Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీళ్లు

ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ వచ్చిన నీళ్లు

బాల్యమంతా రాళ్లు రప్పలు వాగులతోటే సోపతి. రామేశ్వరంపల్లి కూడవెల్లి వాగు ఒడ్డు నా అడ్డ. బడి బందెలకొదిలి చీకటి పడేవరకు వాగు ఒడ్డునే ఉండెటోన్ని. వాగు వరద ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ జల జల పారేది. ఉర్రటి మీదొచ్చిన వరద గుండుకు తాకి ఇంకో గుండు వైపు మళ్ళేది. ఈ దృశ్యం తాలూకు జ్ఞాపకాలే స్కూల్లో సార్‌ చెప్పిన పారగమ్యతతో సింక్‌ అయినయి.

పారగమ్యత.. రాళ్ల గుండా ద్రవాలు ప్రవహించగల సామర్థ్యానికి కొలమానం ఇది. పారగమ్యత ఎక్కువగా ఉన్న రాళ్ల గుండా ద్రవాలు వేగంగా ప్రవహిస్తాయి. సైన్సు అంటేనే ఒంటబట్టకపోయేదిగాని పారగమ్యత ఎందుకో మనసుకు తట్టింది. బాల్యమంతా రాళ్లు రప్పలు వాగులతోటే సోపతి. రామేశ్వరంపల్లి కూడవెల్లి వాగు ఒడ్డు నా అడ్డ. బడి బందెలకొదిలి చీకటి పడేవరకు వాగు ఒడ్డునే ఉండెటోన్ని. వాగు వరద ఒర్రె రాళ్లను ఒరుసుకుంటూ జల జల పారేది. ఉర్రటి మీదొచ్చిన వరద గుండుకు తాకి ఇంకో గుండు వైపు మళ్ళేది. ఈ దృశ్యం తాలూకు జ్ఞాపకాలే స్కూల్లో సార్‌ చెప్పిన పారగమ్యతతో సింక్‌ అయినయి. కూడవెల్లి పొంగితే జనమంతా ఊళ్లకు ఊళ్లు జాతరకు పోయినట్టు పోయి చూసి సంబురపడెటోళ్లు. వాగు ఒడ్డున ఉన్న పరమశివునికి దండం పెట్టుకొని, వాగు తల్లికి పసుపు కుంకుమ గాజులు నైవేద్యం పెట్టెటోళ్లు. కానీ ఆ నీళ్లు ఎటుపోతున్నయో ఒక్కనికీ సోయి లేకుండే. నీళ్లన్నీ అప్పర్‌మానేరు మీదుగా గోదావరిలో వృథాగా కలిసేవి.

పెండ్లయిన తొలినాళ్లలో పండుగకో పబ్బానికో అత్తగారింటికి వెళ్ళేది. అక్కడికి దగ్గరలోనే ఎల్లారెడ్డిపేట ఊరు ఉంది. ఊరు ఒడ్డునే చెరువు. చెరువు పక్కనే బొల్లక్క దేవర గుడి. జూలై ఆగస్టు మాసాల్లో కూడవెల్లి వాగు వరదెళ్ళి పోతుంటే.. అదే సమయంలో ఇక్కడి ప్రజలు వానల కోసం పానసరం పట్టెటోళ్లు. బొల్లక్క దేవరకు బోనం చేసి, పాశం బువ్వ వండి, గుడి బండపై పోసి చేతులతో ముట్టుకోకుండా నోటితో నాకుతూ దేవత కరుణ కోసం చూసేవారు.

ఇక్కడి బండరాళ్ళకు పారగమ్యత ఉన్నది. జలప్రవాహ వేగాన్ని పెంచే గుణం ఉంది. కానీ పారే జలాలు ఏవి? కూడవెల్లి నీళ్ళనే ఆపుకోలేని దుస్థితి మాది. సముద్రమట్టానికి 600 మీటర్ల ఎత్తులో ఉన్న మా నేల మీదికి నీళ్లు ఎట్లా పారుతాయి? ఈ గడ్డమీద పుట్టినప్పుడే ఆకలితో చావాలని రాసి పెట్టుకుని పుడతారు. తలాపునే గోదారి పారుతుంది. ‘గోదావరి అంటే ఆంధ్రులది. నైసర్గిక స్వరూపం రీత్యా గోదావరి నీరు తెలంగాణకు అందటం అసాధ్యం’ అన్న ఆంధ్ర పాలకుల ప్రచారాలనే అమాయకంగా నిస్సహాయంగా నమ్మినం.

