-చిల్లరకొట్టు షావుకారుల్లా లాభనష్టాల లెక్కలు
-సామాజిక బాధ్యత మరచి రాష్ర్టాలపై కేంద్రం నెపం
-రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్న బీజేపీ నేతలు
-మీరు రైతు రాబందులు.. మేము రైతు బంధువులం
-బీజేపోళ్లు ముంచెటోళ్లే తప్ప మంచి చేసేటోళ్లు కారు
-ఆ పార్టీ ఆది నుంచీ అన్ని వర్గాలకూ వ్యతిరేకమే
-కిషన్, గోయల్.. మీకు సిగ్గుందా? ఇజ్జత్ ఉన్నదా?
-ఈ బురిడీగాళ్లను నమ్ముకొంటే శంకరగిరిమాన్యాలే
-ఉత్తర భారత రైతులకు క్షమాపణ చెప్పిన్రు
-తెలంగాణ రైతులకూ క్షమాపణ చెప్పక తప్పదు
-కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఫైర్
-దేశంలో ఆకలి కేకలు వినిపిస్తుంటే గోదాముల్లోని ధాన్యం ఎందుకు పంచరు?

దేశంలో ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, భవిష్యత్తులో చూడబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీని రైతు హంతక పార్టీగా అభివర్ణించిన కేసీఆర్.. కేంద్రంలో ఆ పార్టీ పాలనను పారదోలితేనే దేశానికి విముక్తి అన్నారు. దేశానికి ఆహార భద్రత కల్పించి, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజల ఆకలి తీర్చాల్సిన కేంద్రం.. తన సామాజిక బాధ్యత మరచి, చిల్లరకొట్టు షావుకారులా లాభనష్టాలు లెక్కేసుకుంటున్నదని మండిపడ్డారు. రైతులపాలిట బీజేపీ నేతలు రాబందులైతే.. తాము రైతు బంధువులమని చెప్పారు. లక్షల కోట్ల బడ్జెట్, 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కేంద్రం తన బాధ్యతను మరచి.. రాష్ర్టాలపై నెపం వేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.
సోమవారం క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ అంశంపై మూడు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్టు వెల్లడించారు. దేశంలో రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలాల్సిందేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అంతా కలిసి యుద్ధం చేయాలన్నారు. సామాన్యులు, పేద ప్రజలు, రైతులకు రక్షణ రావాలంటే ఈ దుర్మార్గమైన బీజేపీ పాలన పోవాలని చెప్పారు. డీజిల్ ధరలు పెంచి మళ్ల బజార్ల లొల్లి పెడుతున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. వడ్లు కొనేది లేదని చెప్తూనే.. మరోవైపు గొడవ పెట్టడం ఏం పద్ధతి అని ప్రశ్నించారు. ‘నువ్వే.. బాయిల్డ్ రైస్ కిలో కూడా కొనను అంటవ్.. మళ్ల కల్ల్లాల కాడ ఏశం వేసేది కూడా నువ్వే.. పనికిమాలిన చట్టాలు తెచ్చేది నువ్వే, రైతులకు క్షమాపణలు చెప్పేది నువ్వే.. 750 మంది రైతుల సావులకు కారణం నువ్వే.. వాళ్లకు రూపాయి పరిహారం ఇవ్వనిదీ నువ్వే’ అంటూ కేంద్రంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాల ఎన్నికల్లో ఓడిపోతామని వణుకు పుట్టగానే వ్యవసాయ చట్టాలను మోదీ వాపస్ తీసుకున్నారని కేసీఆర్ అన్నారు. చట్టాలు గొప్పవైతే ఎందుకు వాపస్ తీసుకొన్నారు? రైతులకు ఎందుకు క్షమాపణలు చెప్పారు? అని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశ రైతులకు క్షమాపణ చెప్పినోళ్లు.. తెలంగాణ రైతులకు కూడా క్షమాపణ చెప్పుడే గతి అని స్పష్టంచేశారు.
