Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

పాపం కోదండరాం సార్.. కాంగ్రెస్‌లో కల్యమాకు!

-హస్తం రాజకీయానికి సార్ బలయ్యారు
-జీహుజూర్‌గాళ్లు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతారు
-గాంధీ ఆస్పత్రిలా మారిన గాంధీభవన్
-నిత్యకల్యాణంలా తెలంగాణభవన్
-రాహుల్‌వి సీట్లు, బాబువి నోట్లు.. ఓట్లు మనవే
-సారు+కారు= సర్కారు.. అని ప్రచారంలో ఉంది
-మన గెలుపు విపక్షాలకు చెంపపెట్టు కావాలి
-తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు
-చొప్పదండి, వేములవాడ, వరంగల్ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన పలుపార్టీల నేతలు

కోదండరాం సారును కూరల కల్యమాకు లెక్క వాడుకొని తీసి అవతలపడేశారు. కాంగ్రెస్ రాజకీయంలో ఆయన బలయ్యాడు. మొదలు 119 సీట్లకు పోటీచేస్తమన్న కోదండరాం సారు.. తర్వాత 34 అన్నడు, అటెనుక 17, చివరకు 8 అన్నడు. ఇప్పుడు ఏదీలేదు. జనగామ నుంచి పోటీచేయి అనగానే ఆయన రథాలు, చక్రాలు అన్నీ తయారుచేసుకున్నడు. ఆఖరుకు సారు దగ్గరి నుంచి అదికూడా గుంజుకొని నువ్వు దేశమంతా తిరుగుపో అని, కల్యమాకు లెక్క తీసిపక్కన పెట్టారు అని మంత్రి కే తారకరామారావు కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు ఇదే నిదర్శనమని, అమాయకుడైన ప్రొఫెసర్ కోదండరాంను దారుణంగా మోసగించారని ధ్వజమెత్తారు. ఢిల్లీకి, అమరావతికి బానిసలుగా ఉండే జీహుజూర్‌గాళ్లకు అధికారమిస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని హెచ్చరించారు. పొలిమేరదాక తరిమిన టీడీపీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్‌ను ఎన్నికల్లో ఓడించి అదేగతి పట్టించాలన్నారు. సీట్లు పంచుకో చేతగానోళ్లు రాష్ట్రాన్ని ఏలుతారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చొప్పదండి, వేములవాడ, వరంగల్ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు, వారి అనుచరులు పెద్దసంఖ్యలో ఆదివారం తెలంగాణభవన్‌కు తరలివచ్చి మంత్రి కేటీఆర్, ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.ఆయా నియోజకవార్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు సుంకె రవిశంకర్, చెన్నమనేని రమేశ్‌బాబు, ధాస్యం వినయ్‌భాస్కర్‌తోపాటు, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీలు, జెండాలు వేరయినప్పటికీ అందరి గుండెల్లో కేసీఆర్ ఉన్నారని, పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరు టీఆర్‌ఎస్ గెలుపును కోరుకుంటున్నారని, అందుకే అన్ని పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు వస్తున్నారని తెలిపారు. పలు పార్టీల కార్యకర్తల చేరికలతో తెలంగాణభవన్ నిత్యకల్యాణం పచ్చతోరణంలా వర్ధిల్లుతుంటే.. గాంధీభవన్ గాంధీ ఆస్పత్రిలా మారిందని ఎద్దేవాచేశారు. పబ్బులు, క్లబ్లుల్లో ఉండే బౌన్సర్లు గాంధీభవన్ బీటలు వారకుండా రక్షణ కల్పిస్తున్నారని, సీట్ల కేటాయింపులో మోసపోయిన కాంగ్రెస్ నేతలు కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకున్న కాంగ్రెస్ గోడలు బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని మళ్లీ పరాయి కబంధ హస్తాల్లో పెట్టేందుకు కాంగ్రెస్ బాటలు వేస్తున్నదని, పొలిమేర దాకా తరమిన టీడీపీని మళ్లీ భుజాన వేసుకొని తీసుకొచ్చిందని విమర్శించారు. సిద్ధంతాలను పక్కనపెట్టి చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను చూసి దివంగత ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకున్న చంద్రబాబుకు ప్రతినిధి అయిన రేవూరి ప్రకాష్‌రెడ్డికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావన్నారు. కూటమి టికెట్లన్నీ అమరావతిలో నిర్ణయించారని, అలాంటివారికి అధికారమిస్తే మనం అమరావతికి బానిసలుగా మారాల్సి వస్తుందని, జీవోలు కూడా అమరావతి నుంచే విడుదలవుతాయని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి 30 లేఖలు రాసిన చంద్రబాబుకు తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. రాహుల్ సీట్లు ఇస్తే, బాబు నోట్లు ఇస్తున్నారని, ఓట్లు మాత్రం మనచేతిలోనే ఉన్నాయని చెప్పారు. కూటమి నేతలకు ఓటుతో సరైన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నో ఏండ్ల నుంచి కాంగ్రెస్‌లో మగ్గిన నేతలకు ఆ పార్టీ మొండిచేయి చూపిందని, అందుకే ఆ పార్టీకి హస్తంగుర్తు ఇచ్చినట్లున్నారని ఎద్దేవాచేశారు.

