Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ఒకే కంపెనీ లక్ష ఉద్యోగాలు..

-రాష్ట్రంలో ఫాక్స్‌కాన్‌ మెగా పెట్టుబడి..
-స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి.

తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభు త్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు అన్నారు. రాష్ట్రంలో హోన్‌ హై ఫాక్స్‌ కాన్‌ సంస్థ భారీగా పెట్టుబడి పెట్టి లక్షకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకు రావటం గొప్ప విషయమని పేర్కొన్నారు.

తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభు త్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో హోన్‌ హై ఫాక్స్‌ కాన్‌ సంస్థ భారీగా పెట్టుబడి పెట్టి లక్షకుపైగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ముందుకు రావటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాల్లో సాధ్యమైనంత వరకు స్థానిక యువతకు దక్కేలా చర్యలు చేపడుతామని తెలిపారు.

ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన హోన్‌ హై ఫాక్స్‌ కాన్‌ సంస్థ చైర్మన్‌ యంగ్‌ లియూ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్‌ ఒప్పందం కుదుర్చుకొన్నది. హోన్‌ హై ఫాక్స్‌కాన్‌ సంస్థ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల పరిశ్రమను నెలకొల్పేందుకు మార్గం సుగమమైంది. హైదరాబాద్‌ సమీపంలోని కొంగరకలాన్‌లో ఈ సంస్థకు ప్రభుత్వం ప్రాథమికంగా 250 ఎకరాల భూమిని కేటాయించింది. ఇక్కడ నెలకొల్పే పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రానిక్స్‌ రంగంలో దేశంలోకి వచ్చిన అతిపెద్ద పెట్టుబడుల్లో ఇది ముఖ్యమైనది. ఒకే సంస్థ ద్వారా లక్ష మందికి ఉద్యోగాలు లభించడం అత్యంత అరుదైన విషయం.

తెలంగాణ యువతకే అత్యధిక ఉద్యోగాలు
ఫాక్స్‌కాన్‌ సంస్థ ద్వారా సృష్టించే లక్ష ఉద్యోగాల్లో అత్యధికం తెలంగాణ యువతకే దక్కేలా చర్యలు తీసుకొంటున్నట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకే సంస్థ భారీ పెట్టుబడి ద్వారా లక్షకుపైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం రావడం గొప్ప విషయమని తెలిపారు. రాష్ర్టాన్ని గొప్పగా అభివృద్ధి చేసే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను అమలు చేస్తున్నదని, బంగారు తెలంగాణ సాధన కోసం గొప్పగొప్ప ప్రాజెక్టులు చేపట్టామని పేర్కొన్నారు. ఫాక్స్‌ కాన్‌ సంస్థ తమ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పడం ఇక్కడ పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెట్టేందుకు దోహదపడుతుందని చెప్పారు. తైవాన్‌ను తెలంగాణ సహజ భాగస్వామిగా భావిస్తున్నామని తెలిపారు. ఫాక్స్‌కాన్‌ పురోగమనంలో తెలంగాణ రాష్ట్రం భాగమైనందుకు సంతోషంగా ఉన్నదని అన్నారు. అంతర్జాతీయంగా అనేక దేశాల ఎలక్ట్రానిక్స్‌ రంగ ముఖ చిత్రాలను గుణాత్మకంగా మార్చిన గొప్ప సంస్థ ‘హోన్‌ హై ఫాక్స్‌ కాన్‌’ అని ప్రశంసించారు. ఈ సంస్థ తమ ఉత్పత్తి కార్యకలాపాలకు తెలంగాణ రాష్ర్టాన్ని గమ్యస్థానంగా ఎంచుకొన్నందుకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని యంగ్‌ లియూకు హామీ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్‌ హర్షం
ఫాక్స్‌కాన్‌ యూనిట్‌తో రాబోయే 10 సంవత్సరాల్లో లక్ష మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనుండటం పట్ల ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తంచేశారు. తెలంగాణ రాష్ట్రం గురించి తమ సంస్థ విస్తృతంగా అధ్యయనం చేసిందని, ఇక్కడి పారిశ్రామిక అనుకూల వాతావరణం అద్భుతంగా ఉన్నదని ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లియూ ప్రశంసించారు. ఎనిమిది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో.. ముఖ్యంగా ఐటీ, అనుబంధ ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో గొప్ప ప్రగతి సాధించిందని కొనియాడారు. రాష్ట్రంలో తమ పెట్టుబడుల విషయంలో ఆశావహ దృక్పథంతో ఉన్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నర్సింగ్‌రావు, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీలు రామకృష్ణారావు, అరవింద్‌ కుమార్‌, పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ సుజయ్‌ కారంపూడి తదితరులు పాల్గొన్నారు.

సీఎం స్వదస్తూరీతో లియూకు గ్రీటింగ్‌ కార్డు
ఫాక్స్‌ కాన్‌ చైర్మన్‌ యంగ్‌ లియూకు సీఎం కేసీఆర్‌ అపురూపమైన బహుమతి ఇచ్చారు. లియూ పుట్టిన రోజు గురువారమే కావడంతో సీఎం స్వదస్తూరీతో ప్రత్యేకంగా తయారు చేయించిన గ్రీటింగ్‌ కార్డును ఆయనకు బహూకరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సమావేశం అనంతరం ప్రగతిభవన్‌లో లియూ ప్రతినిధి బృందానికి సీఎం మధ్యాహ్న భోజనంతో ఆతిథ్యమిచ్చారు.

కొంగరకలాన్‌లో యంగ్‌ లియూ పర్యటన
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌లో గురువారం తైవాన్‌ ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఫాక్స్‌కాన్‌ కంపెనీ చైర్మన్‌ యంగ్‌ లియూ పర్యటించారు. ఆయన వెంట కంపెనీకి చెందిన దాదాపు 15 మంది సభ్యుల బృందం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఏర్పాటుకు కొంగరకలాన్‌లోని సర్వే నంబర్‌ 300లలో 250 ఎకరాలు కేటాయించింది. గత రెండు మూడు నెలలుగా రెవెన్యూ శాఖ, టీఎస్‌ఐఐసీ అధికారులు కలిసి భూమిని సర్వేచేసి సిద్ధం చేశారు. దీంతో ఫాక్స్‌కాన్‌ కంపెనీ చైర్మన్‌ యంగ్‌ లియూ తన బృందంతో కలిసి ఆ భూమిని పరిశీలించారు. వారికి టీఎస్‌ఐఐసీ అధికారులు పూర్తి సమాచారం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఈ ప్రాంతంలో కంపెనీ ఏర్పాటు చేస్తున్నామని బృందం సభ్యులు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.