షావుకారు లెక్కల కేంద్రం
దేశంలో ఎక్కువ మంది ప్రజల ప్రధాన ఆహారం అన్నం, లేదా రొట్టె అని, కాబట్టే కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా ఆ రెండు ధాన్యాలను సేకరిస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ర్టాలు తమ బాధ్యతగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, ధాన్యం సేకరించి, కేంద్రానికి అప్పగిస్తాయని వివరించారు. కేంద్రం మాత్రం ఇందులో పెద్ద రాద్ధాంతాన్ని సృష్టించి.. దేశ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నదని విమర్శించారు. కేంద్రానికి లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని, 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే కేంద్రం చిల్లర కొట్టు షావుకారులా మాట్లాడకూడదని హితవు చెప్పారు. దేశ ఆహార భద్రత కేంద్రం సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ఈ బాధ్యత నిర్వహణలో ఏదైనా కారణంతో ధాన్యం నిల్వలు పెరిగితే రూ.50 వేల కోట్లో, లక్ష కోట్లో నష్టం వస్తే భరించేందుకు కూడా కేంద్రం సిద్ధం కావాలన్నారు. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకొంటూ, ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టివేసేందుకు ఘోరమైన ప్రయత్నం జరుగుతున్నదని సీఎం మండిపడ్డారు.
ఆహార ధాన్యాలను సేకరించడం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించడం.. దేశాన్ని ఆహార రంగంలో స్వావలంబనంగా ఉంచడం కోసం ఏదేశమైనా బఫర్ స్టాక్స్ మెయింటెన్ చేయడం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసిందేనని, ఇది అత్యంత సాధారణ విషయమేనని కేసీఆర్ చెప్పారు. కానీ ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమన్నారు. కేంద్రం పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నదని చెప్పారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వాడే గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు ఇందుకు నిదర్శనమని అన్నారు.
మీరు రైతు హంతకులు.. మేం రైతు బంధువులం
కేంద్రంలో బీజీపీ ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదని, చేతగాని ప్రభుత్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘దిక్కుమాలిన చట్టాలను తెచ్చింది. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ 12 నెలలపాటు ఢిల్లీలో ఎండలో.. వానలో ఉద్యమించిన రైతులను ఆందోళన జీవులంటూ అవమానపరిచిండ్రు. కొట్టి చంపిన్రు. కార్లు ఎక్కించిన్రు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకొన్న హంతకపార్టీ, రైతు రాబందు పార్టీ మీది. చివరికి ప్రధానమంత్రే రైతాంగానికి క్షమాపణలు చెప్పిండు. తప్పు చేయకపోతే ఎందుకు క్షమాపణ చెప్పిండ్రు? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ రైతుబంధు పార్టీ అని కేసీఆర్ చెప్పారు. ‘మేం రైతు బంధువులం. నాశనమైన చెరువులను మంచిగ చేసినం. ప్రాజెక్టులు కట్టినం. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినం. దశాబ్దాలుగా పెండింగ్‌ల ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేర్, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, దేవాదులను ఎవరు పూర్తి చేసిన్రు?’ అంటూ బీజేపీ నేతలను నిలదీశారు.
బీజేపీ వాళ్లు ముంచెటోళ్లే
బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘ఈ దేశంల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎవరు? క్రూడాయిల్ ధర అప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? క్రూడాయిల్ ధర తగ్గినంక కూడా అబద్ధాలు చెప్పి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతరు. ఇప్పుడేమో వ్యాట్ తగ్గించాల్నని రాష్ట్రంల ధర్నా చేస్తరు. మీకు సిగ్గుందా. ఇజ్జత్ ఉందా? ప్రజలు గొర్రెలా? మీరు పెంచాలె.. మేమేమో తగ్గియ్యాల్నా? ఇది నీతా? ఇదేం దందా?’ అని ప్రశ్నించారు. వీళ్లు దేశాన్ని ముంచెటోళ్లు తప్ప మంచి చేసేటోళ్లు గాదని తేల్చి చెప్పారు. బీజేపీ వందశాతం రైతు వ్యతిరేక పార్టీ అంటూ మండిపడ్డారు.
