Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పాలమూరు పొలికేక!

-వచ్చింది ఆంక్షలతో కూడిన రాష్ట్రమే -టీఆర్‌ఎస్ వస్తేనే సంపూర్ణ తెలంగాణ – నిజాం షుగర్స్ అమ్ముకున్న చంద్రబాబు.. – ఆయనకు శ్రీకష్ణ జన్మస్థానం తప్పదు – రాజకీయ అవినీతిని అంతంచేస్తాం – కాంగ్రెస్ పాలనలో పావలా ప్రజలకు, బారాణా జేబుల్లోకి – రఘువీరారెడ్డి కష్ణాబేసిన్ నీళ్లు తీసుకుపోతుంటే – జెండా ఊపిన సన్నాసి పొన్నాల – ఇంటిపార్టీకి.. ఇంటి జెండాకు ఓటెయ్యండి – అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి – మూడు జిల్లాలుగా మహబూబ్‌నగర్ – టీఆర్‌ఎస్ గెలుపుతోనే అభివద్ధి సాధ్యం – మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ చంద్రబాబుకు శ్రీకష్ణ జన్మస్థానం తప్పదు కాంగ్రెస్ సన్నాసులు ఏనాడైనా పోరాటం చేశారా? వనపర్తి బహిరంగ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

KCr in Palamauru 001

సుదీర్ఘకాలం పోరాటం చేస్తే కేంద్రం ఆంక్షలతో కూడిన తెలంగాణనే ఇచ్చిందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. సచివాలయంలో 90% ఆంధ్రోళ్లే ఉంటే అదేం న్యాయమని తాను ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు విరుచుకుపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వంలో.. ఆంధ్ర ఉద్యోగులు ఆంధ్ర ప్రభుత్వంలో ఉండాల్సిందే. ఆంధ్ర ఉద్యోగులకు మరో ఆప్షన్ లేదు అని కేసీఆర్ విస్పష్టంగా ప్రకటించారు. ఆంక్షలు తొలగించుకుని, సంపూర్ణ తెలంగాణను సాధించుకోవాలంటే టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని అన్నారు. అప్పుడే తెలంగాణ అభివద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కేంద్రం నుంచి పెండింగ్ ప్రాజెక్టులు సాధించుకోవాలంటే పార్లమెంటులోనూ బలంగా ఉండాలని, అందుకోసం రెండు ఓట్లూ కారు గుర్తుకే వేయాలని పిలుపునిచ్చారు. వరుస ఎన్నికల బహిరంగసభలతో ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్న కేసీఆర్ బుధవారం హెలికాప్టర్లో వెళ్లి తొలుత మహబూబ్‌నగర్ జిల్లాలోని వనపర్తి పట్టణంలో, అనంతరం జిల్లా కేంద్రంలో జరిగిన భారీ బహిరంగసభల్లో మాట్లాడారు. చంద్రబాబు, వైఎస్ హయాంలో రాజకీయ అవినీతి విచ్చలవిడిగా మారిందన్న కేసీఆర్.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వారి అక్రమాలన్నింటిపైనా విచారణ జరిపిస్తుందని చెప్పారు.

నిజాం షుగర్స్‌ను అమ్ముకున్న చంద్రబాబుకు శ్రీకష్ణ జన్మస్థానం తప్పదని హెచ్చరించారు. చంద్రబాబు, వెంకయ్యనాయుడు చివరి నిమిషం వరకు తెలంగాణను అడ్డుకున్నవారేనని, వారు తెలంగాణలోనే దుకాణం పెడతామనడం సముచితమేనా? అని ప్రశ్నించారు. చంద్రబాబును సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటి పార్టీ, ఇంటి జెండాకు ఓటేసుకొని తెలంగాణ బతుకులను బాగుపర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ సన్నాసులు ఏనాడైనా తెలంగాణ కోసం పోరాటం చేశారా? కనీసం రాజీనామాలైనా చేశారా? అని ప్రశ్నించారు. పైగా సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు ఉద్యమకారులను లాఠీలతో కొట్టించారని ఆరోపించారు. పాలమూరువాసులు ముంబైకి పోవడం మాని, పాలమూరు వరిపొలాలు కోసేందుకు పక్క జిల్లాల నుంచి వలసలు వచ్చే పరిస్థితి రావాలని అన్నారు. ఆర్డీఎస్ తూములను సీమ గూండాలు బద్దలుకొట్టినప్పుడు కనిపించని నేతలు ఇప్పుడు తెలంగాణ అభివద్ధి అంటున్నారు.

