Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రజాకూటమికాదు.. దగాకూటమి

-మ్యానిఫెస్టోల విడుదలకే కాంగ్రెస్, టీడీపీ పరిమితం
-మ్యానిఫెస్టోలు అమలుచేయనందుకు క్షమాపణ చెప్పాలి
-కాంగ్రెస్, టీడీపీలకు మంత్రి హరీశ్‌రావు డిమాండ్
-మ్యానిఫెస్టోలో పెట్టనివీ టీఆర్‌ఎస్ అమలుచేసిందని వెల్లడి
-ప్రాజెక్టుల రీడిజైన్‌పై రాహుల్‌కు అవగాహన లేదు
-కాళేశ్వరానికి వ్యతిరేకంగా లేఖరాసిన బాబు క్షమాపణ చెప్పాలి
-కుడితిలో పడ్డ ఎలుకలా కోదండరాం పరిస్థితి
-కేసీఆర్ ఇంజ్యూర్డ్ బ్యాట్స్‌మన్ కాదు ఇరగదీసే బ్యాట్స్‌మన్
-మ్యానిఫెస్టోలో సాగరహారం ఫొటోపై ఉత్తమ్ క్షమాపణ చెప్పాలి
-విశ్వసనీయతకు మారుపేరు కేసీఆర్.. అప్పుల్లో బాబుది డాక్టరేట్
-మీడియా సమావేశంలో మంత్రి టీ హరీశ్‌రావు

కాంగ్రెస్, టీడీపీలు మ్యానిఫెస్టోల విడుదలకే పరిమితమని, వాటిని అమలుచేయవని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. మ్యానిఫెస్టోలను ఏనాడూ పూర్తిగా అమలుచేయనందుకు కాంగ్రెస్, టీడీపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆ రెండుపార్టీలు మళ్లీ ఉమ్మడి మ్యానిఫెస్టోతో ప్రజలను మభ్యపెట్టటానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తాము మ్యానిఫెస్టోలో చెప్పినవేకాకుండా, మిషన్‌భగీరథ, మిషన్‌కాకతీయ, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా, రైతుబంధు తదితర అనేక పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. గురువారం తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీలు సలీం, ఎమ్మెస్ ప్రభాకర్‌లతో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడుతూ మ్యానిఫెస్టోల్లో చెప్పిన అంశాలను ఒక్కటికూడా అమలుచేయనివారి హామీలను ప్రజలు ఇప్పుడు ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అది ప్రజాకూటమికాదని, దగా కూటమని అభివర్ణించారు. వీరి వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. విప్లవకారుడినని, తన వెన్నుపూసలో ఇప్పటికీ బుల్లెట్ ఉందని చెప్పుకొనే గద్దర్.. చంద్రబాబు కడుపులో తలకాయ పెట్టడాన్ని తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతున్నదన్నారు. గద్దర్ తన స్థాయిని తానే తగ్గించుకున్నారని చెప్పారు.

కేసీఆర్ ఇంజ్యూర్డ్ బ్యాట్స్‌మన్ కాదని ఇరగదీసే బ్యాట్స్‌మన్ అని డిసెంబర్ 11న కోదండరాంకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాలుగేండ్లపాలనపై ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి జూన్ 1న చార్జిషీట్ విడుదలచేసి, వారంపాటు నిరసనలకు పిలుపునిచ్చిన విషయాన్ని హరీశ్ గుర్తుచేశారు. ప్రజలను వంచించిన నాయకుడిగా బాబును అభివర్ణించారని, ఇప్పుడు అదే పార్టీతో పొత్తు పెట్టుకోవడంపై రాహుల్ సమాధానం చెప్పాలన్నారు.

ఏపీలో చెల్లని రూపాయిలాంటి చంద్రబాబు తెలంగాణలో ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. ఇది పోరాటాల గడ్డ. ప్రజలు గమనిస్తున్నారు అన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. ఏపీలో రైతురుణాలు రూ.87వేల కోట్లుంటే.. రూ.18వేల కోట్లే మాఫీచేశారని విమర్శించారు. నాలుగున్నరేండ్లు వెళ్లదీసి ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తున్నారన్నారు. చంద్రబాబు గత ఎన్నికల్లో 600హామీలు ఇచ్చారని, వాటిలో 10% కూడా అమలుచేయలేదని విమర్శించారు. విశ్వసనీయత, విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విశ్వసనీయతకు మారు పేరు కేసీఆర్ అని చెప్పారు.

