Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పట్టణాల ప్రగతికి చేయూతనివ్వండి

-వాటర్‌గ్రిడ్ పథకానికి మరింత రుణసాయం -కేంద్ర మంత్రులకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వినతి -వెంకయ్యనాయుడు, గడ్కరీ, రవిశంకర్‌ప్రసాద్‌తో భేటీ -స్మార్ట్ సిటీల కాన్ఫరెన్సుకు మంత్రి వెంకయ్యకు ఆహ్వానం

KTR-with-HUDCO-Chairman-Ravikanth

రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి చేయూతనందించాలని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ నల్లాతో మంచినీరు అందించేందుకు చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకానికి హడ్కో ద్వారా మరింత రుణం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రహదారులు, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంటును సబ్సిడీ రేట్లకే అందించాలని కోరారు. స్మార్ట్ సిటీల జాబితాలో రాష్ట్రంలోని ఐదు నగరాలను చేర్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్ గురువారం కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నితిన్‌గడ్కరీ, రవిశంకర్‌ప్రసాద్‌తో సమావేశమయ్యారు. హడ్కో చైర్మన్ రవికాంత్‌ను కలిసి చర్చలు జరిపారు. స్మార్ట్ సిటీలు, స్మార్ట్ టెక్నాలజీపై తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో హైదరాబాద్‌లో నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా వెంకయ్యనాయుడిని కేటీఆర్ ఆహ్వానించారు. ఆగస్టు 22, 23 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు తప్పకుండా హాజరవుతానని వెంకయ్య హామీ ఇచ్చారు.

KTR-with-Union-Minister-Venkaiah-naidu

పట్టణాల అభివృద్ధికి సాయం కోరాం రాష్ట్రంలోని పట్టణాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సాయం కోరామని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణలోని ఐదు నగరాలను ఎంపిక చేసినందుకు మంత్రి వెంకయ్యనాయుడికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. కేంద్ర మంత్రితో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రారంభించనున్న అమృత్ పథకంలో తెలంగాణ నుంచి వీలైనన్ని ఎక్కువ నగరాలను చేర్చాలని కోరినట్లు తెలిపారు. క్లాస్-1 సిటీల జాబితాలో సిద్దిపేటను కూడా చేర్చాల్సిందిగా కోరానని, అందుకు సానుకూలంగా స్పందించిన వెంకయ్యనాయుడు వెంటనే సంబంధిత అధికారులను పిలిచి వివరాలను పరిశీలించాల్సిందిగా ఆదేశించారని చెప్పారు. అనంతరం హడ్కో చైర్మన్ రవికాంత్‌తో కేటీఆర్ సమావేశమై వాటర్ గ్రిడ్ పథకానికి రుణం అందించాల్సిందిగా కోరారు. ఇప్పటికే ఈ పథకానికి రూ. 10 వేల కోట్ల మేర రుణసాయం చేసిందని, నిబంధనలకు లోబడి మరికొంత ఇవ్వాలని కోరినట్లు మంత్రి తెలిపారు. హడ్కో చైర్మన్ రవికాంత్ మాట్లాడుతూ వాటర్ గ్రిడ్ అద్భుతమైన ప్రాజెక్టు అని, అందువల్లనే రూ.పదివేల కోట్ల రుణాన్ని ఇచ్చామన్నారు. మరింత రుణం కోసం హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం చొరవ తీసుకుంటుందని తెలిపారు.

నితిన్‌గడ్కరీతో భేటీ కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కూడా కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాష్ట్ర రహదారులు, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, మరుగుగొడ్ల నిర్మాణానికి సబ్సిడీ ధరలకు సిమెంటును సరఫరా చేయాలని కోరారు. రానున్న నాలుగేండ్లలో రాష్ట్రంలో సుమారు 36 లక్షల మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందని, ఇందుకు ఏటా రెండులక్షల టన్నుల చొప్పున సబ్సిడీ ధరకు సిమెంటు అందించాలని విన్నవించారు. అందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున వెయ్యి కిలోమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. స్థలాన్వేషణ పూర్తి కాగానే రాష్ట్రంలో డ్రైపోర్టు నిర్మాణానికి చర్యలు చేపడుతామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. జాతీయ నిర్మాణ సంస్థ ఏర్పాటుపై సమీక్ష కోసం త్వరలోనే ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని కేటీఆర్ వెల్లడించారు.

KTR-with-Minister-for-Transport-and-Highways-Nithin-Gadkari

త్వరలోనే ఆర్టీసీ విభజనపై తుది ప్రకటన చేస్తానని గడ్కరీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం కేటీఆర్ కేంద్ర సమాచారశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కేబుల్ లైన్ల నిర్మాణాన్ని వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ నిర్మాణంతో అనుసంధానించాలని, ఫలితంగా సమయంతోపాటు ఖర్చు కూడా కలిసి వస్తుందని వివరించారు. రాష్ట్రంలో 20,475 కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను వేయాల్సి ఉందని, కానీ పనులు ఆశించినంత వేగంగా జరగడంలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయనున్న టెక్నాలజీ హబ్‌కు అన్ని అనుమతులు మంజూరు చేసి, ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రవిశంకర్ ప్రసాద్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.