సీఎం కేసీఆర్ చొప్పదండి అల్లుడేనని, ఆయన వివాహం వేములవాడలోనే జరిగిందని చెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో సీఎం కేసీఆర్‌కు మంచి అనుబంధం ఉన్నదని, సారు + కారు = సర్కారు అనేమాట సర్వత్రా వినిపిస్తున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. చొప్పదండి అభ్యర్థి రవిశంకర్‌కు ఓటువేస్తే అది నేరుగా సీఎంగా కేసీఆర్ విజయానికి దోహదంచేస్తుందని చెప్పారు. చొప్పదండిలో పరిస్థితుల దృష్ట్యా అభ్యర్థిని మార్చాల్సివచ్చిందని, గత అభ్యర్థి ఓపిక పట్టకుండా వ్యవహరించి ఇతర పార్టీలో చేరి నమ్మకం కోల్పోయారని అన్నారు. చొప్పదండి ప్రజలు కేసీఆర్‌కే జై కొడతారనే పూర్తిస్థాయి నమ్మకం తమకున్నదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలసహా మొత్తం 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తంచేశారు. అద్భుత పథకాలు అమలు చేసినందుకు కేసీఆర్‌ను ఓడించాలా అని కేటీఆర్ ప్రశ్నిస్తూ.. కారు ఆగొద్దు, డ్రైవర్ మారొద్దని పిలుపునిచ్చారు.

సమైక్య పాలనలో వేములవాడను బద్నామ్ చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వేములవాడకు పోయిన మంత్రి పదవి కోల్పోతాడని తప్పుడు ప్రచారం చేశారని, దక్షిణ కాశీగా పేరున్న వేములవాడను అభివృద్ధికి దూరంగా ఉంచారని, దేవాలయం అని కూడా చూడకుండా అవినీతికి పాల్పడ్డారని చెప్పారు. సీఎం కేసీఆర్ మాత్రం వేమువాడ వేములవాడ అభివృద్దికి రూ.100 కోట్లు కేటాయించి పట్టణం రూపురేఖలు మార్చారని తెలిపారు. వేములవాడ నియోజకవర్గంలో 40 వేల ఎకరాలకు నీరిచ్చామని, 25 ఏండ్లపాటు కాంగ్రెస్‌లో కొనసాగిన ఏనుగు మనోహర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ పాలన నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారని అన్నారు. మనోహర్‌రెడ్డితో తనకు 2006 నుంచి పరిచయం ఉన్నదని, ఆయన చాలా మంచివాడని ప్రశంసించారు. మనోహర్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌లో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని చెప్పారు. వేములవాడ టీఆర్‌ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును భారీ మెజార్టీతో గెలిపించి ప్రత్యర్థులకు బుద్ధిచెప్పాలన్నారు. వేములవాడను దోచిన వారివైపు ఉంటారో, అభివృద్ధిచేసిన వారివైపు ఉంటారో ప్రజలే ఆలోచించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.