750 మంది రైతులను పొట్టన పెట్టుకొన్న సర్కారు
రా రైస్ ఎంత తీసుకొంటరో కేంద్రం చెప్పట్లేదని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. వానకాలం ధాన్యానికే దిక్కులేదు. ఎంత ధాన్యం తీసుకొంటరో చెప్పడంలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 22లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. బీజేపీ నాయకులు కల్లాల కాడికి పోయి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం కేంద్ర వైఖరిని గమనిస్తున్నదని చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి, ఢిల్లీ సరిహద్దుల్లో 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యమ ధాటికి వాటిని వెనక్కు తీసుకున్నదని చెప్పారు.
మేం పని లేక మీ కాడికి వస్తున్నమా?
‘కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దగ్గరికి మేం వెళ్లి వచ్చాం. అధికారుల బృందం, మంత్రుల బృందం వెళ్లింది. మళ్లీ రమ్మంటే ముగ్గురు మంత్రులు, ఎంపీలు, అధికారులు వెళితే ‘మళ్లీ ఇంత మంది వచ్చారా? మీకు ఎక్కడా పనిలేదా?’ అంటూ అవమానకరంగా మాట్లాడారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందం వెళితే ఇదా మాట్లేడేది? కేంద్ర మంత్రి ఇలా మాట్లాడుతారా? సిగ్గున్నదా? అని నిప్పులు చెరిగారు. ‘మీ దగ్గర అంత పంట లేదు, శాటిలైట్ చూపించడంలేదు’ అన్నారన్న కేసీఆర్.. ‘శాటిలైట్ చూపించడం లేదా? నీ మెదడు చూపుత లేదా? ముందేమో 62 లక్షల ఎకరాల్లో వరి ఉన్నదని రాష్ట్రం చూపితే లేదు అంటడు.. కేంద్రం ఇంత తెలివి తక్కువదా? మేం మొత్తం లెక్కలు పట్టుకపోయి వాళ్ల మొఖాన కొట్టినంక 58.66 లక్షల ఎకరాల్లో పంట పండించారని మళ్లీ ఒప్పుకున్నారు’ అని తెలిపారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అని నిలదీశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చాలా చీప్‌గా మాట్లాడుతున్నారన్నారు. వీళ్లు తెలంగాణ రైతులను వంద శాతం ముంచుతారని కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
మోదీ హయాంలో 80 లక్షల కోట్ల అప్పులు
మోదీ ప్రభుత్వం పనితీరు గొప్పగా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో గత రెండేండ్లలో పేదరికం భయంకరంగా పెరిగిందని చెప్పారు. పాతవి రూ.50 లక్షల కోట్లు ఉంటే వీళ్లు రూ.80 లక్షల కోట్లు చేసి మొత్తం రూ.1.30 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని వివరించారు. గత ఏడేండ్లలో మోదీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఏ రంగంలో మేలు చేసిందో, దేశానికి ఒరగబెట్టింది ఏమిటో దమ్ముంటే చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. ‘పేదలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు, రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేశారని నిలదీశారు.

మావోడు బేవకూఫ్.. తప్పు చెప్పిండు..
-ఇవి మీ కేంద్ర మంత్రి చెప్పిన మాటలే
వ్యవసాయశాఖ మంత్రి ఆవేదనతో మీరు వరి పంట వేయకండి అని చెప్తున్నరని కేసీఆర్ పేర్కొన్నారు. కానీ.. ‘ఒక పనికిమాలిన అవగాహన లేనటువంటి వ్యక్తి మీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా వచ్చి.. మీరు వరే వేయండి.. మెడలు వంచి కొనిపిస్తాం. తొడలు వంచి కొనిపిస్తాం అని మాట్లాడిండు. అక్కడ మొదలైంది’ అని చెప్పారు. దానిమీద మేం కేంద్ర మంత్రిని అడిగితే ‘మావోడు బేవకూఫ్.. అవగాహన రాహిత్యంతోని చెప్పిండు’ అని తనతోనే డైరెక్టుగా అన్నారని తెలిపారు. నాతో మాట్లాడకుండా అట్లా ఎలా మాట్లాడావని తాను కోప్పడ్డానని చెప్పారని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి కూడా అవగాహనారాహిత్యంతో మాట్లాడినట్టు కేంద్రమంత్రి ఒప్పుకొన్నారని చెప్పారు. ‘ఇంత ధోకా చేసుకుంట.. మనిషికో మాట చెప్తరా మీరు?’ అని మండిపడ్డారు. బీజేపీ నేతలు మర్యాదగా ఉంటే తాము కూడా మర్యాదగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. రైతులకు ద్రోహం చేసి, ఉల్టా తమపై బద్నాం వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ బురిడీ గాళ్లను నమ్ముకొంటే మనం శంకరగిరి మాన్యాలు పడుతామని రైతులను హెచ్చరించారు.
