : దక్కన్‌ కాలేజీ ఆఫ్‌ హైదరాబాద్
‌ న్యాయ విద్య : మహాత్మాగాంధీ లా కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ
ఉద్యోగ అనుభవం : 2008 నుంచి 10 వరకు జూనియర్‌ ఇంజినీర్‌, సత్యం కంప్యూటర్స్‌, 2010-12 అసిస్టేంట్‌ మేనేజర్‌ విస్టా ఫార్మాస్యూటికల్స్‌ 2014 నుంచి హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్
‌ రాజకీయ అనుభవం : 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో, స్థానిక సంస్థలు, శాసనమండలి ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం.
సామాజిక కార్యక్రమాలు : ఎన్‌ఎల్‌ ఫౌండేషన్‌ను ఏర్పాటుచేసి ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. అనాథ, పేద విద్యార్థులకు చేయూత. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించడం. ఫ్రీ కోచింగ్‌ సెంటర్ల నిర్వహణ

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.