కచ్చితంగా జిల్లాలోని 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని షాద్‌నగర్‌లో కుర్చీ వేసుకొని కూర్చొని కట్టిస్తా అని కేసీఆర్ ఆవేశంగా అన్నారు. కష్ణమ్మ చెంతనే ఉన్నది. అయినా పాలమూరు ప్రజలకు తాగునీరు లేదు. ప్రతి ఇంటికి శుద్ధజలం అందించి, పాలమూరు పచ్చగా ఉండేందుకు కషి చేస్తా అని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాను మూడు చేసి.. కొత్తగా రెండు జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పావలా ప్రజలకు, బారాణా జేబులకు అనే అలవాటు ఉన్నది. అట్లాంటి పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉన్నది అని చెప్పారు. తెలంగాణల టీఆర్‌ఎస్‌కు అధికారం పంట పండి ఉన్నట్లున్నది. కోసి కుప్పదెచ్చుకోవాలె. టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రజలకు వాస్తవాలు వివరించాలె అని పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వం ఆంక్షలతోకూడిన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే సంపూర్ణ తెలంగాణ సాధించుకుంటామని ఆ పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఆంక్షలు తొలగించుకోవడానికి టీఆర్‌ఎస్ అధికారంలోకి రావాలని, అందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేక సందర్భంలో ఎన్నికలు వచ్చాయని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో గెలుపొంది తెలంగాణ ఆశలు ఎట్ల నెరవేర్చుకోవాలో, ఎట్ల తయారు చేసుకోవాలో నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ వెంట సిపాయిలు లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.

బుధవారం నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి బహిరంగసభను వనపర్తి పట్టణ సమీపంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సభలో కేసీఆర్ మాట్లాడారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ అమ్ముకున్న చంద్రబాబుకు శ్రీకష్ణ జన్మస్థానం తప్పదని ఆయన హెచ్చరించారు. క్యాబినెట్‌కు, చట్టానికి వ్యతిరేకంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీని అమ్మేసిన చంద్రబాబుపై కేసులన్నీ తిరగదోడతామని తేల్చి చెప్పారు. చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు చివరి నిమిషం వరకు తెలంగాణను అడ్డుకున్నవారేనని చెప్పారు. వారు తెలంగాణలోనే దుకాణం పెడతామనడం సముచితమేనా? అని ప్రజలను ప్రశ్నించారు. ఇంటి పార్టీ, ఇంటి జెండాకు ఓటేసుకొని తెలంగాణ బతుకులను బాగు పర్చుకోవాలన్నారు.

60 ఏళ్లు గోసపడ్డాం

ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ కలిసిన పాపానికి 60 ఏళ్లు గోస అనుభవించామని కేసీఆర్ చెప్పారు. 1969లో 400 మంది విద్యార్థులు మరణించారని, రెండో దశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థి, యువకులు మరణించారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సన్నాసులు ఏనాడైనా తెలంగాణ కోసం పోరాటం చేశారా? కనీసం రాజీనామాలైనా చేశారా? సకల జనుల సమ్మె జరుగుతున్నప్పుడు విద్యార్థులు, యువకులు, ఉద్యోగులను పోలీసులతో కొట్టించారు. వీరికి మనం ఓట్లు వెయ్యాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం పాటలు పాడిన కష్ణవర్మ, సువర్ణ అశువులు బాశారని చెప్పారు. తాను చావు నోట్లోవరకు పోతే కేంద్రం తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించిందని, మళ్లీ ఆంధ్రా లాబీయింగ్‌కు తలొగ్గి తిరిగి వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. అలుపెరగని పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించామని చెప్పారు.

