Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

ముంచుకొస్తున్నఎరువుల సంక్షోభం


మన దేశానికి ఎరువులు ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో రష్యా, ఉక్రెయిన్‌ కూడా ఉన్నాయి. ఇవి రెండూ ఇప్పుడు యుద్ధంలో మునిగి ఉండటంతో రాబోయే వానకాలం సీజన్‌లో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంటాయా అనే అనిశ్చితి నెలకొన్నది. మరోవైపు దేశీయ ఉత్పత్తి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈ పరిస్థితిని గమనించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన మోదీ ప్రభుత్వం ఈ విషయంలో తీవ్రమైన అలసత్వాన్ని చూపుతున్నది. సకాలంలో ఎరువులు లేకపోతే దేశ వ్యవసాయరంగం సంక్షోభంలో మునిగే ప్రమాదం ఉన్నది.


ఐదవది, మొరాకో నుంచి మనకు డీఏపీ రావాల్సి ఉంది. కానీ, మొరాకోకు అవసరమైన ముడిపదార్థం అమ్మోనియా రష్యా నుంచి సరఫరా కావటం లేదు. దీంతో దీనికి అంతరాయం ఏర్పడింది. ఆరవది, ఎరువుల మార్కెట్లో ఉన్న మరో ప్రముఖ దేశమైన ఇరాన్‌తో ఇప్పటికీ మనకు సరైన ఒప్పందం లేదు.


గత యాసంగి సీజన్లో అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు లేవు. దీంతో ఎరువుల సరఫరా మార్గాల్లో ఎటువంటి ఆటంకాలూ లేవు. కాబట్టి రైతులకు ఎరువుల విషయంలో ఇబ్బందులు ఏర్పడలేదు. కానీ, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే వానకాలం సీజన్‌కు అవసరమైన ఎరువుల లభ్యత గురించి ఆందోళన కలుగుతున్నది. మన దేశానికి కీలక సరఫరాదారులైన రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య దాదాపు రెండు నెలలుగా యుద్ధం కొనసాగుతుండటం, నల్లసముద్రంలో సరఫరా మార్గాలకు ఆటంకాలు ఏర్పడటంతో ఈ పరిస్థితి తలెత్తింది.


ఎంఓపీ (మ్యురియేట్‌ ఆఫ్‌ పొటాష్‌) ఎరువుకు సంబంధించి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎగుమతిదారు రష్యా. మనదేశానికి అవసరమైన ఎంఓపీలో మూడోవంతును రష్యా, బెలారస్‌ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇక యూరియా విషయానికొస్తే.. ఉక్రెయిన్‌పై మనం ఆధారపడుతున్నాం. భారతదేశానికి యూరియా ఎగుమతి చేస్తున్న దేశాల్లో మూడో స్థానంలో ఉక్రెయిన్‌ ఉంది. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్నందున ఆ రెండు దేశాలేగాక బెలారస్‌, ఎస్తోనియా, లాత్వియా వంటి ఇతర దేశాల నుంచి కూడా ఎరువులు వచ్చే పరిస్థితి లేదు. కేంద్రప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తపడి.. ఎరువుల సరఫరా కోసం ఇతర దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవటంలో నిర్లక్ష్యం చూపుతున్నది. దేశీయంగా కూడా ఎరువుల ఉత్పత్తి పెంచడానికి తగిన చర్యలు తీసుకోవడం లేదు. అంతేకాదు.. యూరియా, సహజ వాయువు, డీఏపీ, ఎంఓపీల ధరలు అంతర్జాతీయం గా పెరుగుతూ వాటి భారం రైతులపై పడే పరిస్థితి కనిపిస్తున్నది. దీని నుంచి రైతులను ఆదుకోవటానికి దేశ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తగిన నిధులు కేటాయించాలి. కానీ, ఆ పని చేయకపోగా 2022-23లో ఎరువుల సబ్సిడీకి కేవలం ఒక లక్ష కోట్లు మాత్రమే కేటాయించింది. ఎరువుల సబ్సిడీకి సంబంధించి నిపుణులు ఈ ఆర్థిక సంవత్సరానికి చేసిన అంచనాల్లో ఇది సగం కూడా కాదు.


