-సంస్థ పాలకమండలిని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం -సభ్యులుగా 26 మంది వివిధ విభాగాల అధిపతులు

ఇంజినీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దుతూ, నిర్మాణరంగంలో విశేష కృషిచేస్తున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) తెలంగాణ పాలకమండలిని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఏర్పాటుతో కొత్తగా ఏర్పడిన ఈ సంస్థ గవర్నింగ్ బోర్డుకు సీఎం కే చంద్రశేఖర్‌రావు చైర్మన్‌గా, రోడ్లు, భవనాలశాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. చైర్మన్, వైస్ చైర్మన్‌సహా బోర్డులో 26 మంది సభ్యులు ఉంటారు. ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ కార్యదర్శి సునీల్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. బోర్డు సభ్యులుగా ముంబై న్యాక్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ జనరల్, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు (ఢిల్లీ), బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ చాప్టర్ (హైదరాబాద్) చైర్మన్, కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఢిల్లీ) చైర్మన్, చెన్నై స్ట్రక్చరల్ ఇంజినీర్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ కన్‌స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ హైదరాబాద్ డైరెక్టర్, వీసీ జెఎన్‌టీయూ హైదరాబాద్, ఇండియన్ కాంక్రీట్ ఇన్‌స్టిట్యూట్ చెన్నై డైరెక్టర్, హౌసింగ్ డిపార్టుమెంట్ కార్యదర్శి, సీపీడబ్ల్యూడీ ఢిల్లీ డైరెక్టర్ జనరల్, ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ చైర్మన్-ఎండీ (న్యూ ఢిల్లీ), రవాణా, ఆర్‌అండ్‌బీ శాఖ కార్యదర్శి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్-అర్బన్ డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి, ఇరిగేషన్-క్యాడ్ ముఖ్యకార్యదర్శి, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ వైస్ చైర్మన్-ఎండీ, తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, హౌసింగ్ బోర్డు కమిషనర్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, రాష్ట్ర ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజినీర్, నీటిపారుదలశాఖ చీఫ్ ఇంజినీర్, హైదరాబాద్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్, డీఆర్‌డీవో అడిషనల్ డైరెక్టర్ ఉన్నారు.