పారిశ్రామీకరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని మంత్రి శ్రీ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అసెంబ్లీలో ఆర్థిక పద్దులపై జరుగుతున్న చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి… మూతపడ్డ పరిశ్రమలను తెరిపించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. త్వరలోనే సిర్పూర్ పేపర్ మిల్లు ప్రారంభం కాబోతున్నదన్నారు. అందరి కృషి వల్లనే సిర్పూర్ పేపర్ మిల్లును పునరుద్ధరిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో 1730 పరిశ్రమలు మూతపడే స్థితిలో ఉన్నాయని గుర్తు చేశారు. మూత పడే స్థితిలో ఉన్న పరిశ్రమలను కాపాడేందుకు బ్యాంకులతో కలిసి ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెంబర్ వన్‌లో ఉందన్నారు. దళిత, గిరిజన, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు 10,195 పరిశ్రమలకు రాయితీలు ఇచ్చినట్లు మంత్రి సభకు తెలియజేశారు. పెద్ద పెద్ద కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు నగదు దోచుకుని దేశం విడిచి పారిపోతుంటే కేంద్రం స్పందించడం లేదని కేటీఆర్ విమర్శించారు.