రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాల జోరు కొనసాగుతున్నది.పట్టణాలు, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభ్యత్వం తీసుకుంటున్నారు.ఈ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు,కార్పొరేషన్ల చైర్మన్‌లు, నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్‌కుమార్ సమక్షంలో సుమారు 260 మంది మార్వాడీలు టీఆర్‌ఎస్ సభ్యత్వాన్ని తీసుకున్నారు. వరంగల్‌లోని పెద్దమ్మగడ్డలో టీఆర్‌ఎస్‌లోకి చేరిన వారికి ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ సభ్యత్వాలు అందించారు.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఫంక్షహాల్‌లో పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి సమక్షంలో పలువురు ఆశ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం మాల్‌లో జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, మల్కాజిగిరి నియోజకవర్గం సుభాష్‌నగర్‌లో ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు,నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి రాములు,మాజీ ఎంపీ మంద జగన్నాథం,మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఖమ్మంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు సభ్యత్వాల నమోదు ప్రారంభించారు.హైదరాబాద్ బేగంబజార్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి,రంగారెడ్డి జిల్లా అత్తాపూర్‌లో రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ సభ్యత్వ నమోదును పర్యవేక్షించారు.

కారుకు జైకొట్టిన కోమన్‌పల్లి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం కోమన్‌పల్లి గ్రామస్తులంతా కారుకు జైకొట్టారు. బంగారుతెలంగాణ సాధన కోసం టీఆర్‌ఎస్‌కు మద్దతుగా పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు నిర్ణయించారు. సీఏం కేసీఆర్, ఎంపీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై శుక్రవారం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులందరూ సమావేశమై టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దేగాం ఇట్టెడి లింగారెడ్డి సమక్షంలో సభ్యత్వాలు తీసుకున్నారు. గ్రామంలోని 1,102 ఓటర్లందరూ టీఆర్‌ఎస్ వెంటే ఉంటామనే తీర్మానాన్ని లింగారెడ్డికి అందజేశారు.

గులాబీ గూటికి చేరిన కుకునూర్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుకునూరు గ్రామ ప్రజలందరూ గులాబీగూటికి చేరారు.శుక్రవారం గ్రామస్తులంతా సమావేశమై కులసంఘాల పెద్దలతో చర్చించారు.గ్రామానికి మేలు చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీవైపే ఉంటామని ముక్తకంఠంతో తీర్మానించారు.టీఆర్‌ఎస్ మండల కన్వీనర్ మిట్టాపల్లి మహిపాల్,సర్పంచి బోదపల్లి రాజ్యలక్ష్మి, ఉపసర్పంచి సురేశ్,ఎంపీటీసీ మెరుగు నాగమణి సభ్యత్వ నమోదును ప్రారంభించారు.ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు.గ్రామంలో 1,250 మంది ఓటర్లు ఉండగా మొదటి రోజు 550 మంది సభ్యత్వం తీసుకున్నారు.