తలాపునే గోదారి పారుతుంది. ‘గోదావరి అంటే ఆంధ్రులది. నైసర్గిక స్వరూపం రీత్యా గోదావరి నీరు తెలంగాణకు అందటం అసాధ్యం’ అన్న ఆంధ్ర పాలకుల ప్రచారాలనే అమాయకంగా నిస్సహాయంగా నమ్మినం.కాలచక్రం తిరుగుతున్నది. కాలం గడిచిపోయింది. కొట్లాడిన నాయకుడే ఏలుబడిలోకి వచ్చారు. నీళ్ల విలువేంటో తెలిసిన సీఎం కేసీఆర్‌.. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు, గోదావరి నీళ్లనే లుపుకొచ్చి తెలంగాణ రైతుల పాదాలు కడుగుతున్నారు.

ఏ దేవరకు మా గోస సుతి ముట్టలే. ఏ నేతకు మా గోడు పట్టలేదు. దుబ్బాక భూములు నోళ్లు తెరిచినయి. నన్నూర్ల పెద్ద చెరువులు నెర్రెలు బాసినై. కరువు కమ్ముకున్నది. ఆకలి చావు అందుకుంది. తొలుత దౌల్తాబాద్‌ మండలం హైమద్‌నగర్‌ ఫరీద్‌ ఖాన్‌ ఫకీరు ఉసురు తీసింది. పోతారంలో రాజు, కనగల్లు రాజయ్య ప్రాణాలను ఆకలి బలితీసుకుంది. ఆకలి చావుతో మొదలై రైతు ఆత్మహత్యలు చేనేత ఆత్మహత్యలతో పల్లెలన్నీ వల్లకాడు అయినై.

గుండె పగిలిన రైతుకు ధైర్యం చెప్పేందుకు ఉద్యమ నాయకునిగా 2003లో కేసీఆర్‌ హైమద్‌నగర్‌ వచ్చారు. వెంకటేశ్వరస్వామి గుడి వద్ద సభ పెట్టారు. నీళ్ల గోసను విడమరిచి చెప్పాడు. నీళ్ళతోనే మనకు బతుకు అన్నాడు. కాలచక్రం తిరుగుతున్నది. కాలం గడిచిపోయింది. కొట్లాడిన నాయకుడే ఏలుబడిలోకి వచ్చారు. నీళ్ల విలువేంటో తెలిసిన సీఎం కేసీఆర్‌.. వెళ్లిపోయిన కూడెళ్లి నీళ్లనే కాదు, గోదావరి నీళ్లనే మలుపుకొచ్చి తెలంగాణ రైతుల పాదాలు కడుగుతున్నారు.

కొండపోచమ్మ సాగర్‌ 557 మీటర్ల ఎత్తులోని రంగనాయక్‌సాగర్‌ నుంచి తుక్కాపూర్‌ పంప్‌హౌజ్‌ అక్కడి నుంచి అక్కారం, మర్కూర్‌ పంప్‌హౌజ్‌లలో ఎత్తిపోయడం ద్వారా గోదావరి జలాలు 618 మీటర్ల ఎత్తులోని 15 టీఎంసీల సామర్థ్యం గల కొండపోచమ్మకు చేరుకున్నాయి.. లక్ష్మీబరాజ్‌ నుంచి సుమారు 214 కిలోమీటర్లు ప్రవహించి ప్రాజెక్టులోనే అత్యంత ఎత్తుకు చేరుకున్నాయి. దీంతో తెలంగాణలోని ఎత్తయిన ప్రాం తానికి కాళేశ్వర జలాలు చేరాయి. నడి ఎండాకాలంలో కాళేశ్వరం నీళ్లు పల్లెల్లో పరవళ్ళు తొక్కుతున్నాయి.

ఊరు ప్రజలు పాశం బువ్వ వండి బండ మీద పోసి నోటితో నాకుతూ వర్షాల కోసం సరం పట్టిన ఎల్లారెడ్డిపేట సరిగ్గా 618 మీటర్ల ఎత్తున ఉన్నది. మంత్రి హరీశ్‌రావుతో కలిసి తుక్కాపూర్‌లోని పంప్‌ హౌస్‌ నుంచి దుబ్బాక కాలువలోకి నీళ్ళు వదిలినం. గోదావరి నీళ్లు పారుకుంటూ బొల్లక్క దేవర పాదాలను తడుతూ చెరువులోకి మళ్ళాయి. అక్కడి నుంచి పారే నీళ్లు తరతరాల పల్లెల వల్లకాటి శాపాన్ని కడిగేస్తూ తొగుట, మిర్‌దొడ్డి, దుబ్బాక మండలాల చెరువులను నింపనున్నది. నీళ్లు తాగి పచ్చని మొలక భూమి పొరలను చీల్చుకొని తల ఎత్తుకున్నట్టే.. ఇక దుబ్బాక ప్రాంత యువశక్తి ఆకలిని జయించి, ఆకుపచ్చ తెలంగాణలో భాగమై పోనున్నది.

సోలిపేట రామలింగారెడ్డి (వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్టు, శాసనసభ అంచనాలు, పద్దుల కమిటీ చైర్మన్‌)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.