కేంద్రం బిచ్చగాళ్ల లెక్క చూస్తున్నది
ధాన్యం కొనాల్సిన కేంద్రం చేతులెత్తేసింది. ఇన్నిసార్లు పోయి చెప్తే మమ్మల్ని బిచ్చగాళ్ల లెక్క ట్రీట్
చేస్తున్నది. ఎంపీలను, రాష్ట్ర మంత్రులను పట్టుకొని మీకేం పనిలేదా ఇంతమంది వచ్చిండ్రు అని అంటున్నరు. నిరాశ చెంది ఈ మాటల చెప్తున్నా. ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే కేంద్ర మంత్రి ఏమీ చెప్పడు. ఏదో కేసీఆర్‌ను తిడుతడు. ఇగ మేం దిగినం. ఊకోం. అడుగడుగునా నిలదీస్తం. ఈడ కాదు. ఢిల్లీలో నిలదీస్తం, పార్లమెంట్‌లో నిలదీస్తం. అన్ని అంశాల మీద కొట్లాడుతం. కేంద్రం ధాన్యం కొనకపోతే తీసుకెళ్లి బీజేపీ ఆఫీసుల వద్ద, ఢిల్లీలో ఇండియా గేటు వద్ద పారబోస్తం.
రైతులకు క్షమాపణ చెప్పు
‘కిషన్‌రెడ్డీ.. నీ వ్యాఖ్యలు వాపస్ తీసుకో. తెలంగాణ రైతులను క్షమాపణ అడుగు. బహిరంగ చర్చకు వస్తా అనుకొంటే రా.. కేసీఆర్ షంటుతున్నడు, సిగ్గు పోతున్నదని పార్టీ ఫోరంలో చెప్పు. టార్గెట్ ఇప్పించు. అదీ మగతనం. ఆడొకటి ఈడొకటి గెలువంగనే దుంకులాడుడేనా. నువ్వు ముషీరాబాద్‌లో కేసీఆర్ దెబ్బకు ఓడిపోయినవు కదా! అంత అహంకారం ఎందుకు?
పీయూష్ గోయల్ సిగ్గులేదా?.. మాకు పనిలేదంటావా?
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దగ్గరికి మేం వెళ్లి వచ్చాం, మరొకసారి రమ్మని అంటే ముగ్గురు మంత్రులు, ఎంపీలు, అధికారులు వెళితే మళ్లీ ఇంత మంది వచ్చారా, మీకు ఎక్కడా పనిలేదా అని అవమానిస్తరా?
పనిలేక పోతరా అంత మంది? గోయల్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నరు. ‘హీ మస్ట్ బీ ఆషేమ్డ్, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (ప్రపంచ ఆకలి సూచిక) లో ఇండియా ర్యాంకు 101. మీకు ఏమైనా సిగ్గు, లజ్జ ఉంటే కండ్లు తెరవండి కిషన్‌రెడ్డి, పీయూష్ గోయల్.
విద్యుత్తు బిల్లుకు వ్యతిరేకంగా కొట్లాడుతం
విద్యుత్తు బిల్లుకు మేం వ్యతిరేకంగా ఉన్నం. ఎన్నికలు ఉన్నాయని ఉత్తరప్రదేశ్‌లో ‘దళిత్’ బిల్లు తెచ్చారు. మా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పెట్టి చాలా ఏండ్లు దాటుతున్నది. గిరిజన రిజర్వేషన్ పెంచాలని పంపించినం.. పక్కన పెట్టారు. కనీస మద్దతు ధర చట్టం గురించి కూడా ఈ సెషన్‌లో తేలాలి.