రీడిజైనింగ్‌పై అవగాహనలేని రాహుల్
ప్రాజెక్టుల రీడిజైన్‌పై అవగాహనలేకుండా రాహుల్‌గాంధీ మాట్లాడుతున్నారని హరీశ్ విమర్శించారు. ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టు వ్యయం పేరు మార్చడంతో మారలేదన్నారు. గతంలో 16 లక్షల ఎకరాలకు నీళ్లు అందించే ప్రతిపాదన ఉంటే ఆ తరువాత 37 లక్షలకు మారిందన్నారు. ఆయకట్టు పెరిగినప్పుడు, 11 ఏండ్ల తర్వాత వ్యయం పెరుగదా? సిమెంట్, స్టీల్, డిజిల్ ధరలు పెరుగలేదా? అని నిలదీశారు. గతంలో 11 టీఎంసీల సామర్ధ్యంతో రిజర్వాయర్లుంటే.. అవి 141 టీఎంసీలకు పెరిగాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉండగా 2007 మే 16న 124 జీవో ద్వారా రూ.17,875 కోట్ల అంచనావ్యయంతో జీవో ఇస్తే 2008లో రూ.38,500 కోట్లకు, 2010లో రూ.40వేలకోట్లకు పెంచారన్న హరీశ్.. ఆయకట్టు పెరుగకుండా అంచనా వ్యయం ఎలా పెరిగిందో రాహుల్ చెప్పాలన్నారు. ప్రతిపాదిత ప్రాంతంలో నీళ్లు లేవన్న సీడబ్ల్యుసీ నివేదికతోనే తాము ఆ ప్రాజెక్టును రీడిజైన్ చేశామని చెప్పారు.

సాగరహారం ఫొటోపై క్షమాపణ చెప్పాలి కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో సాగరహారం ఫొటో వాడటంపై ఉద్యమకారులకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. ఆనాడు సాగరహారానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, లాఠీదెబ్బలు తిని, ముళ్ల కంచెలు తొలిగించుకొని ప్రజలు ఆ కార్యక్రమానికి వచ్చారని గుర్తుచేశారు. ఆనాడు ఇదే కోదండరాం కాంగ్రెస్ నాయకులను పదవులకు రాజీనామా చేయాలని కోరితే.. మమ్మల్ని రాజీనామా చేయమనటానికి నువ్వెవరు? అంటూ ఆయనను అవమానించారని, ఇప్పుడు కూడా కోదండరాంను అవమానిస్తున్నారని అన్నారు. కోదండరాం పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగ తయారైందని ఎద్దేవాచేశారు.

కాంగ్రెస్ 2004 మ్యానిఫెస్టోలో చెప్పి అమలుచేయనివి
ప్రైవేటురంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు చట్టం చేయలేదు. ఐదేండ్లలో రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. చేయలేదు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లో 50 వేల ఎస్సీ, ఎస్టీ, 70 వేల బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల హామీ నెరవేర్చలేదు. తాత్కాలిక ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయలేదు. పరిశ్రమల్లో 50% ఉద్యోగాల్లో స్థానికులకు అవకాశం కల్పిస్తామన్నా.. జీవో తేలేదు. వడ్డెరలు, రజకులను ఎస్సీల్లో చేర్చలేదు. ఇప్పుడు మళ్లీ అదే హామీ ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని.. పట్టించుకోలేదు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్ రూ.225కు పెంచుతామని.. రూ.200తో సరిపెట్టారు. ఒక్క తండానుకూడా పంచాయతీ చేయలేదు. హైదరాబాద్‌లో భూగర్భ రైలుమార్గం ఊసేలేదు. హైదరాబాద్ చుట్టూ శాటిలైట్‌టౌన్లు నిర్మిస్తామని.. ఒక్కటి కూడా ఏర్పాటుచేయలేదు. పదేండ్లలో ఏనాడూ సకాలంలో విత్తనాలు, పురుగుమందులు అందించలేదు. జనతా చీరెలు, దోవతుల పథకం పునరుద్ధరిస్తామని.. చేయలేదు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించలేదు.

గ్రామీణ యువతకోసం వ్యవసాయేతరరంగాల్లో ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రత్యేకబోర్డు ఏర్పాటుచేసి రుణాలిస్తామని.. ఇవ్వలేదు. పట్టణ పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. మైనార్టీ మహిళా సంక్షేమసంస్థ ఏర్పాటుకాలేదు. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు పారిశ్రామిక పునరావాసబోర్డు ఏర్పాటుచేస్తామని చెప్పి ఒక్క పరిశ్రమను కూడా పునరుద్ధరించలేదు. చిన్న తరహా, కుటీర పరిశ్రమలకు రుణసౌకర్యం కల్పించలేదు. పేదలందరికీ గృహ నిర్మాణం చేస్తామని చేయలేదు. ఏటా లక్షహెక్టార్లకు అదనంగా సాగునీరు ఇస్తామని.. లక్ష ఎకరాలకుకూడా ఇవ్వలేదు. నిజామాబాద్ లెండి, ఆదిలాబాద్ పెన్‌గంగ ప్రాజెక్టులు పూర్తిచేయలేదు. ఎస్సారెస్పీ నిల్వ సామర్థ్యం పెంచలేదు. ఆదిలాబాద్ జిల్లాలో మందాకిని కాల్వ నిర్మించలేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాల సత్వరమే పూర్తిచేస్తామని చెప్పి 2014 వరకు పూర్తిచేయలేదు. గోదావరి జలాల సంపూర్ణ వినియోగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని చెప్పినా.. గోదావరిపై ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదు. ఎల్లంపల్లి, ఇచ్చంపల్లి, దేవాదుల, దుమ్ముగూడెం, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు పదేండ్లు గడిచినా పూర్తికాలేదు. అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై ఏ ఒక్క రాష్ట్రంతోనూ ఒప్పందాలు చేసుకోలేదు. పదేండ్లలో రూ.1,060 కోట్లతో ఐదులక్షల హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తామని ఇవ్వలేదు.

