నష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని లాభాల బాటలో నడిపించడానికి అధికారులు, సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రశంసించారు. రాష్ట్రసాధన ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారని, ఆ ఉత్సాహంతో సంస్థను కాపాడుకునేందుకు కార్మికులు శ్రమిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి బస్‌సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా 1300 గ్రామాలకు ఇప్పటికీ బస్ సౌకర్యం లేదని గుర్తించామని, బస్‌సౌకర్యం కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.

– ప్రజలకు మెరుగైన సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యం -లాభాల బాటలో టీఎస్ ఆర్టీసీ:మంత్రి మహేందర్‌రెడ్డి – వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దే విజయమని ధీమా శుక్రవారం హన్మకొండ బస్‌స్టేషన్‌లో మూడు అదనపు ప్లాట్‌ఫాంలకు శుక్రవారం మంత్రి శంకుస్థాపన చేశారు. తర్వాత బస్‌స్టేషన్ ఆవరణలో వరంగల్-1 డిపోలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాటాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని స్వరాష్ట్రంలో లాభాలబాటలో నడిపించడానికి సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు కేటాయించారని చెప్పారు. ఆ నిధులతో 500 కొత్తబస్సులను కొనుగోలుచేసి ప్రజలకు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఏడాది క్రితం రాష్ట్రంలో కేవలం ఆరు డిపోలు లాభాల బాటలో ఉండగా, ఇప్పటివరకు 21 డిపోలు లాభాలు బాటలో నడుస్తున్నాయని, మరో 41 లాభాలకు చేరువలో ఉన్నాయని, నష్టాల్లో ఉన్న 38 డిపోలను లాభాల బాటలో నడిపించడానికి సిబ్బంది కష్టపడి పనిచేయాలని సూచించారు.
తర్వాత ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, కార్యక్రమాలకు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను ఓర్వలేక ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా, గ్రేటర్ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నరేందర్, ఆర్టీసీ జేడీ రమణారావు, విజిలెన్స్ డైరెక్టర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.