మిమ్ములను వదిలేస్తే దేశానికి మత పిచ్చి తెస్తరు
కేంద్రంలోని బీజేపీ వాళ్లను ఇలాగే వదిలేస్తే దేశానికి మతపిచ్చి లేపి.. విభజన రాజకీయాలు తెస్తరు. దేశాన్ని రావణ కాష్టంలా మారుస్తరు. అనేక మతాల ప్రజలు ఇండియాలో కలిసి బతుకుతున్నరు. బీజేపీ పాలకులు ఆ సామరస్యాన్ని పూర్తిగా చెడగొడుతున్నరు. దేశంలో పేదరికాన్ని పెంచడం, 750 మంది రైతులను పొట్టన పెట్టుకోవడమే వీళ్లు దేశానికి చేసిన పని.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలేదని, భవిష్యత్తులో చూడబోమని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీని రైతు హంతక పార్టీగా అభివర్ణించిన కేసీఆర్.. కేంద్రంలో ఆ పార్టీ పాలనను పారదోలితేనే దేశానికి విముక్తి అన్నారు. దేశానికి ఆహార భద్రత కల్పించి, ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజల ఆకలి తీర్చాల్సిన కేంద్రం.. తన సామాజిక బాధ్యత మరచి, చిల్లరకొట్టు షావుకారులా లాభనష్టాలు లెక్కేసుకుంటున్నదని మండిపడ్డారు. రైతులపాలిట బీజేపీ నేతలు రాబందులైతే.. తాము రైతు బంధువులమని చెప్పారు. లక్షల కోట్ల బడ్జెట్, 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే కేంద్రం తన బాధ్యతను మరచి.. రాష్ర్టాలపై నెపం వేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.
సోమవారం క్యాబినెట్ సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ధాన్యం సేకరణ అంశంపై మూడు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించినట్టు వెల్లడించారు. దేశంలో రైతులు బాగుపడాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలాల్సిందేనని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇందుకోసం అంతా కలిసి యుద్ధం చేయాలన్నారు. సామాన్యులు, పేద ప్రజలు, రైతులకు రక్షణ రావాలంటే ఈ దుర్మార్గమైన బీజేపీ పాలన పోవాలని చెప్పారు. డీజిల్ ధరలు పెంచి మళ్ల బజార్ల లొల్లి పెడుతున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. వడ్లు కొనేది లేదని చెప్తూనే.. మరోవైపు గొడవ పెట్టడం ఏం పద్ధతి అని ప్రశ్నించారు. ‘నువ్వే.. బాయిల్డ్ రైస్ కిలో కూడా కొనను అంటవ్.. మళ్ల కల్ల్లాల కాడ ఏశం వేసేది కూడా నువ్వే.. పనికిమాలిన చట్టాలు తెచ్చేది నువ్వే, రైతులకు క్షమాపణలు చెప్పేది నువ్వే.. 750 మంది రైతుల సావులకు కారణం నువ్వే.. వాళ్లకు రూపాయి పరిహారం ఇవ్వనిదీ నువ్వే’ అంటూ కేంద్రంపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ర్టాల ఎన్నికల్లో ఓడిపోతామని వణుకు పుట్టగానే వ్యవసాయ చట్టాలను మోదీ వాపస్ తీసుకున్నారని కేసీఆర్ అన్నారు. చట్టాలు గొప్పవైతే ఎందుకు వాపస్ తీసుకొన్నారు? రైతులకు ఎందుకు క్షమాపణలు చెప్పారు? అని ప్రశ్నించారు. ఉత్తర భారతదేశ రైతులకు క్షమాపణ చెప్పినోళ్లు.. తెలంగాణ రైతులకు కూడా క్షమాపణ చెప్పుడే గతి అని స్పష్టంచేశారు.