నిపుణులతో చర్చించి.. మ్యానిఫెస్టో

ఐఏఎస్‌లు, ఆర్థిక నిపుణులతో చర్చించి మ్యానిఫెస్టోను తయారు చేశామని కేసీఆర్ తెలిపారు. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఈ మ్యానిఫెస్టోను చూసి వీటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడని అనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో పావలా ప్రజలకు, బారాణా జేబుల్లోకి పెట్టుకునేవారని, అలాంటి వారికి ఏం తెలుస్తుందని ప్రశ్నించారు. రాజకీయ అవినీతికి పాల్పడితే తన కొడుకైనా, కూతురైనా జైలుకు పంపుతానని కేసీఆర్ చెప్పారు. రాజకీయ అవినీతిని అరికట్టినప్పుడే అభివద్ధి జరుగుతుందన్నారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి పోత్తిరెడ్డిపాడు నుంచి హంద్రీనీవాకు కష్ణాబేసిన్ నీళ్లు తీసుకుపోతుంటే జెండా ఊపిన సన్నాసి పొన్నాల లక్ష్మయ్య అని చెప్పారు. డీకే అరుణ హారతులిచ్చి దీవించారన్న కేసీఆర్.. ఈ సన్నాసులేనా తెలంగాణ ప్రాజెక్టులను కాపాడేది? అని ప్రశ్నించారు.

అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి

టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. 30 ఏళ్ల నుంచి అసంపూర్తిగా ఉన్న కోయిల్‌సాగర్, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులను అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామని చెప్పారు. కొందుర్గు మండలం లక్ష్మీదేవిపల్లిలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి, పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను మూడు చేసి.. వనపర్తి, నాగర్‌కర్నూల్‌ను కొత్తగా జిల్లా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆర్డీఎస్ నీటి కోసం పాలమూరు నుంచి పాదయాత్ర మొదలుపెడితే నడిగడ్డకు పోయినప్పుడు వలవల కన్నీళ్లు వచ్చాయన్నారు.

తుంగభద్ర, కష్ణానది మధ్య ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే 14 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. కష్ణానది రెండుగా చీలే గుర్రంగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 400 కిలోమీటర్ల వరకు నీరు ప్రవహిస్తుందని, పాలమూరు, వరంగల్, నల్గొండ జిల్లాలకు సాగునీరు అందుతుందని వివరించారు. పాలమూరువాసులు ముంబైకి పోవడం మాని, పాలమూరు వరిపొలాలు కోసేందుకు పక్క జిల్లాల నుంచి వలసలు వచ్చే పరిస్థితి రావాలని అన్నారు. పాలమూరులో ఎర్రని, నల్లని పొలాలకు సాగునీరందితే బంగారు పాలమూరుగా మారుతుందని, వలసలను కూడా అరికట్టవచ్చని చెప్పారు. తెలంగాణలో 17 మంది టీఆర్‌ఎస్ ఎంపీలను గెలిపించడం ద్వారా కేంద్రం మెడలు వంచి ప్రాజెక్టులు తెచ్చుకోవచ్చన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపుతోనే అభివద్ధి సాధ్యమవుతుందన్నారు.

కాంట్రాక్ట్ పద్ధతి చంద్రబాబు పుణ్యమే

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంట్రాక్టు పద్ధతి తీసుకొచ్చి శ్రమ దోపిడీకి పాల్పడ్డాడని కేసీఆర్ మండిపడ్డారు. కస్తూర్బాలో పనిచేసే ఉద్యోగులకు రూ.20వేలకుపైగా ఇవ్వాల్సి ఉండగా, రూ.9వేలు ఇవ్వడానికి కారణం చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఆయన ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి లౌకిక పార్టీ అని చెప్పారు. గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మారుస్తామన్నారు. 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామన్నారు. ముస్లింలకు ప్రత్యేక బోర్డుతో రూ కోట్లు కేటాయించి, వారికీ 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించి కలలను సాకారం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు విఠల్‌రావు ఆర్య తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.