2021-22లో 356.53 లక్షల మెట్రిక్‌ టన్నుల (ఎల్‌ఎంటీ) యూరియా మనదేశంలో అవసరం కాగా.. 2020-21లో 98.3 ఎల్‌ఎంటీ యూరియాను దిగుమతి చేసుకున్నాం. మనదేశ యూరియా దిగుమతులకు సంబంధించి ఇదే అత్యధికం. 2021-22లో కూడా దాదాపు ఇదే పరిమాణంలో దిగుమతులు ఉండే అవకాశం ఉంది. ఈసారి మంచి నైరుతి రుతుపవనాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ అంచనాల దృష్ట్యా సాగు పెరిగే అవకాశం ఉన్నది. ఫలితంగా దాదాపు 370 ఎల్‌ఎంటీ యూరియా అవసరం అవుతుంది. మరోవైపు దేశీయంగా యూరియా ఉత్పత్తి గడిచిన నాలుగేండ్లలో దాదాపు నాలుగు లక్షల టన్నులు మాత్రమే పెరిగి 246.03 ఎల్‌ఎంటీకి చేరింది. అంటే మరో 125 ఎల్‌ఎంటీ యూరియాను దిగుమతి చేసుకోవాల్సి ఉన్నది.


ప్రధానమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం 2018 నాటికి ఏటా 12.7 ఎల్‌ఎంటీ సామర్థ్యంతో ఉత్పత్తిని ప్రారంభించాల్సిన రామగుండం ఎరువుల కర్మాగారం (జూన్‌ 2021తో సహా అనేక గడువులను దాటినప్పటికీ) ఇంకా ఉత్పత్తి ప్రారంభించలేదు. దేశంలో ఇతర రాష్ర్టాల్లో ఉన్న సింద్రీ, తాల్చేర్‌, గోరఖ్‌పూర్‌, బరౌని వంటి ఇతర ఎరువుల కర్మాగారాల పునరుద్ధరణ కూడా జరగలేదు. దీనిద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఆత్మనిర్భర్‌ కార్యక్రమంపై ఉన్న చిత్తశుద్ధి ఎటువంటిదో తెలుస్తున్నది.
ఇక డీఏపీ విషయానికి వస్తే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా దేశీయంగా ఉత్పత్తి పెరగకపోగా 2019-20లో 45.50 ఎల్‌ఎంటీ ఉన్న ఉత్పత్తి 2020-21 వచ్చేసరికి 37.74 ఎల్‌ఎంటీకి పడిపోయింది. 2021-22లో 123.89 ఎల్‌ఎంటీ డీఏపీ అవసరం ఉండగా దేశీయంగా 37.74 ఎల్‌ఎంటీ ఉత్పత్తి జరిగింది. 48.82 ఎల్‌ఎంటీ దిగుమతిని కూడా కలుపుకొని 86.56 ఎల్‌ఎంటీ మాత్రమే సరఫరా చేయగలిగాం. 2022-23 వానకాలం సీజన్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో 140 ఎల్‌ఎంటీ డీఏపీ అవసరం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతవరకు సరఫరా అవుతుందన్నది అనుమానమే.


ఇక ఎంఓపీ విషయానికివస్తే పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. ఇందులో అత్యధికభాగం రష్యా, బెలారస్‌ నుంచి వస్తున్నది. రాబోయే సీజన్లో సుమారు 40 ఎల్‌ఎంటీ అవసరం ఉంటుందని అంచ నా. దేశీయంగా ఎంతమాత్రం ఉత్పత్తి లేని పరిస్థితిలో ఎంఓపీ ఎంతవరకు అందుబాటులో ఉంటుందనేది అనుమానమే.


యూరియాతో ఎక్కువ సమస్య లేదు. ఎందుకంటే, దాని ధరపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. కానీ, యూరియాయేతర ఎరువులు మాత్రం నియంత్రణ పరిధిలో లేవని ప్రభుత్వం చెప్తున్నది. ఈ ఎరువుల దిగుమతిదారులకు, తయారీదారులకు ఎరువుల్లో ఉండే పోషకాలను బట్టి టన్నుకు ఇంత అనే నిర్ణీత సబ్సిడీని ప్రభుత్వం ఇస్తున్నది. నిజానికి ఇది నియంత్రణ పరిధిలో లేనివి కావు. మరింత నియంత్రణలో ఉన్నవని తేలుతుంది. ఎలాగంటే, ‘నియంత్రణ పరిధిలో లేవని’ పేర్కొంటున్న డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకేల ధరలను నిర్ణయించుకునే అధికారం దిగుమతిదారులకు, కంపెనీలకు లేదు. కానీ, ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంక్షుభిత పరిస్థితుల కారణంగా.. వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి.
కాబట్టి, వీటిని దిగుమతిదారులు నష్టాలకు ఎందుకు దిగుమతి చేసుకుంటారు? రెండో విషయం ఏమంటే.. ఎరువుల సరఫరాకు సంబంధించి విదేశాలతో ఉన్న ఒప్పందం గడువు గతేడాదితో ముగిసిపోయింది. భారత ప్రభు త్వం కొత్తగా ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు. కానీ, రష్యా పాత ఒప్పందానికి అనుగుణంగా ఎరువులను సరఫరా చేస్తుందని కేంద్రం చెబుతున్నది. డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకేలను అదనంగా సరఫరా చేస్తుందని పేర్కొంటున్నది. కానీ, ఇంతవరకూ ఎటువంటి చెల్లింపు ప్రక్రియలు చోటుచేసుకోలేదు. కాబట్టి, కేంద్రం చెప్పే మాటలను నమ్మగలమా?


