Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

నియోజకవర్గానికి కోటిన్నర

ఆంధ్ర సర్కారు కుట్రలవల్లనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నది. దీన్ని అధిగమించేందుకు అన్ని రకాల చేస్తున్నాం. రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం. మూడేండ్లలో కరెంటులో మిగులు రాష్ట్రంగా తయారయ్యేందుకు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. కానీ ప్రతిపక్షాలు ఈ సమస్యపై అనవసర రాద్ధాంతం చేస్తున్నయి. దీనిని సమర్థంగా తిప్పికొట్టాలి. కొన్ని శాఖలకు ప్రత్యేకంగా మంత్రులు లేరు. -అభివృద్ధి బాధ్యత ఎమ్మెల్యేలదే -l5 నుంచి 23 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు -అన్ని అంశాలపై అందరూ అవగాహన పెంచుకోండి -ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టండి -టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో కేసీఆర్

KCR meeting with MLA's

అలాగని అది మా సబ్జెక్టు కాదని అనుకోవద్దు. అందరూ అన్ని విషయాలపై అవగాహన పెంచుకోండి. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ విషయాన్ని లేవనెత్తినా, సమర్ధంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేసీఆర్ పలు అంశాలపై పార్టీ ప్రజాప్రతినిధులకు సూచనలు చేశారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రతిపక్షాలకు అవకాశం కల్పించకుండా ప్రభుత్వ విధి విధానాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజల్లో ఉంచాలన్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే కీలక పాత్ర..ప్రతి నియోజకవర్గంలో ఆయా శాసనసభ్యులే కీలకంగా వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారని సమాచారం. మంత్రులుగానీ, ఇతరులుగానీ ఎవరూ అందులో జోక్యం చేసుకోరని, నియోజకవర్గ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని చెప్పారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారని తెలిసింది.

ఇప్పటివరకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏడాదికి ఎమ్మెల్యేకు రూ.50 లక్షలు, ఆయా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ద్వారా రూ.50 లక్షల నిధులు ఖర్చు చేసేవారని, ఇక నుంచి ఒకో నియోజకవర్గానికి రూ.1.50 కోట్ల నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి సమావేశంలో ప్రకటించారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది నుంచి రూ.3 కోట్లకు పెంచనున్నట్లు కూడా కేసీఆర్ చెప్పారు. ఎమ్మెల్యేలు లేనిచోట్ల నియోజకవర్గ ఇన్‌చార్జిలకు ప్రాధాన్యం ఉంటుందని, నిధుల వినియోగంలో వారికి సముచిత ప్రాధాన్యం ఇస్తామని కూడా కేసీఆర్ భరోసా ఇచ్చినట్లు తెలిసింది.

తాము నిధులను ఏ నియోజకవర్గంలో, ఎలా వినియోగించాలని ఎమ్మెల్సీలు కేసీఆర్ ముందు సందేహం వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్సీలు ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్లు కానందున ఎక్కువ నియోజకవర్గాల్లో వాటిని ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాల్లో ఖర్చు చేసుకోవచ్చని కూడా సూచించినట్లు సమాచారం. అయితే స్థానిక ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటే గందరగోళం ఉండదని కూడా చెప్పినట్లు తెలిసింది. ఈ ఏడాది డిసెంబర్‌నుంచి మొదలయ్యే చెరువుల పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, కాల్వలతో ఆయకట్టుకు నీరందించేందుకు వెంటనే పనులు వేగిరం చేయాలని సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.

ప్రభుత్వ పథకాల్లో అర్హులందరికి న్యాయం.. రాష్ట్రంలోని ప్రతి ఒక్క అర్హుడికీ పింఛన్, రేషన్‌కార్డు ఇస్తామని, ఇందులో ఎవరికీ ఎలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ఫాస్ట్ పథకం కింద విద్యార్థులకు కూడా అర్హులైన వారికి ఉపకార వేతనాలు అందుతాయని సీఎం భరోసా కల్పించారు. కొన్ని నిబంధనలవల్ల అనర్హులను తొలగిస్తామే తప్ప.. అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగదని, ఈ విషయాన్ని సమర్ధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. వచ్చే నెల ఐదు నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, 18 పని దినాల ప్రాతిపదికన వచ్చే నెల 23వరకు ఈ సమావేశాలు నిర్వహించేందుకు నిర్ణయించినట్లు ప్రకటించారు.

