Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పేదరికం పై పోరు

– ముందుతరాలకు అద్భుత తెలంగాణ – సమస్యలను చూసి ఆందోళన వద్దు.. ప్రత్యేక ప్రతిపత్తి మనకూ వర్తిస్తుంది – పదేళ్లలో 50 లక్షల ఉద్యోగ అవకాశాలు.. – తెలంగాణ ఉద్యమ కెరటం టీజేఎఫ్.. – జర్నలిస్టుల సేవలను తెలంగాణ మర్చిపోదు – తెలంగాణ జర్నలిస్టుల జాతర సభలో కేసీఆర్ – దేశం గర్వించేలా టీయూడబ్ల్యూజేకు భవనం – ప్రతి పాత్రికేయుడికీ ఉచిత బస్‌పాస్ – జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తాం – టీ జర్నలిస్టులపైన కేసులన్నింటినీ ఎత్తివేస్తాం – జర్నలిస్టు జాతరలో టీఆర్‌ఎస్ అధినేత హామీలు

TUWJ-Journalist-Meeting-1 TUWJ-Meeting-02

ఇంత చరిత్ర కలిగిన తెలంగాణ ఉద్యమాన్ని నిందలతో, విమర్శలతో, అసత్య ప్రచారాలతో గందరగోళపరిచారని ఆయన విమర్శించారు. ఇప్పటి వరకూ తెలంగాణ జర్నలిస్టుల ఫోరంగా పని చేసిన పాత్రికేయ సంస్థ ఆదివారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజే)గా అవతరించింది. ఇందుకోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో టీజేఎఫ్ ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టుల జాతర, మహాసభ జరిగాయి. వేల సంఖ్యలో వచ్చిన జర్నలిస్టులు మన రాష్ట్రంలో మన యూనియన్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. అస్థిత్వ ఆకాంక్ష హృదయాలను చీల్చుకొని వచ్చే వటవృక్షం వంటిదని, అందుకే అస్థిత్వానికి అంత బలం, పునాది ఉంటాయని అభిప్రాయపడ్డారు. అలలు అలలుగా కదిలివచ్చిన వేలాది తెలంగాణ జర్నలిస్టులు టీయూడబ్ల్యూజే సముద్రమంత సంస్థ అని రుజువు చేశారని ప్రశంసించారు. టీయూడబ్ల్యూజే తెలంగాణ ప్రజల కరదీపిక కావాలని కేసీఆర్ అభిలషించారు.

అమ్మ ఎవ్వరికైనా గర్వకారణమేనని, తెలంగాణ అమ్మ మనకు గర్వకారణమని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి, చిరునవ్వుల తెలంగాణ నిర్మాణానికి జర్నలిస్టులే సారథ్యం వహించాలని సూచించారు. ఏ భాషకూడా ఎవ్వరి సొత్తూ కాదని ఆయన హెచ్చరించారు. తెలంగాణనుంచి ప్రధానిగా ఎదిగిన పీవీ నరసింహారావు 14 భాషలలో పాండిత్యం సంపాదించారని గుర్తు చేశారు. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, చరిత్ర, నాగరికతల ఔన్నత్యాలను గుండెలు విప్పి ప్రకటించేవిధంగా గొప్ప పునర్నిర్మాణం జరుగుతుందని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నన్నయ్య ఆదికవి కానేకాదని, నన్నయ్య అనువాదకవి అని ఆయన చెప్పారు. నిజానికి పాల్కురికి సోమనాథుడే ఆదికవి అని ఆయన మరోసారి ఎలుగెత్తి చాటారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేవరకు కూడా సీమాంధ్ర దురహంకార పెత్తందారీ రాజకీయ నాయకులు గజకర్ణగోకర్ణటక్కుటమారి విద్యలన్నింటినీ ప్రదర్శించారని కేసీఆర్ విమర్శించారు. ఇకనుంచి ఈ విద్యలు చెల్లవని హెచ్చరించారు.