మూడవది, రష్యా నుంచి దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించింది. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. నాటో, యూరోపియన్‌ దేశాల రక్షణ కింద రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నప్పటికీ.. ఎరువుల విషయంలో ఇది సాధ్యం కాదు. నాలుగవది, కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. డీఏపీ, ఎన్‌పీకేఎస్‌ సరఫరా విషయంలో భారతీయ కంపెనీలు సౌదీ అరేబియా, ఇరాన్‌ నుంచి హామీ పొందాయని చెప్పారు. సౌదీ నుంచి దేశానికి ప్రతి నెలా 30 వేల మెట్రిక్‌ టన్నుల డీఏపీ రాబోతున్నదన్నారు. మనకు 29 లక్షల మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరం కాగా నెలకు 30 వేల టన్నులు దిగుమతి చేసుకొంటూ పోతే, మరికొన్ని నెలల్లో రాబోతున్న వానకాలం సీజన్‌కు కీలకమైన డీఏపీని మోదీ సర్కార్‌ ఎలా సరఫరా చేస్తుంది?


నత్రజని-భాస్వరం-పొటాష్‌-సల్ఫర్‌ (ఎన్‌పీకేఎస్‌) వచ్చే వానకాలం సీజన్‌కు 132 ఎల్‌ఎంటీ అవసరం అని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతేడాది మన దిగుమతులు 13.9 ఎల్‌ఎంటీ కాగా, ఈసారి ఇది 20 ఎల్‌ఎంటీ వరకు అవసరం పడుతుంది. తద్వారా ఖనిజ పోషకాల విషయంలో కూడా మనదేశం ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితే నెలకొన్నది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నిల్వ ఉన్న ఎరువుల విషయం చూస్తే పరిస్థితి పూర్తి నిరాశాజనకంగా ఉంది. మన దగ్గర కేవలం 25 లక్షల టన్నుల డీఏపీ, 5 లక్షల టన్నుల ఎంఓపీ, 10 లక్షల టన్నుల ఎన్‌పీకేఎస్‌ మాత్రమే ఉన్నాయి.
వానకాలం సీజన్‌కు ఎరువులు అందకపోతే ఈ దేశ రైతాంగం దుర్భర పరిస్థితులను ఎదు ర్కొనే ప్రమాదం ఉన్నది.
ఇవి తలెత్తకూడదంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి? ఉన్న మార్గాలేమిటి?


ఎరువులపై కంపెనీలకు ఇచ్చే సబ్సిడీని అందులో పోషకాల ఆధారంగా కాకుండా ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ ధరల ఆధారంగా ఇచ్చినట్లయితే ఎరువుల దిగుమతికి కంపెనీలు ముందుకువస్తాయి.
2022-23 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎరువుల సబ్సిడీకి రూ.1.09 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కేటాయింపుల (రూ.1.62 లక్షల కోట్లు) కంటే తక్కు వ. అంతర్జాతీయ మార్కెట్లలో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిన దృష్ట్యా కేటాయింపులను కనీసం రూ.2 లక్షల కోట్లకు పెంచాలి.
రాబోయే వానకాలం సీజన్‌కు రైతులు సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, కాంప్లెక్స్‌ ఎరువులను వినియోగించేటట్టు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించాలి.
అంతర్జాతీయంగా సహజ వాయువు ధరలు గణనీయంగా పెరిగాయి. యూరియా తయారీ వ్యయంలో దాదాపు 70 శాతం ఖర్చు సహజ వాయువుదే. కాబట్టి.. కేంద్రం ఎరువుల కంపెనీలకు సరఫరా చేసే గ్యాస్‌ ధరపై సమీక్షించి నిర్ణయం తీసుకోవాలి.
ఎరువుల దిగుమతిలో అడ్డంకులను తొలగించడానికి కేంద్ర రసాయనాలు-ఎరువులు, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, పరిశ్రమల మంత్రిత్వశాఖల మధ్య సమన్వయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి.

  • (వ్యాసకర్త: డాక్టర్‌ రంజిత్‌ రెడ్డి, పార్లమెంట్‌ సభ్యులు, చేవెళ్ల)
MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.