Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

రేవంత్‌.. నోరు అదుపులో పెట్టుకో

-దమ్ముంటే రాహుల్‌ను డ్రగ్‌ టెస్ట్‌కు ఒప్పించు
-కేటీఆర్‌ సింహం లాంటి నాయకుడు
-మాది దళితబంధు.. నీది డ్రగ్స్‌బంధు
-అమరవీరుల స్తూపాన్ని తాకే హక్కులేదు
-మీడియా భేటీలో టీఆర్‌ఎస్‌ నేతల ఫైర్‌

చీకట్లో గోతులు తీసే పందికొక్కులాంటి రేవంత్‌రెడ్డికి సింహం వంటి మంత్రి కేటీఆర్‌ గురించి మాట్లాడే నైతిక హక్కులేదని పీయూసీ చైర్మన్‌ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ ప్రభుత్వం దళితబంధు, రైతుబంధు వంటి విప్లవాత్మక పథకాలు తెస్తే రేవంత్‌ డ్రగ్స్‌బంధువయ్యాడని ఎద్దేవాచేశారు. రేవంత్‌ నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మంగళవారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాహుల్‌గాంధీని డ్రగ్స్‌ పరీక్షలకు తీసుకురావాలన్నారు. దేశంలో ఎంతోమంది మంత్రులు, ఎంపీలు డ్రగ్స్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రాహుల్‌గాంధీపై 2001లోనే ఆరోపణలొచ్చాయని, సుబ్రమణ్యస్వామి వంటి జాతీయ నేతలే కాకుండా అమెరికా నుంచి వెలువడే ‘ది బోస్టన్‌ టైమ్స్‌’ పత్రిక రాహుల్‌ డోపింగ్‌ టెస్ట్‌ లో దొరికాడని కథనం ప్రచురించిందని గుర్తుచేశారు. వ్యక్తిత్వం లేని రేవంత్‌.. క్యాడర్‌లేని పార్టీకి అధ్యక్షుడు కాగానే రెచ్చిపోయి పిచ్చికూతలు కూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్‌ చొరవతో ఇప్పటికే రాష్ర్టానికి 8,671 కంపెనీలు వచ్చాయని తెలిపారు. రేవంత్‌ పిచ్చిచేష్టలతో తెలంగాణ పరువుపోతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌ దగ్గర డ్రగ్స్‌పై ఆధారాలుంటే డీజీపీకి ఇవ్వాలని సూచించారు. మంత్రి కేటీఆర్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించి రాహుల్‌గాంధీని రప్పించాలని, రాహుల్‌ వస్తానంటే తన సొంతఖర్చులతో ప్రత్యేక జెట్‌ ఏర్పాటు చేస్తానని వెల్లడించారు.

అమరుల పేరు పలకడానికి అనర్హుడు: గువ్వల బాలరాజు
ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన దుర్మార్గుడు రేవంత్‌రెడ్డికి తాము ఆనాడే రైఫిల్‌రెడ్డి అని పేరుపెట్టామని, అటువంటి వ్యక్తి అమరుల పేరు పలకడానికే అనర్హుడని ప్రభుత్వ విప్‌ గువ్వల బలరాజు అన్నారు. బ్లాక్‌మెయిల్‌చేస్తూ వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. భజన బ్యాచ్‌తో రెండు సభలు పెట్టుకొని, తానేదో గొప్పోడని అనుకొంటే పొరపాటన్నారు. జాతీయ స్థాయికి ఎదిగిన యువనేత, యువతకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అయిన కేటీఆర్‌పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమన్నారు. రేవంత్‌ ప్రజల్ని తప్పుదారి పట్టించడం మానకపోతే తామూ ప్రాక్టీస్‌ను మార్చుకోవాల్సి వస్తుందన్నారు. రేవంత్‌ పిచ్చిచేష్టలు రాహుల్‌కి చుట్టుకొన్నాయని చెప్పారు.

చీటర్‌ కమిటీకి అధ్యక్షుడు రేవంత్‌: గాదరి కిశోర్‌

రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ చీటర్‌ కమిటీకి అధ్యక్షుడిగా మారాడని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌ ఎద్దేవాచేశారు. రేవంత్‌ వల్ల ఆ పార్టీలో గాడిదల బాగోతం వెలుగులోకి వచ్చిందన్నారు. రాహుల్‌గాంధీని డ్రగ్స్‌ టెస్ట్‌కు ఒప్పించే దమ్ముంటే మాట్లాడాలి.. లేదంటే నోరు మూసుకోవాలని సూచించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఐరన్‌లెగ్‌గా పేరొందిన రేవంత్‌.. టీడీపీని ఖాళీ చేయించినట్టే కాంగ్రెస్‌నూ ఖతం పట్టిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది కేసీఆర్‌ నాయకత్వంలోని టీఆర్‌ఎస్సేనని తేల్చిచెప్పారు. రేవంత్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌కు వచ్చే ఎన్నికల్లో 2018లో వచ్చిన సీట్ల కన్నా తక్కువే వస్తాయని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.