-చురుగ్గా సభ్యత్వాలు -టీఆర్‌ఎస్ మెంబర్‌షిప్ కోసం ఆసక్తి చూపుతున్న అన్ని వర్గాల ప్రజలు -టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష ఆదరణ

గులాబీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతున్నది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యత్వ నమోదు ఇంచార్జీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఇతర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నారు. సామాన్య ప్రజలు సైతం టీఆర్‌ఎస్ సభ్యత్వాలను తీసుకుంటున్నారు. ఎక్కడ చూసిన సభ్య త్వ నమోదు కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతున్నది.

మంగళవారం కరీంనగర్‌లోని 23వ డివిజన్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో మహిళలు, యువకులు పెద్ద ఎత్తున సభ్యత్వాలు తీసుకున్నారు. హుజూరాబాద్‌లో సభ్యత్వ నమోదు ఇంచార్జి బస్వరాజ్ సారయ్య పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మల్యా ల, కొడిమ్యాలలో చొప్పదండి ఇంచార్జి గూడూరి ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో పాడిపరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ నగేశ్ సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. మంచిర్యాల లోని 20వ వార్డులో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, బెల్లంపల్లిలో ఇంచార్జి అరిగెల నాగేశ్వర్‌రావు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పలువురికి సభ్యత్వాలు అందజేశారు. భీమారం మండలం మద్దికల్‌లో ఇంచార్జి మూల విజయారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా చర్లపల్లి డివిజన్‌లోని కుషాయిగూడలో టీఆర్‌ఎస్ నాయకులు శివకుమార్‌గౌడ్, నాగిళ్ల బాల్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, జిల్లా ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి నగర మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు. ఖమ్మంలోని పలు వార్డుల్లో చేపట్టిన సభ్యత్వ నమోదులో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.

పాలమూరులో.. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం లోకిరేవు గ్రామంలో మంగళవారం చేపట్టిన టీఆర్‌ఎస్ సభ్యత్వాల నమోదులో ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ వనజ, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, కల్వకుర్తిలోని బలరాంనగర్, గచ్చుబావి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పాల్గొన్నారు. నాగర్‌కర్నూల్‌లో ఎమ్మె ల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చేతుల మీదుగా స్వాతం త్య్ర సమరయోధుడు పెంటమరాజు సుదర్శన్‌రావు టీఆర్‌ఎస్ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం చందూర్, కారేగాం, లకా్ష్మపూర్, మేడిపల్లి, ఘన్‌పూర్‌లో జెడ్పీ చైర్మన్ విఠల్‌రావు, కామారెడ్డిలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ వీజీగౌడ్ పాల్గొన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, యాదగిరిగుట్ట, మోటకొండూర్, ఆలేరు, ఆత్మకూరు(ఎం), బొమ్మలరామారం, తుర్కపల్లి, రాజాపేట, గుండాల మండలాల్లో సభ్యత్వ నమోదు ఇంచార్జి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాల్గొన్నారు.