క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగానే ఈసారి బడ్జెట్ రూపకల్పన జరిగిందని, ఇంకా నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన పనులు, ప్రాజెక్టులకు సంబంధించి ఎమ్మెల్యేలు నివేదికలు ఇవ్వాల్సిందిగా కూడా కేసీఆర్ సూచించారు. సాధ్యమైనంతవరకు వాటిని ప్రాధాన్యక్రమంలో ఈ దఫా బడ్జెట్‌లో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తామని, ఒకవేళ ఏవైనా మిగిలి ఉంటే వచ్చే బడ్జెట్‌లో పెట్టుకుందామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అందరూ తెలంగాణ, నియోజకవర్గాల వారీగా అన్ని సమస్యలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.

మరిన్ని మంచి పథకాలు వస్తాయి… రాష్ట్రంలో ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు వివరించారు. ఇవే కాదు.. ఇంకా ఎన్నో మంచి పథకాలు కూడా వస్తాయి.. మీరే చూస్తారు కదా అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. రైతులకు సోలార్ కరెంటు మోటార్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 20 లక్షల కరెంటు మోటార్ల స్థానంలో సోలార్ మోటార్లను బిగిస్తామని, ఇందుకు సంబంధించి ఒక కంపెనీ ముందుకు కూడా వచ్చిందని పేర్కొన్నారు. 5 హెచ్‌పీ, 3 హెచ్‌పీ మోటర్లు ఏడు గంటలపాటు నడిచేవిధంగా ఉంటాయని కూడా కేసీఆర్ వివరించినట్లు సమాచారం.

ఆదాయ పరిమితి పెంపును పరిశీలిస్తాం… సమావేశంలో చాలామంది ఎమ్మెల్యేలు తెల్ల రేషన్ కార్డులకు సంబంధించి విధించిన నిబంధనలపై మాట్లాడినట్లు తెలిసింది. ముఖ్యంగా ఐదెకరాల భూమి, ఏడాదికి రూ.75వేల ఆదాయ పరిమితివంటి నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఐదెకరాల భూమి పరిమితి అనేది కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధన అని, దానిని మార్చేందుకు వీలు కాదని సీఎం స్పష్టంచేశారు. రూ.75వేల ఆదాయ పరిమితిని మాత్రం సడలించేందుకు ఆయన కాస్త సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనిని రూ.2లక్షల వరకు పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పినట్లు సమాచారం.

బాగా పని చేసే అధికారులను నియమించుకోండి జిల్లా, క్షేత్రస్థాయిలో అధికారుల బదిలీల అంశాన్ని చాలామంది ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఇష్టానుసారంగా బదిలీలు వద్దనే హితవు పలికినట్లు సమాచారం. ఈ పదిహేను రోజుల్లో బదిలీల ప్రక్రియ నిర్వహించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆతర్వాత ఉద్యోగస్తులు ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన పనిలో ఉంటారని, జనవరివరకు బదిలీలపై నిషేధం (బ్యాన్) ఉంటున్నందున ఈలోపుగానే ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కూడా సూచించినట్లు తెలిసింది. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో బాగా పని చేసే అధికారులను వేయించుకోవాలని.. జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు మంత్రులు.. మండల స్థాయిలో ఎమ్మెల్యేలు సూచించిన వారికి ప్రాధాన్యం ఉంటుందనే సంకేతాలిచ్చినట్లు సమాచారం.

ఇంకా చేరికలుంటాయి టీఆర్‌ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి భారీ చేరికలే ఉంటాయని సీఎం కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్‌లోని ముగ్గురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే జిల్లాలవారీగా సమీక్షా సమావేశాలు జరుగుతున్న సమయంలో మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి అక్కడికి వచ్చారు. తీగల కృష్ణారెడ్డి ఈనెల 29న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించగా.. ధర్మారెడ్డి కూడా తాను టీఆర్‌ఎస్‌లోకి వచ్చేది ఖరారైందని, ఎప్పుడు, ఎక్కడ చేరాలనే దానిపై తుది నిర్ణయం తీసుకోలేదన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.