షావుకారు లెక్కల కేంద్రం
దేశంలో ఎక్కువ మంది ప్రజల ప్రధాన ఆహారం అన్నం, లేదా రొట్టె అని, కాబట్టే కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా ఆ రెండు ధాన్యాలను సేకరిస్తుందని కేసీఆర్ తెలిపారు. రాష్ర్టాలు తమ బాధ్యతగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, ధాన్యం సేకరించి, కేంద్రానికి అప్పగిస్తాయని వివరించారు. కేంద్రం మాత్రం ఇందులో పెద్ద రాద్ధాంతాన్ని సృష్టించి.. దేశ రైతాంగాన్ని గందరగోళ పరుస్తున్నదని విమర్శించారు. కేంద్రానికి లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుందని, 140 కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే కేంద్రం చిల్లర కొట్టు షావుకారులా మాట్లాడకూడదని హితవు చెప్పారు. దేశ ఆహార భద్రత కేంద్రం సామాజిక బాధ్యత అని గుర్తుచేశారు. ఈ బాధ్యత నిర్వహణలో ఏదైనా కారణంతో ధాన్యం నిల్వలు పెరిగితే రూ.50 వేల కోట్లో, లక్ష కోట్లో నష్టం వస్తే భరించేందుకు కూడా కేంద్రం సిద్ధం కావాలన్నారు. కానీ ఆ బాధ్యత నుంచి తప్పుకొంటూ, ఆ నెపాన్ని రాష్ర్టాలపై నెట్టివేసేందుకు ఘోరమైన ప్రయత్నం జరుగుతున్నదని సీఎం మండిపడ్డారు.
ఆహార ధాన్యాలను సేకరించడం, సేకరించిన ధాన్యాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందించడం.. దేశాన్ని ఆహార రంగంలో స్వావలంబనంగా ఉంచడం కోసం ఏదేశమైనా బఫర్ స్టాక్స్ మెయింటెన్ చేయడం దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అన్ని కేంద్ర ప్రభుత్వాలు చేసిందేనని, ఇది అత్యంత సాధారణ విషయమేనని కేసీఆర్ చెప్పారు. కానీ ఆ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమన్నారు. కేంద్రం పూర్తి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు ఇలా అన్ని వర్గాలకు వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నదని చెప్పారు. మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వాడే గ్యాస్, పెట్రోల్ ధరల పెంపు ఇందుకు నిదర్శనమని అన్నారు.
మీరు రైతు హంతకులు.. మేం రైతు బంధువులం
కేంద్రంలో బీజీపీ ప్రభుత్వానికి ఒక పాలసీ అంటూ లేదని, చేతగాని ప్రభుత్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘దిక్కుమాలిన చట్టాలను తెచ్చింది. వాటిని వెనక్కి తీసుకోవాలని కోరుతూ 12 నెలలపాటు ఢిల్లీలో ఎండలో.. వానలో ఉద్యమించిన రైతులను ఆందోళన జీవులంటూ అవమానపరిచిండ్రు. కొట్టి చంపిన్రు. కార్లు ఎక్కించిన్రు. 750 మంది రైతులను పొట్టన పెట్టుకొన్న హంతకపార్టీ, రైతు రాబందు పార్టీ మీది. చివరికి ప్రధానమంత్రే రైతాంగానికి క్షమాపణలు చెప్పిండు. తప్పు చేయకపోతే ఎందుకు క్షమాపణ చెప్పిండ్రు? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ రైతుబంధు పార్టీ అని కేసీఆర్ చెప్పారు. ‘మేం రైతు బంధువులం. నాశనమైన చెరువులను మంచిగ చేసినం. ప్రాజెక్టులు కట్టినం. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసినం. దశాబ్దాలుగా పెండింగ్‌ల ఉన్న ఎల్లంపల్లి, మిడ్‌మానేర్, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, దేవాదులను ఎవరు పూర్తి చేసిన్రు?’ అంటూ బీజేపీ నేతలను నిలదీశారు.
