Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పునర్నిర్మాణంలో ముందుండాలి

-టీయూడబ్ల్యూజే వరంగల్ జిల్లా మహాసభలో డిప్యూటీ సీఎం రాజయ్య.. -జర్నలిస్టుల పాత్ర చిరస్మరణీయం: స్పీకర్ సిరికొండ

DR Rajaiah

తెలంగాణ ఉద్యమంలో ముందున్నట్లుగా, పునర్నిర్మాణంలోనూ జర్నలిస్టులు అగ్రభాగంలో నిలువాలని డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. టీయూడబ్ల్యూజే వరంగల్ జిల్లా ప్రథమ మహాసభ ఆదివారం హన్మకొండలోని నందన గార్డెన్స్‌లో సంఘం జిల్లా కో కన్వీనర్ కూన మహేందర్ అధ్యక్షతన నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా డిప్యూటీ సీఎం రాజయ్య, స్పీకర్ మధుసూదనచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాధించింది కూడా జర్నలిస్టులేనని పేర్కొన్నారు.

సామాజిక రుగ్మతలను రూపుమాపడానికి దేశచరిత్రలోనే మీడియా పాత్ర కీలకమన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, త్వరలోనే హెల్త్ కార్డులు, ఇండ్ల స్థలాలు, పెన్షన్లు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసేందుకు కృషిచేస్తున్నామని చెప్పారు. స్పీకర్ మధుసూదనచారి మాట్లాడుతూ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు పోషించిన పాత్ర చరిత్రలోనే చిరస్మరణీయమన్నారు. సమైక్య పాలనలో జర్నలిస్టులు యాజమాన్యాలతోపాటు పాలకవర్గాలతో వృత్తిపరంగా అనేకమైన ఇబ్బందులెదుర్కొన్నారని తెలిపారు.

Public

తెలంగాణ కోసం ముందుండి పోరాడిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం న్యాయం చేస్తుందన్నారు. ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో టీజేఎఫ్ రాజకీయ పార్టీలతోపాటు ప్రజా సంఘాలు, ఉద్యమనాయకులనందరినీ సంఘటితం చేసి స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ సమయంలో సమైక్యవాదులకు వంతపాడిన కొంత మంది జర్నలిస్టు నాయకులకు ఇక్కడి ప్రజాప్రతినిధులను ప్రశ్నించే నైతికత లేదన్నారు. గాడి తప్పిన మీడియా రంగాన్ని టీయూడబ్ల్యుజే నాయకత్వం సరిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎందుకు అవసరమో జర్నలిస్టులు ప్రపంచానికి ఎలుగెత్తి చాటారన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం సానుకూలం: అల్లం నారాయణ జర్నలిస్టుల సంక్షేమం పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పేర్కొన్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి పుట్టిన టీయూడబ్ల్యుజే జర్నలిస్టుల హక్కుల సాధనకు పనిచేస్తుందన్నారు. జర్నలిస్టులకు సహకరించే ప్రభుత్వం ఉందని, సీఎంతో మాట్లాడి జర్నలిస్టుల డిమాండ్లను సాధించుకుంటామని చెప్పారు.

ఎంతోకాలంగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్న ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు ఈ ప్రభుత్వం అందజేస్తుందన్న భరోసా తనకుందన్నారు. తన జీవిత లక్ష్యమైన తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, తనకు మరెలాంటి వ్యక్తిగత కోరికలు లేవని, జర్నలిస్టుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని తెలిపారు. మహాసభ సందర్భంగా 26 డిమాండ్లతో రూపొందించిన వరంగల్ డిక్లరేషన్ తీర్మానాలను సభ్యుల హర్షధ్వానాల మధ్య ఆమోదించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆరూరి రమేశ్, శంకర్‌నాయక్, టీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్, ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, బీఆర్ లెనిన్, సంయుక్త కార్యదర్శి రమణ, నాయకులు అజారే రమేశ్, శైలేశ్‌రెడ్డి, దొంతు రమేశ్, కొండల్‌రావు, సుధాకర్, నూర శ్రీనివాస్, వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గుంటిపల్లి వెంకట్ జిల్లా జర్నలిస్టులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.