బాబు.. ఆ లేఖపై క్షమాపణ చెప్పు
సముద్రంలోకి పోయే వందల టీఎంసీల గోదావరి నీటిని ఇద్దరం వాడుకుందామంటున్న చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా లేఖలు ఎందుకురాశారని హరీశ్ ప్రశ్నించారు. ఆ లేఖ రాసినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. సీతారామ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఎందుకు లేఖ రాశారన్నారు. చంద్రబాబుకు ఆత్మ అనేది ఉన్నదా? అని నిలదీశారు. ఖమ్మం సభలో చారిత్రాత్మక సందర్భమని బాబు చెప్తున్నారని, వాస్తవానికి అది సిగ్గుపడే సందర్భమని విమర్శించారు. నిన్నటివరకు బీజేపీ ప్రభుత్వంతో ఉన్న చంద్రబాబు ఇప్పుడు తానే పెద్ద సెక్యులరిస్టునని మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. విభజన చట్టంలోని హామీలపై కేసీఆర్ పోరాటం చేయలేదని బాబు చెప్పడాన్ని హరీశ్ ఖండించారు. హైకోర్టు విభజనపై మూడుసార్లు ప్రధానిని కలిశారని చెప్పారు. వాస్తవానికి హైకోర్టు విభజనను అడ్డుకున్నదే చంద్రబాబు అని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో బాబు దొరికి పారిపోయారని చెప్పారు. తుమ్మిళ్ల 15.9 టీఎంసీల నీటిని రాకుండా లేఖరాశారని, విద్యుత్ ప్రాజెక్టుల పీపీఏలు రద్దుచేశారని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవంకోసమే కేసీఆర్ ఆనాడు పార్టీపెట్టి, ప్రజలకోసం బయలుదేరారని చెప్పారు. చంద్రబాబుకు వెన్నుపోటుదారుడనే బిరుదు ఉందన్న విషయాన్ని గుర్తుచేశారు. అప్పుల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న హరీశ్.. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు జీతగాడు అనే పుస్తకాన్ని కమ్యునిస్టులు ముద్రించిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుల్లో బాబు డాక్టరేట్ పొందారని ఎద్దేవాచేశారు.

దీక్షాదివస్ చారిత్రాత్మక దినం
దీక్షాదివస్ చారిత్రాత్మకమని, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ రోజు కేసీఆర్ ఆమరణదీక్ష, జైత్రయాత్ర ఉద్యమాన్ని శిఖరాగ్రానికి తీసుకెళ్లాయని చెప్పారు. అది తెలంగాణ ప్రజలు గర్వంగా గుర్తుకు పెట్టుకొనే, చరిత్రపుటల్లో నిలిచిపోయే దీక్ష అన్నారు. ఢిల్లీ పునాదులను కదిలించిన దీక్ష.. తెలంగాణ భవిష్యత్‌తరాలకు మార్గదర్శమైన దీక్ష.. అహింసాయుత పద్ధతుల్లో, గాంధీ మార్గంలో స్వాతం త్య్రం సాధించి పెట్టిన దీక్ష. ఆ దీక్షతోనే తెలంగాణ సాకారమైంది అని హరీశ్‌రావు అభివర్ణించారు.

కాంగ్రెస్ 2009 మ్యానిఫెస్టోలో అమలుచేయనివి
2009 జూన్ ఒకటి నుంచి 24గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పి చేయలేదు.. విద్యుత్ కోతలు ఆగలేదు. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని 3-4గంటలు కూడా ఇవ్వలేదు. ప్రతీ వ్యక్తికి నెలకు ఆరుకిలోల రేషన్‌బియ్యం ఇస్తామని.. నాలుగు కిలోలే ఇచ్చారు. ప్రతీ ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని లక్షల దరఖాస్తులు పెండింగులో పెట్టారు. వంటగ్యాస్ ధర సగానికి తగ్గిస్తామని చెప్పి 83% పెంచారు. కొత్తగా 24.5లక్షల ఎకరాల ఆయకట్టును సృష్టించడానికి ప్రాజెక్టులు నిర్మిస్తామని 2004, 2009 మ్యానిఫెస్టోల్లో చెప్పి ఒక్కటీ పూర్తిచేయలేదు. నాలుగేండ్లలో గుడిసెలులేని రాష్ట్రంగా మారుస్తామని చెప్పి ఇండ్లు నిర్మించలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచితవిద్య అందిస్తామని చెప్పి.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. తండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామని చెప్పి చేయలేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.