బీజేపీ వాళ్లు ముంచెటోళ్లే
బీజేపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ‘ఈ దేశంల పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎవరు? క్రూడాయిల్ ధర అప్పుడు ఎంత? ఇప్పుడు ఎంత? క్రూడాయిల్ ధర తగ్గినంక కూడా అబద్ధాలు చెప్పి, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతరు. ఇప్పుడేమో వ్యాట్ తగ్గించాల్నని రాష్ట్రంల ధర్నా చేస్తరు. మీకు సిగ్గుందా. ఇజ్జత్ ఉందా? ప్రజలు గొర్రెలా? మీరు పెంచాలె.. మేమేమో తగ్గియ్యాల్నా? ఇది నీతా? ఇదేం దందా?’ అని ప్రశ్నించారు. వీళ్లు దేశాన్ని ముంచెటోళ్లు తప్ప మంచి చేసేటోళ్లు గాదని తేల్చి చెప్పారు. బీజేపీ వందశాతం రైతు వ్యతిరేక పార్టీ అంటూ మండిపడ్డారు.
750 మంది రైతులను పొట్టన పెట్టుకొన్న సర్కారు
రా రైస్ ఎంత తీసుకొంటరో కేంద్రం చెప్పట్లేదని సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. వానకాలం ధాన్యానికే దిక్కులేదు. ఎంత ధాన్యం తీసుకొంటరో చెప్పడంలేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 22లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేసిందని తెలిపారు. బీజేపీ నాయకులు కల్లాల కాడికి పోయి డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర రైతాంగం కేంద్ర వైఖరిని గమనిస్తున్నదని చెప్పారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి, ఢిల్లీ సరిహద్దుల్లో 750 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యమ ధాటికి వాటిని వెనక్కు తీసుకున్నదని చెప్పారు.
మేం పని లేక మీ కాడికి వస్తున్నమా?
‘కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దగ్గరికి మేం వెళ్లి వచ్చాం. అధికారుల బృందం, మంత్రుల బృందం వెళ్లింది. మళ్లీ రమ్మంటే ముగ్గురు మంత్రులు, ఎంపీలు, అధికారులు వెళితే ‘మళ్లీ ఇంత మంది వచ్చారా? మీకు ఎక్కడా పనిలేదా?’ అంటూ అవమానకరంగా మాట్లాడారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందం వెళితే ఇదా మాట్లేడేది? కేంద్ర మంత్రి ఇలా మాట్లాడుతారా? సిగ్గున్నదా? అని నిప్పులు చెరిగారు. ‘మీ దగ్గర అంత పంట లేదు, శాటిలైట్ చూపించడంలేదు’ అన్నారన్న కేసీఆర్.. ‘శాటిలైట్ చూపించడం లేదా? నీ మెదడు చూపుత లేదా? ముందేమో 62 లక్షల ఎకరాల్లో వరి ఉన్నదని రాష్ట్రం చూపితే లేదు అంటడు.. కేంద్రం ఇంత తెలివి తక్కువదా? మేం మొత్తం లెక్కలు పట్టుకపోయి వాళ్ల మొఖాన కొట్టినంక 58.66 లక్షల ఎకరాల్లో పంట పండించారని మళ్లీ ఒప్పుకున్నారు’ అని తెలిపారు. రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో వ్యవహరించే పద్ధతి ఇదేనా? అని నిలదీశారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చాలా చీప్‌గా మాట్లాడుతున్నారన్నారు. వీళ్లు తెలంగాణ రైతులను వంద శాతం ముంచుతారని కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
మోదీ హయాంలో 80 లక్షల కోట్ల అప్పులు
మోదీ ప్రభుత్వం పనితీరు గొప్పగా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో గత రెండేండ్లలో పేదరికం భయంకరంగా పెరిగిందని చెప్పారు. పాతవి రూ.50 లక్షల కోట్లు ఉంటే వీళ్లు రూ.80 లక్షల కోట్లు చేసి మొత్తం రూ.1.30 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని వివరించారు. గత ఏడేండ్లలో మోదీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఏ రంగంలో మేలు చేసిందో, దేశానికి ఒరగబెట్టింది ఏమిటో దమ్ముంటే చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు. ‘పేదలు, దళితులు, గిరిజనులు, బీసీలు, మహిళలు, రైతులు, నిరుద్యోగుల కోసం ఏం చేశారని నిలదీశారు.
మావోడు బేవకూఫ్.. తప్పు చెప్పిండు..
ఇవి మీ కేంద్ర మంత్రి చెప్పిన మాటలే