Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ప్రజా ద్రోహి రేవంత్‌రెడ్డి

-తాలిబన్ల తరహా రాజకీయం
-కాంగ్రెస్‌ను ముంచడమే లక్ష్యం
-సీఎంపై నోరు పారేసుకొంటే తీవ్ర పరిణామాలు తప్పవు
-టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధుల హెచ్చరిక

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్య ద్రోహి అని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కనుసన్నల్లో మెలిగే రేవంత్‌.. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో ముంచేంతవరకు నిద్రపోడని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితబంధు పథకాన్ని ప్రవేశపెడితే తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. నిరంతరం ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతున్న కేసీఆర్‌పై అవాకులు చవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి హుందాతనాన్ని మరిచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు అన్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్‌ పార్టీ.. దళితులు, అణగారిన వర్గాలను ఓటుబ్యాంకుగానే చూసింది తప్ప వారిని ఉద్ధరించడానికి చేసిందేమీ లేదని విమర్శించారు. వారి వెనుకబాటుతనానికి కాంగ్రెస్‌ కారణం కాదా? అని ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లాలో పర్యటించిన రేవంత్‌.. తెలంగాణ కోసం దేశరాజధానిలో పార్లమెంట్‌ సాక్షిగా ఆత్మహత్య చేసుకొన్న యాదవరెడ్డి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చడానికి చంద్రబాబుతో చేతులు కలిపిన ప్రజాస్వామ్య హంతకుడు రేవంత్‌ అని.. ఆయనకు దమ్ముంటే హుజూరాబాద్‌లో డిపాజిట్‌ తెచ్చుకోవాలని సవాలు విసిరారు. రేవంత్‌ నాయకత్వంలో పనిచేయలేమని చాలామంది సీనియర్లు బాహాటంగానే చెప్తున్నారని, కాంగ్రెస్‌ శ్రేణులు ఆలోచించుకోవాలని హితవు చెప్పారు.

మూడు కాళ్లున్నాయా?: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
వామనావతారం ఎత్తడానికి రేవంత్‌రెడ్డికి ఏవైనా మూడు కాళ్లున్నాయా? అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి దొంగల ముఠాకు సర్దార్‌లా మారిపోయాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డిలా పిచ్చిప్రేలాపనలు చేయాలంటే తమకు చిటికెలో పని అని, కానీ తమకు సీఎం కేసీఆర్‌ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని పదే పదే చెప్తున్నారు కాబట్టే మౌనంగా ఉంటున్నామని అన్నారు. అది తమ నైతిక బాధ్యతే తప్ప అసమర్థత కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. రేవంత్‌రెడ్డి పిచ్చిపనులకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలే రాళ్లతో కొట్టి బయటకు పంపుతారని అన్నారు. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలు నిరూపించాలని లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఫార్మాసిటీ కోసం ప్రభుత్వం వ్యవసాయయోగ్యం కాని భూములనే సేకరించిందని, అందులో 90% మంది లబ్ధిదారులకు పరిహారం ఇప్పటికే అందిందని చెప్పారు. తాను అవినీతి పాల్పడినట్టు రుజువు చేస్తే తాను అన్నిటికీ సిద్ధమని, మధుయాష్కీ సిద్ధమా? అని ప్రశ్నించారు. తనపై మూడుసార్లు పోటీచేసి ఓడిపోయిన వ్యక్తి ఏదో మాట్లాడితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.