పోలవరం ప్రాజెక్ట్ పర్యావరణ రీత్యా నిర్మించడం సబబుకాదని అన్నారు. పోలవరం నిర్మించాలని ప్రయత్నిస్తున్న ప్రదేశంలో భూకంపాలు వస్తాయని భూగర్భ శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారని, రేపటి ఆంధ్రప్రదేశ్ పాలకులు ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒకవేళ అనుకోకూడని సంఘటనలు జరిగితే మూడు జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని కేసీఆర్ చెప్పారు. అవశేష ఆంధ్రప్రదేశ్‌కు వర్తించే ప్రత్యేక ప్రతిపత్తి తెలంగాణ రాష్ర్టానికి కూడా వర్తిస్తుందని, కేంద్రప్రభుత్వ గెజిట్‌లో ఈ విషయాలు ఉన్నాయని వివరించారు. మేధావులు బిల్లును విశ్లేషించాలని, అర్థం చేసుకోవాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాలన్నీ వెనుకబడిన జిల్లాలనే విషయాలను కేంద్ర ప్రణాళిక సంఘం గుర్తించిందని ఆయన వివరించారు. తెలంగాణ రాష్ట్రం గొప్ప పారిశ్రామిక కేంద్రంగా మారనున్నదని అన్నారు.

ఐటీఐఆర్ సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని, వచ్చే పదేళ్లలో 50లక్షల ఉద్యోగాలు తెలంగాణలో చదువుకున్న యువకులకు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోయర్ సీలేరు విద్యుత్తు ప్రాజెక్ట్ తెలంగాణకే ఉంటుందని, ఆందోళన చెందవద్దని అన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి తీరుతామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పాత్రికేయుల పాత్ర మరువలేనిది: పద్నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్ సహా తెలంగాణ ఉద్యమ సంస్థలతో కలిసి ప్రయాణించి, తెలంగాణ ప్రజలను జాగృతం చేయడంలో వీరోచిత భూమిక పోషించిన టీజేఎఫ్ మన రాష్ట్రంలో మన యూనియన్ అనే నినాదంతో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్‌గా ఆవిర్భవించడం సంతోషదాయకమని కేసీఆర్ అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తెలంగాణ పునర్నిర్మాణానికి సంకేతాలని అభివర్ణించారు. సమస్త తెలంగాణ ప్రజలు ఒక్కతాటిపైన నిలిచి కేంద్రాన్ని ప్రశ్నించిన సందర్భంలో ఉద్యమ కెరటమై విజృభించిన సంస్థ తెలంగాణ జర్నలిస్టుల ఫోరమని అభినందించారు.

సంపూర్ణ తెలంగాణ సాధన ఉద్యమం ఇంకా పూర్తికాలేదన్న కేసీఆర్.. బంగారు తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యుజే) కీలక భూమిక పోషించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జర్నలిస్టుల సేవలను తెలంగాణ సమాజం తప్పకుండా గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. ఉద్యమంలో ప్రజలతో కలిసి పోరాడిన తెలంగాణ జర్నలిస్టులందరూ గౌరవంగా బతికేలా, జర్నలిస్టుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అవసరమైన సదుపాయాలన్నింటినీ రేపటి తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా సమకూరుస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. మీడియాలో ఏ విభాగంలో పని చేసినా.. వారంతా జర్నలిస్టులేనని అన్నారు. ఒకవేళ రేపటి తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు సదుపాయాలు కల్పించని పక్షంలో జర్నలిస్టులతో కలిసి తాను మరోసారి ఉద్యమించేందుకు సిద్ధంగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

భారతదేశం గర్వించే విధంగా టీయూడబ్ల్యూజే భవనాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ భవనంలో వర్కింగ్ జర్నలిస్టులకు కావాల్సిన పరిశోధనాకేంద్రం, సమావేశమందిరం, తెలంగాణ ప్రెస్ అకాడమీ, జర్నలిస్టుల శిక్షణా కేంద్రం తదితర వనరులన్నింటినీ ఏర్పరిచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో పత్రికల్లో పనిచేసే ప్రతి పాత్రికేయుడికీ రాష్ట్రమంతటా పర్యటించే విధంగా ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తామని, జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ర్టానికి ఇవేవీభారం కాబోవని స్పష్టం చేశారు. మండల, జిల్లా, రాష్ట్ర కేంద్రాలలో పనిచేసే జర్నలిస్టులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని, ఇది తమ బాధ్యతని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్టులపైన బనాయించిన కేసులన్నింటినీ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. మెదడులో విషం పూసుకొని రాసే రాతలను కడిగిపారేస్తూ తెలంగాణ జర్నలిస్టులు గొప్ప ఉద్యమాలకు నాయకత్వం వహించారని చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.